సారస్వతం

పేరులో (name) నేముంది​!

సారస్వతం
​-శారదాప్రసాద్ ​​​ఆ మధ్య మేము అమెరికా వెళ్ళినపుడు,మా అమ్మాయి స్నేహితురాలు ఇంటికి వెళ్ళటం జరి​గింది. వాళ్ళూ తెలుగు వాళ్ళే. ఆ అమ్మాయి తల్లి తండ్రులు,అత్తా మామలు అందరూ హైదరాబాద్ లో స్థిరపడ్డా​రట. ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు.​ ​' అమ్మా ! నీ పిల్లల పేర్లేమిటీ?'​ ​అని ఆ అమ్మాయిని కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకునే క్రమంలో​ ​అడగటం జరి​గింది. అందుకు ఆ అమ్మాయి​ ​'అంకుల్! మా పెద్ద అమ్మాయి పేరు 'తుషి',రెండవ అమ్మాయి పేరు 'మాయ​' అని చెప్పగానే నేను బిత్తరపోయాను. 'తుషి అంటే అర్ధం ఏమిటమ్మా?' అని ఆ అమ్మాయిని అడిగితే,ఆ అమ్మాయి 'నాకు తెలియదండి,'త' కారం వచ్చేటట్లు పేరు ​ఉండాలని మా పురోహితుడు చెబితే,నేనూ మా వారు కుస్తీపడి​ ​'​ ​పిల్లల పేర్లు' అనే పుస్తకం చూడటమే కాకుండా నెట్ లో కూడా వెతికి తుషి అనే పేరు ఖాయం చేశామండి' అని గర్వంగా ఏదో ఘనకార్యం సాధించినట్లు చెప్పింది.మరి మీ పెద్దవారి సలహా తీసు​కోలేదా?​ ​అని నేనడి

జ్యోతిషము నమ్మదగినదేనా ?

సారస్వతం
-క వ న శర్మ నా లక్ష్యం ఒక వైపున, జ్యోతిషమును సైన్సు సమర్ధించదు అని , సైన్సు తెలిసిన కొందరు ఉద్దండ పండితులు చెప్తూ ఉంటె , హేతువాదులుగా చెలామణి అయ్యే మహామహులు జ్యోతిషము ఒక మూఢ నమ్మకం దాన్ని నమ్మ వద్దు అని ప్రచారం చేస్తూ ఉంటారు.దానికి ఎన్నో ఉదాహరణ లిస్తారు మరో వైపు అది ఋషి ప్రోక్తమని నమ్మదగినదేనని వాదించే ఉద్దండ జోస్యులు ఉన్నారు . వారీ జోస్యం నిజమైన ఎన్నో ఉదాహరణ లిస్తారు. వీరే కాకుండా , తమ విషయం లో , లేక తమ వారి జీవితాల్లో ఫలించిన జోస్యాల గురించి చెప్పే పామరులు , విద్యావంతులు కూడా అసంఖ్యాకులు అనేకులు ఉన్నారు. సైన్సు క్షుణ్ణం గా తెలిసిన మరి కొందరు, అది ఎందుకు నమ్మదగినదో సైన్సు పరం గా సమర్ధిస్తూ స్వానుభవ పూర్వకం గా వివిరిస్తూ ఉంటారు . ఈ మూడింటిని సమీక్షించటం నేను చెయ్య బూనుకున్న పని . నాకంటే బాగా తెలిసిన వారు పూనుకుంటే బావుంటుంది. కాని వారికి దీనిపై సమయం వెచ్చించటానికి తీరిక ఉండక పోవటం,

