సుజననీయం
ప్రొ. వేల్చేరు నారాయణరావు
ప్రవాసాంధ్రుడైన నారాయణరావు గారు అమెరికా దేశంలో తెలుగు ఆచార్యుడిగా పనిచేశారు. ప్రఖ్యాత తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య, క్షేత్రయ్య గార్ల సాహిత్యాన్ని మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవ పురాణం, క్రీడాభిరామం వంటి ప్రసిద్ధ తెలుగు రచనల్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పురస్కారాన్ని 14వ గ్రహీతగా, తొలి భార్తీయునిగా అందుకొన్నారు.
1971నుండి ప్రముఖ తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని, ఇతరులతో కలిసి ఆంగ్లంలోకి అనువదిస్తూ తెలుగుభాషకు ఎనలేని సేవ చేస్తున్నారు.
డేవిడ్ షుల్మన్ తో "క్లాసికల్ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ" అను రచనకు సహ రచయితగా, సహ సంపాదకుడిగా మరియు "గాడ్ ఆన్ ద హిల్: టెంపుల్ పోయెమ్స్ ఫ్రం తిరుపతి" అను రచనకు సహ ఆంగ్లానువాదకుడిగా వ్యవహరించారు.
"ట్వంటీయత్ సెంచురీ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ" అను గ్రంథానికి సంపాదకత్వం, అనువాదం అందించారు. గురజాడ అప్పారా