కవితా స్రవంతి

కవిత్వం

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి రాసేవారు ఎక్కువ,చదివేవారు తక్కువ ఇదీ నేటి కవితల పరిస్థితి. రాశి ఎక్కువ,వాసి తక్కువ ఇదే ఇప్పటి కవిత్వపు దుస్థితి. పదం పక్కన పదం పేరిస్తే దానినే కవిత్వమనుకోవటం పైత్యం. పదం హృదయాని స్పందిస్తే అది కవిత్వమౌతుందనేది సత్యం. మదిలో అలజడి కలిగితే కవితకు తొలినుడి చుట్టబడుతుంది. భావావేశపు సుడిలో మునిగితే కవితకు గుడి కట్టబడుతుంది. నిశ్శబ్ధంతో నువ్వు చేసే యుద్ధంలో నిర్వేదంతో నిన్నునువ్వు చూసుకొనే నిబద్ధంలో కవిత్వం జాలువారుతుంది. నిగూఢంలో నీతో నీవు చేసే సాహచర్యంలో నిర్భేధ్యంగా నీపై నీవు జరిపే గూఢచర్యంలో కవిత్వం నిన్ను చేరుతుంది.   ***

రెండవ వైపు

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అట్టుకు రెండవ వైపు ఉంటుందని తెలుసుకోలేని అజ్ఞానులం మనం. మన ………మనదీపమై వెలుగుతోందని గర్విస్తామే తప్ప, అదే దీపం మనం చేసుకున్న పాపమై, భవిష్యత్తులో మననే కాలుస్తుందని తెలుసుకొనలేము. కన్నూమిన్నూ కానని ఆవేశంలో, మిడిసిపాటుతో కూడిన యవ్వనంలో, మనం ఆడిందే ఆట, పాడిందే పాట అవుతూ ఉంటే, అదే శాశ్వతం అనుకుంటూ గడుపుతాము నేడు ఇటుకాలిన అట్టు రేపు అటుకూడా అలానే కాలుతుందని, గుర్తించలేము,తెలుసుకోలేము నేటి మన దుష్ప్రవర్తనలే రేపటి యమ పాశాలై మనని దుఃఖానికి గురిచేస్తాయని ఊహించలేము తీరా తెలిశాక చేయటానికి ఏమీ మిగిలి ఉండదు అనుభవించటమే తప్ప ఆలోచనకు తావుండదు ఆక్రోశించటమే తప్ప ఆచరణకు అవకాశం ఉండదు   ***

గజల్

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ దిగులు చెందవద్దు దిగంతాలు మనవెంటే ఆవేదన చెందవద్దు ఆనందాలు మనవెంటే ఓటములు ఎదురైతే గుండె ధైర్యంతో సాగిపో గెలుపును ముద్దాడే విజయాలెప్పుడూ మనవెంటే అడ్డంకులు ఎదురైతే అడుగు ముందుకు సాగిపో లక్ష్యానికి చేరువైతే గమ్యమెప్పుడూ మనవెంటే కష్టాలు ఎదురైతే కదలి ముందుకు సాగిపో ఉదయాలు వికసిస్తే విజయాలెప్పుడూ మనవెంటే నిరాశలు ఎదురైతే ఆశయాల పల్లకిలో సాగిపో ఆశలు నెరవేరితే గెలుపులెప్పుడూ మనవెంటే గాయాలు ఎదురైతే సంతోషసాగరమై సాగిపో కన్నీటిని చెరిపేస్తే వెలుగులెప్పుడూ మనవెంటే విషాదాలు ఎదురైతే విహంగమై సాగిపో భీంపల్లి ఆనందాలు వెదజల్లే జీవితమెప్పుడూ మనవెంటే

జోల పాట

కవితా స్రవంతి
~ తిరునగరి శరత్ చంద్ర హైదరాబాద్ చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకున్నాడు రేయి మంచంపైన నక్షత్రాలు లాలిపాట పాడుతున్నాయి మబ్బులు వీవన వీస్తున్నాయి తన నీలి నీలి ముంగురులు గాలికి రెపరెపలాడుతుంటే ఉలిక్కిపడి నిద్రలేచాడు చంద్రుడు ఇది యేమిటి వింతగా ఉందే! పసిపాపలను నిద్ర పుచ్చడానికి 'చందమామ రావే జాబిల్లి రావే' అని జోలపాటలు పాడే తల్లులకు ఉపయోగపడే ఈ చంద్రునికి లాలిపాటలు పాడడం కొత్తగా గమ్మత్తుగా ఉందే అనుకుంటూ మళ్లీ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు చంద్రుడు. నిదురపోతూ ముద్దొస్తున్న చంద్రునికి దిష్టి తీయడానికి చీకటిరేఖను త్రుంచిందొక మేఘం. చంద్రుడు హాయిగా నిదురపోవడానికి తీయతీయని రాగాలను వాడుకున్నాయి నక్షత్రాలు తమ లాలిపాటలో.. సౌందర్యం వర్షించే సౌజన్యం దీపించే సౌశీల్యం నడయాడే సౌకుమార్యం జాలువారే ఆ చంద్రున్ని చూసి స్వర్గలోకాలు చిన్నబోయాయి. మనోవీవనలతో వీచి