అష్టవిధ నాయికలు – కలహాంతరిత

సారస్వతం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య కలహాంతరిత అనే నాయికకు నాట్యశాస్త్రంలో "ఈర్యాకలహనిష్క్రాన్తో యస్యా నాగచ్ఛతి ప్రియః|సామర్షవశసంప్రాప్తా కలహాన్తరితా భవేత్||” అని నిర్వచనం చెప్పబడినది. అనగా "కలహేన అంతరితా వ్యవహితా అర్థాత్ ప్రాణనాథతః" అంటే "కలహమువల్ల ప్రాణవల్లభునితో ఎడబాటుకు గురియైనది" అని కలహాంతరితా శబ్దమునకు వ్యుత్పత్తి ఉన్నది. ఈ కలహము అనేది రోషము లేక ఈర్ష్యాసహనములచేత కలుగవచ్చును. ఇట్టి మనఃస్థితి అన్యకాంతానురక్తుడైన నాయకుని విషయంలో సాధారణముగా సహజము. తనచే కోపించబడి, దూషించబడి, దూరమైన నాయకునిగూర్చి చింతించుచు, తన చర్యకు తాను పశ్చాత్తాపము నొందుచు ఉన్న నాయికను కలహాంతరిత అంటారు. "అమరుకశతకం" లోని శ్లోకము ఒకటి ‘కలహాంతరితకు చక్కని ఉదాహరణగా చెప్పబడినది: "చరణపతన ప్రత్యాఖ్యాన ప్రసాద పరాఙ్ముఖే/నిభృతకితవాచారేత్యుక్తే రుషాపరుషీకృతే|వ్రజతి రమణే నిఃశ్వస్యోచ్చైః స్తనార్పితహస్తయా/నయనసలిలచ్ఛన్నా దృష్టిస్సఖీషు నిపాతితా

జ్యోతిష సారము

సారస్వతం
- Murali Vadavalli ‘నువ్వు జ్యోతిషం నేర్చుకోవడం మొదలుపెట్టి ఎన్నేళ్ళయ్యింది?’ ‘పాతికేళ్ళు’. ‘ఈ పాతికేళ్ళలో ఏమి నేర్చుకున్నావో స్థూలంగా చెప్పగలవా?’ ‘తప్పకుండా. నేను తెలుసుకున్నవాటిలో నిజంగా పనికొచ్చేది ఒక్కటే ఉంది. అది తెలుసుకున్నాక ఇక జ్యోతిషంతో పనిలేదని కూడా తెలిసింది.’ ‘అలాగా, అదేమిటో కాస్త చెప్పుదూ.’ ‘అలాగే, విను. జ్యోతిషమంటే జనసామాన్యంలో ఉన్న అభిప్రాయమేమిటంటే, దాన్ని ఉపయోగించి మన జీవితంలోని కష్టనష్టాల్నీ, వాటికి పరిష్కారాలనీ, అలాగే సుఖపడే యోగాలనీ, అవి కలిగే సమయాన్నీ తెలుసుకోవచ్చని. ఈ వివరాలన్నీ చాలా ఖచ్చితంగా తెలుసుకోవచ్చని. నేను మొదటగా గ్రహించినదేమిటంటే, ఈ అభిప్రాయం కొంతమటుకు నిజమే కానీ, కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యడం వల్ల ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాదని. ఉదాహరణకి, ఒకాయన వచ్చి మా అబ్బాయికి పదో తరగతిలో లెక్కల్లో ఎన్ని మార్కులు వస్తాయో జాతకం చూసి చెప్పగలరా అ

తెలుగేల యన్న…..

