కథా భారతి

మురికి

కథా భారతి
 -ఆర్ శర్మ దంతుర్తి అప్పల్నాయుడు సర్పంచి అయినప్పటినుండీ డబ్బులు వెనకేసుకోవడంలో చూపించిన చొరవ మరొకరెవరికీ చేతకానికిది. ఎక్కడ ఏమూల పైసా దొరికినా అందులో నాయుడి చేతిలోకి వాటా రావాల్సిందే. అయితే ఎలా తినేసినా కొంతలో కొంత ఊరికి మంచి చేసినట్టే లెక్క. మరుగుదొడ్లు కట్టించడం, వాటిని రోజూ క్లీన్ చేయడానికో టీం ఏర్పాటు అలా మొత్తంమీద ఏదో ఒక మంచి చేస్తూంటే ఎలక్షన్ లలో నెగ్గుతూ వస్తున్నాడు. అయితే మరుగుదొడ్లు కట్టడంలో ఇరవై శాతం తినేసాడనీ, వాటిని రోజూ క్లీన్ చేయడానికి ఇచ్చే సరుకుల్లో, ఫినాయిల్ కి ఇచ్చే డబ్బులో సగం నాయుడిదేననీ జనం అనుకున్నా మనం అటువంటి పనికిరాని అమాయకపు ప్రశ్నలు అడగరాదు. చేతులు తడవకుండా ఉత్తినే ఎవరూ ఏ పనీ చేయడానికి ఇది సత్యయుగం కాదు కదా? సర్పంచ్ నుంచి, ఎమ్మెల్యే దాకా ఎదిగే సరికి నాయుడికి మూడు కార్లూ, ఒక బంగళా, గేటు దగ్గిర కాపలాకి గూర్ఖా, వీళ్ళందర్నీ చూడ్డానికో పెర్సనల్ సెక్రటరీ ఇలా మందీ మా

నిధి చాల సుఖమా

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి ఆ రోజుకి చేయాల్సిన పనంతా అయిపోయాక తనకిచ్చిన వేరే గదిలోకి పోయి పడుకోబోయే ఇల్యాస్ ని పిలిచేడు మహమ్మద్ షా, "రేపు మనింటికి ఓ ముల్లా గారూ, ఆయన స్నేహితులూ మరో కొంతమంది చుట్టాలూ వస్తున్నారు. ఓ మేకని కొట్టి వాళ్లకి విందు చేయాలి. నువ్వు చేయగలవా?" "సరే, రేపు సాయంత్రానికి కదా?" అదెంత పని అన్నట్టూ చెప్పేడు ఇల్యాస్. "నీకు వయసు వల్ల కష్టం అవుతుందేమో అని అడిగాను అంతే. కష్టం అయితే వేరే వాళ్ళకి చెప్తాను ఈ పని." "అబ్బే ఏవీ కష్టం లేదు. నేను దగ్గిరుండి చూస్తాను." "మంచిది. మీ ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది కదా?" "లక్షణం గా ఉంది. ఇక్కడికొచ్చి మీ ఇంట్లో పనిలో జేరాకే కదా అసలు మేమిద్దరం సంతోషంగా ఉండడం మొదలైంది." "పోనీలే, అదే చాలు కదా ఈ వయసులో?" మర్నాడు షా గారి ఇంట్లో విందు జరుగుతూంటే ఇల్యాస్, వాళ్ళావిడా అన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షణ. వచ్చినవాళ్లకి వడ్డన, గ్లాసుల్లో వోడ్కా అవీ సర

సంపాదకుడు

కథా భారతి
ఆర్. శర్మ దంతుర్తి (విశ్వనాధ సత్యన్నారాయణ గారి ‘చిన్న కధలు’ పుస్తకంలో ‘రాజు’ అనే కధ చదివాక రాసినది ఇది. ఆయనని తల్చుకుంటూ, ఓ పాద నమస్కారంతో…) “మీరోజు” పత్రిక మొదటిసారిగా స్థాపించినప్పుడు సుధర్ముడనే ఆయన సంపాదకుడిగా ఉండేవాడు. ఆయన మహా కర్మిష్టి. పొద్దున కోడికూయడంతోనే లేచి ప్రక్షాణాదులయ్యేక కాస్త ఎంగిలిపడగానే నడుచుకుంటూ ఆఫీసుకొచ్చేవాడు దారిలో రాత్రి ప్రింటు చేసిన పత్రిక స్వంత డబ్బుల్తో కొని చంకలో పెట్టుకుని పట్టుకొస్తూ. ఆయనలా ఆఫీసుకి పోవడం పోవడం మళ్ళీ ఆయన ఇంటికొచ్చేసరికి చీకటి పడ్డాకే. ఈయన వెనక్కి వచ్చి పూజ గదిలో దీపం పెట్టుకుని ధ్యానం అయ్యేక భోజనానిక్కూచునే సరికి ఎనిమిదేళ్ళ పిల్లాడు హోమ్ వర్క్ చేసుకుంటూంటే వాడడిగిన దానికి సమాధానం చెప్పడం, పెళ్ళాం తో పిచ్చాపాటి మాట్లాడ్డం అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ కూడా తెచ్చుకున్న ఆఫీసు కాయితాల మీద పడి కధలూ కాకరకాయలూ అన్నీ దిద్దుకుని జామురాత్రి మంచం ఎక్కేవాడు.

