ధారావాహికలు

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం ఏప్రిల్ 2020

ధారావాహికలు
''మగవాళ్ళకి చాటుగానూ ఆడవాళ్ళకి పబ్లిగ్గాను రుచించని మాట చెప్పనా మగకీ ఆడకీ శీలాన్ని ఆస్తినీ సమంగా వర్తింపించండి కాగితాల మీదా వేదికల మీదా కాదు నిజంగా సమంగా వర్తింపించండి''. స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని మాటల్లోనూ, కాగితాల్ల్లోనూ కాకుండా ఆచరణలో చూపించమని రేవతీదేవిగారు సమాజాన్ని అర్థిస్తున్నారు. అంతేకాదు, కేవలం స్త్రీ పురుషుల మధ్య ఆస్తిలోనే కాక , శీలంలోనూ సమానత్వాని కావాలని ఆంకాంక్షించారు. సమాజానికి ఇద్దరూ భాగ స్వాములే కాబట్టి ఇద్దరికీ సమాన న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. సమాజంలో ఉన్న పురుషాధిక్యాని గుర్తించి, తన కవిత్వం ద్వారా సమాజానికి అందించటానికి ప్రయత్నించారు . సమానమైన న్యాయం లేనందున స్త్రీ మగవాడి చేతిలో ఆటబొమ్మగా మారవలసి వస్తోందని ఈవిడ ఆవేదన. ''పురుషుడికి అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి అందచందాలు ఉన్నాయి తెలివితేటలున్నాయి అవన్ని పురుషుడికి తల్లిగా ప్రేయసిగా స్త్రీ

రామాయణ సంగ్రహం ఏప్రిల్ 2020

ధారావాహికలు
యయాతి చరిత్ర నహుషుడి కొడుకు యయాతి. యయాతికి ఇద్దరు భార్యలు. వాళ్లు దేవయాని, శర్మిష్ఠలు. దేవయాని కుమారుడు యదువు. శర్మిష్ఠ కుమారుడు పూరుడు. తండ్రికి చాలా ఇష్టుడు. తండ్రి తనను సవతి తల్లి కొడుకు పూరిడిలాగా ఆదరించడం లేదని తన వైమనస్యం తన తల్లి వద్ద యదువు వెలిబుచ్చాడు. అప్పుడు దేవయాని కూడా బాధపడి తండ్రిని తలచుకొన్నది. శుక్రుడు (తండ్రి) వచ్చి యయాతిని నిరసించి తన కూతురును నిర్లక్ష్యం చేస్తున్నందుకు యయాతి వెంటనే జరాభారం వహించేటట్లు (ముసలివాడై పోయేట్లు) శపించాడు. యయాతి చాలా పరితాపం పొందాడు. ''నాకింక విషయసుఖాలను అనుభవించాలన్న కోరిక తీరలేదు. నేను ముసలితనాన్ని భరించలేదు.'' అని తన పెద్దకుమారుడైన యదువును కొంతకాలం తన ముసలితనాన్ని తీసుకొని అతడి యవ్వనాన్ని తన కిమ్మని అర్థించాడు. అసలే తండ్రి పట్ల అసంతృప్తితో ఉన్న యదువు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు యయాతి పూరుణ్ణి అడిగాడు. పూరుడు వెంటనే ఒప్పుకున్నాడు. యయాత

అమెరికా ఉద్యోగ విజయాలు – 12

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న జయం మనదే! “బావా! నువ్వు నాకు రెస్యూమే వ్రాయటం దగ్గర మొదలు పెట్టి, దాని ముఖ్య ప్రయోజనం ఇంటర్వ్యూ తెప్పించటం మాత్రమేననీ, అది రాగానే ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తిస్తే ఉద్యోగం తెచ్చుకోవచ్చో చెప్పావు. ఆఫీసులో సరైన సంభాషణ ఎలా చేయలో, మాట్లాడేటప్పుడు నా శరీరవాణి ఎలా వుండాలో చెప్పావు. మన శతకాలలోని మేనేజ్మెంట్ సూత్రాలు సూక్షంగా చెప్పావు. ఆఫీసుల్లోని రకరకాల మనస్థత్వాలు ఎలావుంటాయో, వాళ్ళతో ఎలా మెలగాలో చెప్పావు. రంగుటద్దాలలోనించీ కాకుండా, మనం ఇతరులని వాళ్ళని వాళ్ళలాగే చూడటం ఎంత అవసరమో చెప్పావు. అలాగే ఆ రంగుటద్దాలలోనించీ మనల్ని సరిగ్గా చూడని వారితో ఎలా ప్రవర్తించాలో చెప్పావు. పాల్ గెట్టీ, లీ అయోకోకా, స్టీవ్ జాబ్స్ మొదలైన వారి మేనేజ్మెంట్ సూత్రాలు చెప్పావు. జాన్ మాక్స్వెల్ మొదలైన వారి పుస్తకాల గురించి చెప్పావు. అడగందే అమ్మయినా పెట్టదనీ, ప్రమోషన్లు ఎలా తెచ్చుకోవాలో చెప్పావు. ఉద్యోగ వై