సారస్వతం
- వాసిరెడ్డి అమర్ నాథ్ Founder Chairman of Slate Schools (AP & Telangana) " నా బుజ్జి కన్నా ! బంగారు కొండా .. నీకు లాల పోస్తాను .. అయ్యాక వెండి గిన్నెలో చందమామ రావే అంటూ గోరు ముద్దలు తినిపిస్తాను .. అయ్యాక ఇద్దరం కలిసి బజ్జున్దాము . అప్పుడు నీకు కాశీ మజిలీ కథ లు చెపుతాను . సరేనా ... నా చిట్టి తండ్రికి బుగ్గన చుక్క పెట్టాలి .. ఈ రోజు నా దిష్టి తగిలేట్టు వుంది " అర్థం చెడకుండా దీన్ని ప్రపంచం లోని ఏ ఇతర భాష లో కైనా అనువదించండి చూద్దాం ! కావడం లేదా ? పోనీ దీన్ని ట్రై చెయ్యండి . " నాకు కడుపు కోత మిగిలిచ్చి వెళ్ళిపోయావు కదరా నా తండ్రీ!.. ఏదో బిడ్డ బాగుపడుతాడు.... మంచి కొలువు సాధిస్తాడు . కడుపులో చల్ల కదలకుండా బతుకుతాడు ....అని నిన్ను ఆ కార్పొరేట్ హాస్టల్ వేయించాను . ఆ నరరూప రాక్షసులు బిడ్డ ఉసురు పోసుకొంటారు నేనేమైనా కలకన్నానా ? గర్భశోకం పగవాడికి కూడా వద్దు తండ్రీ !.......... " కావడం ల

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు – ఖండిత - టేకుమళ్ళ వెంకటప్పయ్య కావ్యములలో శృంగారరసమునకు ఆలంబనగా నాయికానాయకులు నిలుస్తారు. నాయికానాయకుల చక్షుష్ప్రీతి, మనస్సంగములవల్ల కలుగు మనోవికారమే రూఢమై శృంగారరసముగా పరిణమించును. నాయికా ప్రసక్తిలో ఆసక్తికరమైన విషయము అష్టవిధశృంగార నాయికావర్గీకరణము. ఇది నాయిక తాత్కాలిక మనోధర్మ వర్గీకరణమే కాని, నాయికాప్రకృతి వర్గీకరణము కాదు. అనగా ఒకే నాయిక తత్తత్కాలమనోధర్మము ననుసరించి, ఈ అష్టవర్గములలో ఏదో యొక వర్గమునకు చెంది యుండుననుట సబబు. ఆ కోవలో ఖండిత ఒక నాయిక. ఈ మాసం ఖండిత నాయికను గుఱించి అన్నమయ్య ఏ విధంగా తెలియజేశాడో తెలుసుకునే ముందుగా ఖండిత నాయిక లక్షణాలను తెలుసుకుందాం. ఖండిత నాయికను "నీత్వాఽన్యత్ర నిశాం ప్రాతరాగతే ప్రాణవల్లభే| / అన్యాసంభోగచిహ్నై స్తు కుపితా ఖండితా మతా||" అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో నిర్వచించాడు. అనగా ‘రాత్రియంతయు అన్యకాంతతో గడిపి, ప్రొద్దున తత్సంభోగచిహ్నముల

కఠోపనిషత్ 

సారస్వతం
-శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) 'ఉపనిషత్' అనగా, దగ్గరగా అందించునది అని అర్ధం చెప్పుకోవచ్చును. (ఎవరి దగ్గర జ్ఞానం పొందవలనో, దానిని వారి సమీపమునుండి పొందటమే!) ఇట్టి ఉపనిషత్ లు ప్రధానంగా పది ఉన్నాయని చెప్పవచ్చు.కొందరు 108 అని అంటారు. ఇలాంటి దశోపనిషత్లలో చాలా ప్రధానమైనది,కఠోపనిషత్. ఈ ఉపనిషత్ కృష్ణయజుర్వేదమునకు చెందినది.ఈ ఉపనిషత్ లో విచిత్రమేమంటే, ఇది ఉపదేసించేవాడు,సాక్షాత్తు యముడు.'యమము' అనగా సద్గుణమునకు అధిదేవత. ఈ 'యమము' నకు సంబంధించిన శిక్షణ శరీరంలో జీవుడువుండగానే జరుగ వలెను.(బండి నడుచు చున్నప్పుడే, repair చేయించు కొనవలెను-- Master CVV ) జీవుడు దేహమున ప్రవేశించి భూమిపై పడిన తర్వాత జరుగునదే యమమునకు తగు శిక్షణ. కనుక,జననమే యమ దర్శనమనవచ్చును!ఈ ఉపనిషత్ లో వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు, ఋషి పుంగవుడు---విశ్వజిద్యాగం చేస్తూ ఉంటాడు.తనది అనేది అంతా  ఇచ్చేయాలని, పరబ్రహ్మం అంతర్యామియై తనయందు సృష్టిని క