చేదు కూడా రుచే!

కథా భారతి
ఆచార్య పి.కె. జయలక్ష్మి M.A.,Ph.D., సోఫియా విశ్వవిద్యాలయం, సోఫియా, బల్గేరియా(EU) సంజె వాలుతోంటే ఆనందవల్లి మొక్కల దగ్గర్నించి నెమ్మదిగా లేచి బియ్యం ఏరుతూ ఆలోచనలో పడింది. భర్త అనంతశయనం చదువుతున్న పుస్తకం బల్ల మీద పడేసి “ ఆనందం! రాత్రికి ఏం వండుతున్నావేంటీ?” అని ఆసక్తిగా అడిగాడు. “ ఆ! మధ్యాహ్నం ముక్కల పులుసు, దోసకాయ పచ్చడి ఉన్నాయిగా,అప్పడాలు వేయిస్తా లెండి.” అంది చిరాగ్గా. “ నాల్గు బంగాళాదుంపలు వేయిద్దూ,కరకరలాడుతూ కమ్మగా “ ఆశగా అడిగాడు వంటింటి గుమ్మం దగ్గర నిలబడి. ‘” అబ్బ! కోరికలకేమీ తక్కువ లేదు. అలాగే చేస్తా గాని మీరోసారి డాబా మీదకెళ్లి మల్లె తీగ పక్కకి వాలిపోతోంది సరిచేసి రండి” అంటూ కుక్కర్ పెట్టి, దుంపలు తరగడం మొదలు పెట్టింది ఆనందవల్లి. “ఇదిగో ఇప్పుడే వెళ్తా ,కాసేపు నడిచి కూడా వస్తా .వంట పూర్తవగానే పిలు.” అంటూ డాబా మీదకి వెళ్ళాడు అనంతశయనం. ముక్కలు తరుగుతూ ఆలోచిస్తోంది ఆనందవల్లి.”’ ఏంటీ

అవగాహనతోనే “అహాన్ని” కాపాడుకుందాం!

కథా భారతి
(మన ఆత్మగౌరవం మన చేతుల్లోనే) -అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 సమాజంలో నిత్యం మనం విభిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాము. సహజంగా వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆలోచనా సరళిలో అనేక వ్యత్యాసాలు ఉండవచ్చు. ఇటువంటి సందర్భాలలో మనం ఇతరులతో మెలిగేటప్పుడు అత్యంత జాగురూకతతో వ్యవహరించవలసి ఉంటుంది.దీనికి మన మీద మనకు అవగాహన ఎంత ముఖ్యమో ఇతరుల పట్ల కూడా మనకు అవగాహన ఉంటూ మన పరిధి మేరకు మెలగాల్సి ఉంటుంది. అప్పుడు మన ఆత్మగౌరవం (ఈగో) మనం కాపాడుకోవటమే కాదు ఇతరుల ఆత్మగౌరవం కూడా (ఈగో) కాపాడినట్లవుతుంది. సహజంగా ప్రతి వ్యక్తి సమాజంలో తనదైన ఆలోచనా సరళితో ఇతరులతో మెలగటం మనం చూస్తూనే ఉంటాం! ఏ వ్యక్తి ఆలోచనా అయినా ప్రజామోదం, సామాజిక ఆమోదం, నీతి, నియమాలకు అనుకూలంగా (Positive) ఉండవచ్చు లేదా ప్రతికూలంగా (Negative) గా ఉండవచ్చు. ఇందులో వరుస ఏదైనా ఏ వ్యక్తి అయినా తన