సెల్ ఫోను స్తోత్రము

కవితా స్రవంతి
- పుల్లెల శ్యామసుందర్ ఉదయంబున నిద్దుర లేవగనే నిను చూడక డే మొదలవ్వదులే దినమందున ఓ పదిమారులు నిన్ ప్రియమారగ జూడక సాగునటే సెలిఫీలను దీసెడి కేమెరవై పదిమందికి నువ్ చరవాణివియై ముఖపత్రము జూపెడి బ్రౌసరువై సమపాలున నిస్తివి సౌఖ్యములన్ పరిశోధన సల్పెడి గూగులుగా గణితమ్మును జేసెడి యంత్రముగా సమయమ్మునకై గడియారముగా అవతారము దాల్చితి వీవుభళా! సరి తిండియు తిప్పలు మానుకొనీ పనులన్నిటినీ వదిలేసి ప్రజల్ నిను వీడక యుందురు నెల్లపుడూ జగమంతయు భక్తులు నీకెగదా స్పెలియింగుల తప్పుల నన్నిటినీ సవరించుచు రక్షణ చేయవటే మరి చీకటి ద్రోలెడి దీపమువై మము కావగ నీవిట వెలసితివే వినా సెల్లు ఫోనూ ననాదో ననాద సదా స్మార్టు ఫోను స్మరామి స్మరామి భలే ఆండురాయిడ్ ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం అయ్యి ఫోను ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రయాణాలయందున్ ప్రమోదాలయందున్ నినున్ వీడి నేనుండ లేన్సెల్లు ఫోనా ఒకస్పేరు బ్యాట్రీతొ నే నిన్

ఏకాకి జీవితం

కవితా స్రవంతి
డి.నాగజ్యోతిశేఖర్ మురమళ్ళ, తూర్పుగోదావరి జిల్లా. 9492164193 కాలం గుప్పిట్లో బందీనై నిన్ను నేను ఎడబాసినప్పటికీ... నా ఒంటరి నిశీధి అంచుల్లో చెకుముకి రాళ్ళై నీ జ్ఞాపకాలు నాలో రాపాడుతూనేఉన్నాయి! వేదనకొమ్మల్లో పూలపిట్టలై నీ ఆలోచనలు నాతో సంఘర్షిస్తూనేఉన్నాయి! గతం శిథిలాల్లో స్మృతుల తీగలై నీ చేరువలు నన్ను అల్లుకోవాలని తపనపడుతూనే ఉన్నాయి! కన్నీటి కొసల్లో కొసమెరుపులై నీ సాంగత్యాలు నన్ను ఓదారుస్తూనేఉన్నాయి! గుండె పటం ఫ్రేములో వెచ్చని ముద్రలై నీ ఔన్నత్యాలు నన్ను తడుముతూనే ఉన్నాయి! నాకు తెలుసు... నేనేం కోల్పోయానో... ఇంక... నీ ఎడబాటు చీకటిని తరగడం నా తరం కావడం లేదు! నీ జంటబాసిన సమయాలను దాటాలంటే నా శ్వాసకు అడుగుసాగడం లేదు! నీవు లేని ఈ ‘ఏకాంతాన్ని’ ఏలాలంటే దహనమౌతున్న నా హృదయతనువుకు సాధ్యం కావడం లేదు! పొరలుపొరలుగా పొగిలివస్తున్న దుఃఖ సంద్రాన్ని వెలేయడానికి గుండె గొ

నిత్య సూర్యుళ్ళం!

కవితా స్రవంతి
వెన్నెల సత్యం షాద్ నగర్ 94400 32210 ఎప్పట్లాగే ఈ రోజూ ఈ రోజు కోడి కూత కన్నా ముందే నిద్ర లేచాను నా స్వేచ్ఛా ప్రపంచపు వంటింట్లోకి ఠంచనుగా అడుగు పెట్టాను! యుద్ధభూమిని తలపించే ఆ వంట గదిలో పాత్రలతో పోరు చేస్తూ కాయగూరలతో కత్తియుద్ధం చేస్తూ చెమటోడుస్తున్నాను! జిహ్వకో కూర తీరొక్క అల్పాహారాలతో తిండికీ నోచుకోని తీరిక లేని పనులు మసిబారిన మగ దురహంకారపు అంట్లన్నీ తోముతూ దుష్ట సంప్రదాయాల మురికి గుడ్డల్ని ఉతుకుతూ కసవు నిండిన మది గదులన్నీ ఊడుస్తూ తుడుస్తూ బడలిక ఎరుగని బానిసలా ఏ అర్ధరాత్రో తీసే కూసింత కునుకు మా శరీరాలకే గానీ మనసులకు మాత్రం విశ్రాంతి ఎండమావే! మున్నూట అరవై ఐదు రోజులూ సూర్యుడితో పోటీ పడుతూ శ్రమశక్తితో ప్రపంచాన్ని నడిపించే మాకు ఏడాదికోసారి మీరిచ్చే గౌరవాలు అక్కర్లేదు! మా విన్నపాన్ని మన్నించండి మమ్మల్ని దేవతల్ని చేయక్కర్లేదు సాటి మనిషిగా చూడండి