Author: Sujanaranjani

కలియుగ అజామిళ

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారద్దేశం. అప్పల్నాయుడు పుట్టినప్పుడు జాతకం చూసిన పంతులు చెప్పడం ప్రకారం నాయుడిది సింహ లగ్నం. ఎలాగైనా సరే పెద్దయ్యాక నాయకుడై తీరుతాడు. అయితే ఎందులో నాయకుడౌతాడనేది పెంపకాన్ని బట్టి ఉంటుందనీ అందుకోసం నాయుడి తండ్రి కొంచెం కష్టపడాలనీ పంతులు చెప్పాక అప్పల్నాయుడి తండ్రి ఆలోచించాడు - ఏ లైన్లో కుర్రాణ్ణి సులభంగా నాయకుణ్ణి చేయచ్చో, ఏ వృత్తిలో అయితే పెద్ద చదువు, సంధ్యా అక్కర్లేదో, ఏదైతే లక్ష్మీ కటాక్షం కురిపిస్తుందో. దీని కోసం నాయిడి తండ్రికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. నాయుడికి సరిపోయేవి రాజకీయాలు. ఓ సారి ఊళ్ళో సర్పంచో ఏదో ఒకటి అయితే అక్కణ్ణుంచి జిల్లాకి, తర్వాత ఎమ్మెల్యే అలా పైకి పాకడం తారాజువ్వ ఆకాశంలోకి ఎగిరినట్టూ జరిగిపోతుంది. సింహ లగ్న ప్రభావమో మరోటో కానీ మూడో క్లాసులోంచే అప్పల్నాయిడు నాయకుడి లక్షణాలు చూపించడం మొదలుపెట్టేడు - పక్కింటి అమ్

వికారి ఉగాది

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు తెలుగు సంవత్సరాల పేర్లలో కొన్ని వినగానే మంచి భావనను కలిగించకపోవచ్చు. వికృతి, రాక్షస, దుర్మతి పేర్లలాగానే మనకు రాబోయే సంవత్సరం 'వికారి ' అదే కోవకు చెందుతుంది. కాని పండితులు, భాషావేత్తలు ఆ పదాలకు మూలాలు వెదికి మనకు సంతోషం కలిగించే అర్థాలు చెబుతారు. ఈ సందర్భంగా అచ్చ తెలుగు అవధాని డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు రాసిన తేటగీతి చదవండి. దేవభాష 'వికారమే' తెలుగు 'మార్పు ' మార్పులొప్ప 'వికారి ' నామంబు వచ్చె భయమదేటికి? నీ పేరు బాగు బాగు మంచి మార్పులు తెమ్ము సేమమ్ము నిమ్ము వారు రాసిన ఇతర పద్యాలతో, ఇతర కవుల కవితలతో, నవ్వించే కార్టూన్లతో ఉగాది ప్రత్యేక సంచిక ఉగాదినాడు విడుదల అవుతుంది. ఆ సంచికను అంతర్జాలంలో కూడా ఉంచబడుతుంది. వివరాలకై వేచివుండండి. శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాభినందనలతో...

ఏకాకి జీవితం

కవితా స్రవంతి
డి.నాగజ్యోతిశేఖర్ మురమళ్ళ, తూర్పుగోదావరి జిల్లా. 9492164193 కాలం గుప్పిట్లో బందీనై నిన్ను నేను ఎడబాసినప్పటికీ... నా ఒంటరి నిశీధి అంచుల్లో చెకుముకి రాళ్ళై నీ జ్ఞాపకాలు నాలో రాపాడుతూనేఉన్నాయి! వేదనకొమ్మల్లో పూలపిట్టలై నీ ఆలోచనలు నాతో సంఘర్షిస్తూనేఉన్నాయి! గతం శిథిలాల్లో స్మృతుల తీగలై నీ చేరువలు నన్ను అల్లుకోవాలని తపనపడుతూనే ఉన్నాయి! కన్నీటి కొసల్లో కొసమెరుపులై నీ సాంగత్యాలు నన్ను ఓదారుస్తూనేఉన్నాయి! గుండె పటం ఫ్రేములో వెచ్చని ముద్రలై నీ ఔన్నత్యాలు నన్ను తడుముతూనే ఉన్నాయి! నాకు తెలుసు... నేనేం కోల్పోయానో... ఇంక... నీ ఎడబాటు చీకటిని తరగడం నా తరం కావడం లేదు! నీ జంటబాసిన సమయాలను దాటాలంటే నా శ్వాసకు అడుగుసాగడం లేదు! నీవు లేని ఈ ‘ఏకాంతాన్ని’ ఏలాలంటే దహనమౌతున్న నా హృదయతనువుకు సాధ్యం కావడం లేదు! పొరలుపొరలుగా పొగిలివస్తున్న దుఃఖ సంద్రాన్ని వెలేయడానికి గుండె గొ

నిత్య సూర్యుళ్ళం!

కవితా స్రవంతి
వెన్నెల సత్యం షాద్ నగర్ 94400 32210 ఎప్పట్లాగే ఈ రోజూ ఈ రోజు కోడి కూత కన్నా ముందే నిద్ర లేచాను నా స్వేచ్ఛా ప్రపంచపు వంటింట్లోకి ఠంచనుగా అడుగు పెట్టాను! యుద్ధభూమిని తలపించే ఆ వంట గదిలో పాత్రలతో పోరు చేస్తూ కాయగూరలతో కత్తియుద్ధం చేస్తూ చెమటోడుస్తున్నాను! జిహ్వకో కూర తీరొక్క అల్పాహారాలతో తిండికీ నోచుకోని తీరిక లేని పనులు మసిబారిన మగ దురహంకారపు అంట్లన్నీ తోముతూ దుష్ట సంప్రదాయాల మురికి గుడ్డల్ని ఉతుకుతూ కసవు నిండిన మది గదులన్నీ ఊడుస్తూ తుడుస్తూ బడలిక ఎరుగని బానిసలా ఏ అర్ధరాత్రో తీసే కూసింత కునుకు మా శరీరాలకే గానీ మనసులకు మాత్రం విశ్రాంతి ఎండమావే! మున్నూట అరవై ఐదు రోజులూ సూర్యుడితో పోటీ పడుతూ శ్రమశక్తితో ప్రపంచాన్ని నడిపించే మాకు ఏడాదికోసారి మీరిచ్చే గౌరవాలు అక్కర్లేదు! మా విన్నపాన్ని మన్నించండి మమ్మల్ని దేవతల్ని చేయక్కర్లేదు సాటి మనిషిగా చూడండి

ఓటు నీ సిఫార్సులేఖ

కవితా స్రవంతి
- శ్రీ గాదిరాజు మధుసూదన రాజు తెల్లారకముందేచీకట్లోలేచి ఇంట్లోంచి బయల్దేరి.. ఎక్కడుంటారో ఎప్పుడుంటారో ఎలావుంటారో కనుక్కుంటూ బతుకుబాగుచేసుకునేందుకు సాయాలూ సిఫార్సులేవో చేస్తారని ఆశిస్తూ కలలుగంటూ ఎమ్మెల్యే మంత్రీ సియం యంపీ పియమ్ముల కలవాలంటూ రేయింబగళ్ళూ పడిగాపులుకాచావునీవు! వాళ్ళంతా కట్టకట్టుకుని ఆ పదవులు అందుకునేందుకు నీ ఓటుసిఫార్సు కోసం నీ వద్దకు వస్తున్నారు ఆలోచించుకో గుర్తుకు తెచ్చుకో కనీసంనిన్ను ఓటరుగాగుర్తించిన వారెవరో ఒక్కవోటుతో నేనేంచేస్తా ననిధైర్యం వీడకు ఒక్కొక్కచుక్కకలిస్తేనే సముద్రం అయ్యిందికడకు ఓటు నీ సిఫార్సులేఖ ఎవరికిస్తావో నీ ఇష్టం నీ అనుభవాలను క్రోడీకరించు నీ తెలివినంతా చూపించు వోటేసి మంచిని గెలిపించు భవిష్యన్నిర్ణేతవై నీ సత్తాచూపించు నీకు నచ్చిన నేతలతో నీ పాలన సాగించు నిజమైన ప్రజా స్వామ్యాన్ని నీ వోటుతో స్థాపించు!!