బాషా ఖూనీ

కథా భారతి
-ఆర్. శర్మ డంతుర్తి ఉద్యోగంలో కొత్తగా చేరిన ఒరిస్సా కుర్రాడు బిభూతి పట్నాయిక్ గురించి రెండురోజుల్లో అందరికీ తెలిసిన విషయం కుర్రాడికున్న వ, బ అక్షరాలకి ఉన్న అభేధం, వాటిని ఈజీ గా, ఒక్కొక్కప్పుడు కావాలని కలిపేసి బాషని ఖూని చేయడమూను. మరో విషయం ఏవిటంటే కొన్ని పదాలని - అంటే వోల్టేజ్ స్టెబిలైజర్ అనే దానిని బోల్టేజీ స్టెబిలైజర్ గా – దీర్ఘాలతో పీకి, పీకి పలకడం. పలకడం అలా ఉంచితే కాయితం మీద వోల్టేజ్ అనేదాన్ని బి అక్షరంతో మొదలుపెట్టి బోల్టేజ్ అని రాయడం చూస్తే పక్కనే ఉన్న వినోద్ కి మతిపోయింది. కొన్ని వారాలు పోయాక వినోద్ మాట వరసలో ఓ సారి చెప్పాడు బిభూతి తో; “ఒరే నాయనా ఒరియాలో నీ ఇష్టం వచినట్టు మాట్లాడుకో కానీ కనీసం అందరితో మాట్లాడే ఇంగ్లీషు భాషని ఖూనీ చేయకు, అవతలవాళ్ళు మరోలా అర్ధం చేసుకోవచ్చు” అని. పుట్టుకతో వచ్చిన బుద్ధులు కాటిలో పుర్రెతో కానీ పోవని ఊరికే అనలేదు కదా? విభూతి అనే పదం భగవంతుడి విభూతి

తనదాకావస్తే?

కథా భారతి
-డా. పి. కే . జయలక్ష్మి “అన్నయ్యా ! నీ దగ్గర రెండు పెన్సిల్ బాక్సులున్నాయిగా నాకోటివ్వవా!’’ గారంగా అడిగింది భవ్య. .’’అమ్మా ఆశ ! ఒకటి డాడీ కొన్నారు . ఇంకోటి నా బర్త్ డే కి నా ఫ్రెండు ఇచ్చాడు . ఐనా రెండో క్లాస్ లో ఉన్నావు, నీకప్పుడే పెన్సిల్ బాక్స్ ఎందుకే ? నాలాగా సిక్స్త్ కొచ్చాక ఇస్తాలే !” అన్నాడు వెక్కిరిస్తూ భరత్ ఇద్దరి సంభాషణ తన చెవుల్లో పడటంతో చేతిలో పని ఆపి నడుం మీద చేయి వేసు కొని ఏం మాటలు భరత్ ? అని కోప్పడింది తల్లి శ్రావణి . “లేకపోతే ఏంటమ్మా, నా దగ్గిర ఏం చూస్తే అవి తనకి ఇచ్చేయ మంటుంది చెల్లి...... ” ఇంకా వాడి మాటలు పూర్తవకుండానే “ తప్పేంట్రా ,అదేమైనా పరాయి పిల్లా ?నీ స్వంత చెల్లెలు . అన్న దగ్గిర ఏమైనా తీసుకునే హక్కు చెల్లికి కాక ఇంకెవరికి ఉంటుంది ? ఇవ్వడం అలవాటు చేసుకో ! ఆడపిల్లని బాధ పెట్ట కూడదు . ముందు దానికి ఆ బాక్స్ ఇచ్చేయ్ నేను చెప్తున్నాను ” అంటూ కసిరింది కొడుకుని . గొణుక్కు

సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్

కథా భారతి
-సిహెచ్.నాగార్జునశర్మ Cell No. 8978504127 ఈ రోజుల్లొ నెల జీతం వచ్చే ఉద్యోగం లేకపొతే మద్య తరగతి కుటుంబాలు బ్రతకడం కష్టం. అందుక్కారణం తమ పూర్వీకులు సంపాదించిన ఆస్థి పాస్థులు ఏమీ లేక పోవడమే. ఆ కోవలోకి చెందినదే రఘు పరిస్థితి. రఘు నాన్న జిల్లా పరిషత్ హైస్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఆయన మరో అయిదెళ్ళలో పదవీ విరమణ పొందుతారు. అతడికి తను ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో సొంత ఇల్లు తప్ప వేరే ఆస్థిపాస్థులేమీ లేవు. అది కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించి పెట్టినదే. రఘుకు ఒక తోడ బుట్టిన చెల్లెలుంది. పేరు శిరీష. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. రఘు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువుకున్నాడు. మంచి తెలివి తేటలు గలవాడు. మితభాషి. చదువులొ అన్నింటా ఫస్ట్ మార్కులతోనే పాసయ్యాడు. ప్రస్తుతం అతడి ముందున్న లక్ష్యం తండ్రి ఉద్యోగం నుండీ రిటైరయ్యే లోపల తను ఉద్యోగస్థుడవ్వాలని. రఘు తన డిగ్రీ పూర్తి అయిన దగ్గర