పుస్తక సమీక్ష

పుస్తకావిష్కరణ

“నేత మొగ్గలు”

-డా. భీంపల్లి శ్రీకాంత్

పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి పులి జమున రచించిన “నేత మొగ్గలు” కవితాసంపుటిని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగష్ట్ 7 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల ఎక్స్ పో ప్లాజాలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరికతకు ఆనవాళ్ళు కులవృత్తులని ఆయా కులవృత్తుల ద్వారానే సమాజం అభివృద్ధి చెందిందన్నారు. సమాజానికి వస్త్రదానం చేసిన గొప్ప చరిత్ర పద్మశాలీయులదని ప్రశంసించారు. పద్మశాలీయులు బట్టలను నేయడం వల్లనే అందరూ ధరిస్తున్నారన్నారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూత పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రతి సోమవారం అందరూ చేనేత దుస్తులను ధరిస్తే నేత కార్మికులందరికీ జీవనోపాధి కలుగుతుందన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పులి జమున “నేత మొగ్గలు” రాయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్, మున్సిపల్ చైర్మన్ కె.నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, డిసిసిబి వైస్ చైర్మన్ కె.వెంకటయ్య, కౌన్సిలర్ కృష్ణమోహన్, నాయకులు తిరుమల వెంకటేష్, పొబ్బతి సత్యనారాయణరాజు, పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, యువకవి బోల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

======================================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked