శీర్షికలు

పుస్తకావిష్కరణ

శీర్షికలు
"వీరయ్య" పుస్తకము తనికెళ్ళ భరణి గారి నాస్సర్ గారి చేతులు మీదుగాఆవిష్కరించబడింది : బ్రిటిష్ సామ్రాజ్యపు చెరుకు ఫారాలలో పని చెయ్యడానికి బానిసల స్థానం లో 13 లక్షల భారతీయులు పంపబడ్డారు. వారిలో కృష్ణ ముత్తాత వీరయ్య ఒకరు. ఇది ఆయన కథ కృష్ణ ఈ కథ గుండెలలో లో కలం పెట్టి నెత్తురుతో రాసినట్టుంది. నాకు చాలా ఇష్టమైన రూట్స్ (ఏడు తరాలు) పుస్తకాన్ని గుర్తు కు తెచ్చింది - తనికెళ్ళ భరణి ఈ పుస్తకం యువతరాన్ని తమ సొంత కుటుంబ చరిత్రను వెదకటానికి ప్రోత్సాహిస్తుంది - నాస్సర్ ఇండియాలో వీరయ్య తెలుగు పుస్తకము కొనతలుచుకున్నవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి : https://amazon.in/dp/8194427339 అమెరికా లో వీరయ్య తెలుగు పుస్తకము కొనతలుచుకున్నవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి : https://www.amazon.com/dp/8194427339 కృష్ణ Book Launch: The Telugu translation of Veerayya was launched by Tanikella Bharani ga

ఆచరణ

శీర్షికలు
ఆచరణలు అలవాటుగా మారితే ! బాల్యం నుండే మనం అనేక విషయాలను తెలుసుకుంటూ వుంటాము. తెలుసుకున్న చాలా విషయాలలో అనేక విషయాలను ఆచరణకు దగ్గరా తీసుకురాక పోవటం చేత జీవితంలోని చాలా సందర్భాలలో మనం ఎదగవలసిన స్థాయికి ఎదగ లేక చతిగిల పడిపోతూ ఉంటాము. దానికి ప్రధానకారణం తెలుసుకునే ఏ విషయం పై నైనా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ ,ఇష్టత అనురక్తి లేకపోవటం,ఏకాగ్రత లోపించటమే ప్రధాన కారణాలు. అందుకే జీవితానికి అవసరమైన విషయాలలు సరియైన సందర్భాలలో నేర్చుకోలేక ,ఏదో నేర్చుకున్న బలంగా మనస్సులో నిక్షిప్తం కాక అవసర సమయాలలో అవకాశాలు అందుకోలేక మానసిక వేదన అనుభవిస్తుంటారు. అందుకే ఇటువంటి సందర్భాలలోనే పెద్దలంటారు మంచిని అంటించుకొని చెడును వదిలించుకోవాలని. ముఖ్యంగా నేటి విద్యా విధానాలలో మంచి విషయాలను నేర్చుకొనే దశలో ఆచరణ అలవాటుగా మార్చుకోవటం అటుంచి అసలు నేర్చుకోవటమే ఏదో యాంత్రికంగా నాలుగు మార్కుల కోసమన్నట్లుగా నేర్చుకుంటూ పొందవలసిన సంప

అష్టవిధనాయికలు

శీర్షికలు
(పద్య ఖండిక) స్వాధీనభర్తృక ................... మత్తేభము పతియే దైవమటంచునెంచివ్రతమున్ భక్తిన్ ఘటించున్ పతి వ్రతగెల్వంగఁవశీకృతుండగు సతీస్వాధీనుడౌభర్తయున్ స్తుతి జేతున్భవదీయకౌశలముఁ విధ్యుక్తంబులౌ నీహొయల్ ద్యుతిసౌందర్యవిలాసముల్ కళలు సత్యోత్కృష్టసౌభాగ్యముల్ వాసక సజ్జిక ............... మత్తేభము పడకన్ పద్మదళమ్ములన్ బరచి పుష్పంబుంచి ద్వారంబులన్ పడకింటన్ రమణీలలామకదిలెన్ప్రాణేశునిన్ దల్చి వా ల్జడకున్ పూవులగూర్చివేచె హృదయోల్లాసంబులన్ గూర్చగా వడిచేరన్ జనుదెంచు ప్రేమికునికై స్వాలంకృతస్త్రీత్వమై విరహోత్కంఠిక ...,.,.........,.,, మత్తేభము క్షణముల్ దీర్ఘములై గతింపగను కక్షంబూనెనేమో యనన్ గణుతింపన్ వ్యథలుండుకోటి విరహోక్కంఠీమనోగీతికన్ తృణమేతానన విస్మరించుటనసంతృప్తిన్ యథాతప్తతన్ వణకంగన్ మృదులాధరద్వయముతాన్ వాపోవుచాంచల్యయై! విప్రలబ్ద ............ మత్తేభము కినుకన్ జెందెను రాత్

పుస్తకసమీక్ష-అష్టవిధ నాయికలు

శీర్షికలు
శ్రీ గాదిరాజు మధుసూదన రాజు గారు రచించిన అష్టవిధ నాయికలు (పద్యఖండిక) పై పూజ్యశ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య వారి సమగ్రసమీక్షా వ్యాసం ఈరోజు గాదిరాజు మధుసూదన రాజుగారి కవిత్వానికొద్దాం. మధుసూదన రాజుగారు సుక్షత్రియ వంశంలో జన్మించి వృత్తి రీత్యా ప్రభుత్వ నేత్రవైద్యాధికారిగాఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. పూర్వీకులది భీమవరం. బెంగుళూరులో స్థిరనివాసము. క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు పేరుతో ఇటీవలబ్లాగొకటి పెట్టారు. శంకరాభరణం బ్లాగులో 2019లో అనుకుంటా వారి పద్యాన్ని చూశాను. నాలాంటి వాడే ఎవరో తెలీక సార్! మీరు క్రొత్తా అని అడిగితే వారు చమత్కారంగా "నా కలం చాలా పాతది - కవి రచయితల చరితలో పాతది - జర్నలిజంలో నలభై ఏళ్ళ ముందున్నది. కవుల సమాఖ్యలో బూజుపట్టిన మాజీది - బ్లాగులోకంలో ఈమధ్యే దూరినది" అని క్లుప్త పరిచయం చేసుకున్నారు. 1979 నుండి నేటి వరకు అన్నిప్రముఖపత్రికలలో కవితలు కథలు ప్రచురింప

అమెరికా ఉద్యోగ విజయాలు

శీర్షికలు
'Intelligent behavior requires knowledge'. ఆ మాట రచనా వ్యాసంగానికి కూడా వర్తిస్తుంది. మంచి చదువులు చదివి, వివిధ స్థాయిల్లో అమెరికాలో అనుభవం గడించిన సత్యం గారు ఈ పుస్తకాన్ని ఆవేదనతో రాసానన్నారు. ఆవేదనలోంచి వచ్చినది ఏదైనా చదవటానికి ఆమోదయోగ్యమే. 'ఉద్యోగం స్త్రీ, పురుష లక్షణం' అన్నది నేటి నానుడి. కాలేజీలో పుస్తకాల్లో చదివేది పాతికవంతు మాత్రమే. మిగతా ముప్పాతిక బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి, ఉద్యోగం చేస్తున్నప్పుడు నేర్చుకోవాలి. భదవద్గీత తరహాలో 'కృష్ణ, అర్జున్ (బావ, మరది)' మధ్య జరిగే సంభాషణల రూపమే 'అమెరికా ఉద్యోగ విజయాలు ' పుస్తకంలో చెప్పబడ్డ చిట్కాలు. సత్యం గారు కృష్ణ (బావ) పాత్రలో పరకాయప్రవేశం చేసి తన అనుభవాన్ని రంగరించి అప్పుడే ఉద్యోగంలోకి అడుగిడుతున్న అర్జున్ (బావమరిది) చెప్పిన విజయసూత్రాలు పన్నెండు అధ్యాయాల్లో అగుపడుతాయి. భారతదేశంలో కూడా ఇప్పుడు విదేశీ కంపెనీలతో ప్రైవేటురంగం అభివృద్ధి చ

Man is a Social Animal

శీర్షికలు
కరోనా నేర్పుతున్న ఒక గొప్ప పాఠం "మనిషి సంఘజీవే " మనిషి తన జీవన ప్రయాణంలో తనకు ఎదురయ్యే ఎన్నెన్నో సంఘటనల ద్వారా కావాల్సినన్ని అనుభవాలు పొందుతూనే ఉంటాడు. అందుకే ప్రతి సమస్యలో, ప్రతి సంక్షోభంలో ఎన్నెన్నో కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ నేపధ్యం లో భాగంగా ప్రస్తుత సామాజిక ప్రపంచం లో వందల కోట్ల మంది ప్రజలు కరోనా రక్కసి కారణంగా "ఆరోగ్య సంక్షోభంలో" కూరుకొని పోయి స్వీయరక్షణ మార్గాల ద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకొనే దిశగా అడుగులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మన దేశంలో కోట్లాది ప్రజలు "లాక్ డౌన్ " ప్రక్రియలో భాగంగా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. దీనివలన ప్రధానంగా ఉద్యోగులు ,వ్యాపారస్తులు లేదా ఇతర వృత్తులలో ఉన్నవారికి కళ్ళ ముందే కుటుంబ సభ్యులు, వేళకు ఆహారం,పిల్లలతో ఆహ్లాదం అలాగే వృత్తి ,వ్యాపారాలలో ఇంటికే పరిమితమై పని చేసే వారికి పెద్దగా ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత పని విధానాలు, కొంతలో క