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కుంతీదేవి ద్రౌపదిని చూసి సహదేవుని విషయమై “కాదు(బ సిబిడ్డ వీ(డొకటి గాదవునా నేఱు(గండు ముందరె య్యెడ నొక పాటేఱుంగ(డెద యెంతయు(గోమల మెప్పుడైన నే( గుడువ(గ బిల్తు(గాని తనకుం గల యా(కటి ప్రొద్దేఱుంగ(డీ కొడుకిటు పోకకున్ మనము గుందెడు ని గని యూఱడిల్లెడున్" ఈ పద్యంలో తనకు సహదేవుని పట్లగల వాత్సల్యాతిశయాన్ని హృదయద్రవీకరణంగా ద్రౌపదికి కుంతీదేవి తెలపటం కన్పిస్తుంది. భాగవతాన్ని రచించిన పోతన్నగారి కవిత్వం అంతా రసార్ణవమే. "నల్లనివా(డు పద్మనయనంబుల వా(డు కృపారసంబు పై( జల్లెడు వా(డుమౌళి పరిసర్పిత పింఛమువా(డు నవ్వురా జిల్లెడు మోమువా(డొక(డు చెల్వల మానధనంబు దెచ్చెనో మల్లియలార! మీ పొదలమాటున లే(డు గదమ్మ! చెప్పరే" ఈ పద్యం మనోహరమైన అనుభూతులతో నిండిన పద్యం. ఈ మహాకావ్యాలన్నీ అనుభూతికి ఉదాహరణలే అయినా, స్థాలీపులాక న్యాయంగా నేను ఈ ఉదాహరణలను ఇస్తున్నాను. ప్రబంధయుగంలో ప్రథమ ప్రఖ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు – విప్రలబ్ధ - టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య కీర్తించిన విప్రలబ్ధ శృంగార కీర్తన తెలుసుకునే ముందు విప్రలబ్ధ నాయిక గురించి కొంత తెలుసుకుందాం. “క్వచిత్సంకేత మావేద్య దయితే నాథవఞ్చితా| స్మరార్తా విప్రలబ్ధేతి కలావిద్భిః ప్రకీర్త్యతే||” అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో చెప్పాడు. "ఒకానొక సంకేతస్థలమునకు రమ్మనిన ప్రియుడు, ఆ సంకేతమునకు తాను రాకుండుటచే వంచింపబడి, స్మరార్తయైన నాయిక విప్రలబ్ధ యని కలావిదులందురు" అని అర్థము. భానుదత్తుడు రసమంజరిలో "సంకేతనికేతనే ప్రియమనవలోక్యసమాకులహృదయా విప్రలబ్ధా| అస్యాశ్చేష్టా నిర్వేద నిశ్వాస సంతాపాలాప భయ సఖీజనోపాలంభ చింతాశ్రుపాత మూర్ఛాదయః|" – అన్నాడు. ‘సంకేతనికేతనమున ప్రియుని గానక వ్యాకులమతి యగునది విప్రలబ్ధ. తత్ఫలితముగా నీమె నిర్వేదము, నిశ్వాసము, సంతాపము, ప్రలాపము, భయము, చెలులను, పరిసరములను నిందించుట, చింతించుట, ఏడ్చుట, మూర్ఛిల్లుట – అను చేష్టలను చేయు