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
అనుభూతి కవిత్వం ఒక వాదంగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో టి.యల్. కాంతారావుగారు ఎంతో ఆనందంగా ఈ వాదాన్ని గురించి చర్చించారు. వారి వారి భావాల్లో "భావ అభ్యుదయ కవితా ప్రక్రియల అనంతరం తిలక్ భావనా స్రవంతిలో వచ్చిన ఒకానొక విశిష్టపరిణామం అనుభూతి వాదం" అని చెప్పారు. ఇదే విషయాన్ని కొనసాగిస్తూ, “అనుభూతివాదం యొక్క పారమార్థిక లక్షణమేమిటంటే - కవి తన గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న అనేకానేక స్వచ్ఛమైన భావతరంగాలకి ఏ ఆర్భాటం లేకుండా స్పష్టమైన ఆకృతినివ్వటం.” ఈ వ్యాఖ్య సమగ్రమైన వ్యాఖ్యగా గమనింపగలం. స్వచ్ఛమైన భావతరంగాలు అనటంలో కవి హృదయంలోంచి కెరటాల వలే ఉవ్వెత్తుగా లేచే భావపరంపరకు ఏ నిబద్ధతా, ఏ నియమాలూ లేవు అని చెప్పటం గమనింపవచ్చు. ఆ భావాలు ఏ ఆర్భాటం లేకుండా ఉంటాయి అంటే భావకవిత్వంలో ఉండే స్వాప్నిక డోలికావిహారం ఇందులో లేదు అనుకోవచ్చు. స్పష్టమైన ఆకృతి ఇవ్వటం అనటంలో సమకాలీనంగా సాగిస్తున్న అభ్యుదయ కవులమని చెప్పుకునేవారు ర

రావణుడి శివాపచారం

ధారావాహికలు
అప్పుడు రావణుడు కుబేరుడి దివ్యభవన సింహద్వారం దగ్గరకు చొచ్చుకొని పోయినాడు. అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న సూర్యభానుడు రావణుణ్ణి తీవ్రంగా ఎదిరించాడు. దాపులో ఉన్న ఒక స్తంభాన్ని పెకలించి దానితో దశకంఠుణ్ణి మోదాడు. అయతే బ్రహ్మ వర ప్రభావం వల్ల రావణుడు చావలేదు. కాని రక్తం కక్కాడు. దానితో ఒళ్ళు తెలియని కోపావేశంతో ఆ స్తంబాన్నే చేతపట్టి సూర్యభానుణ్ణి మోది వైరిని విగతజీవుణ్ణి చేశాడు. దీనితో యక్షుల బలం కకావికలమై పోయింది.కొందరు కుప్పకూలి పోయినారు. కొందరు గుహలలో దూరి ప్రాణాలు రక్షించుకున్నారు. కొందరు నిశ్చేష్ట్రులైనారు. వాళ్లకు కాలు చేతులాడలేదు. అప్పుడు కుబేరుడు, మణిభద్రుడనే యక్ష ప్రముఖున్ని చూసి 'పాపాత్ముడైన, క్రూరపరాక్రముడైన రావణుణ్ణి వధించి యక్షులను రక్షించే భారం నీదే'నని ఆనతిచ్చాడు. అప్పుడు మణిభద్రుడు నాలుగువేల మంది యక్షవీరులతో బయలుదేరి రణభూమికి వచ్చాడు. యక్షులకు, రాక్షసులకూ పోరు ఘోరంగా జరిగింది. రాక్షసుల