మనబడి

SiliconAndhra ManaBadi 2018

మనబడి
పదివేల మంది పిల్లలు కేరింతలతో తెలుగు నేర్చుకోడానికై ఉరుకంగ! మనబడి పుష్కరాల వత్సరాన అమెరికాలో పొంగిన తెలుగు గంగ!   Crossing 10,000 students is an amazing milestone in the 12th academic year!! A proud moment for 2000+ volunteers of SiliconAndhra ManaBadi Mana Badi who dedicate their time and passion, incessantly for the common purpose of imparting the richness of Telugu language in our next generation. This is just not a number but representation of the glory of our language for many many years to come! It is proof that when common people come together on a "common purpose", they accomplish uncommon results!! Sept 21st is the last date for registering into this fantastic milestone year. Be part of history, make it a priority to have your kids learn the language!! JayahO T

మనబడి బాలానందం

బాలరంజని, మనబడి
విళంబి నామసంవత్సర ఉగాది సందర్భంగా, మీ అందరికీ శుభవార్త! "మనబడి బాలానందం", రేడియో కార్యక్రమాన్ని, ప్రతి శని-ఆదివారాలు తెలుగువన్ రేడియో (టొరీ) లో మనబడి విద్యార్ధులు అందిస్తున్న సంగతి మీకందరికీ తెలిసిందే. ఈ ఉగాది నుంచి మనబడి బాలానందం, ఒక సరికొత్త ఇంటర్నెట్ రేడియో చానెల్ Telugu NRI Radio లో కూడా మొదలౌతోంది ! http://telugunriradio.com/ లేదా "Telugu NRI Radio APP" ద్వారా, ప్రతి శని-ఆదివారాల్లో, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు. (1 PM EST, Every Sat and Sunday). మీరూ, మీ పిల్లలూ కలిసి తప్పక వినండి! ఈ విషయాన్ని మీరు తెలుగు వారందరితోనూ పంచుకోండి !! ఈ ఉగాది నుంచి నెలకు 16 కార్యక్రమాలు!! పదహారణాల తెలుగు కార్యక్రమం నెలకు 16 సార్లు!! ఆనందం, బాలానందం కేరింతలు - ఇక నుంచి రెండింతలు! మరి దానికి తగినట్టు, పిల్లలచే రేడియో కార్యక్రమం నిర్వహించే మావయ్యలు, అత్తయ్యలు కూడా మరి రెండింతలు కావాలి కదా! మీకు

మనబడి బాలానందం

మనబడి
మీరందరూ అభిమానించే 'మనబడి బాలానందం ' రేడియో కార్యక్రమం ఇప్పుడు వారానికి 2 రోజులు! ప్రతి శనివారం మరియు ఆదివారం టోరీ రేడియోలో!! మనబడి - బాలానందం మనబడి పిల్లలకు తరగతులలో తెలుగు నేర్చుకోవడంతో పాటూ వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉన్నదన్న విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమాలలో "మనబడి బాలానందం", రేడియో ఒకటి. గత 7 ఏళ్ళుగా మనబడి పిల్లలు "బాలానందం" కార్యక్రమాన్ని, ఒక చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదంగా అందిస్తున్నారు. పలువురు పెద్దలు బాలానందం అత్తయ్యలు, మామయ్యలుగా, మనబడి పట్టభద్రులు బాలానందం అన్నయ్యలు , అక్కయ్యలుగా మనబడి విద్యార్థులచే ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. వందలాది మంది పిల్లలు బాలానందంలో పాల్గొని, తెలుగు మాట్లాడటంపై, విని అర్థం చేసుకోవడంపై తమ పట్టుని మరింత పెంచుకొన్నారు. పెంచుకొంటున్నారు. మనబడి బాలానందం రేడియో మీ కోసం ప్రతి శనివారం 11 AM (CST) , ఆదివారం 1 PM (CST) కు

మనబడి వార్తలు

మనబడి
ఉత్సాహభరితంగా మనబడి పిల్లల నాటకోత్సవం సిలికానాంధ్ర మనబడి బాలల నాటకోత్సవం అనే మరో అద్భుతానికి తెరతీసింది. ప్రవాస బాలలకు తెలుగు నేర్పించడమే కాకుండా మన సంస్కృతిని అలవరిచే క్రమంలో మరో అద్భుత ఆవిష్కరణ ఇది. ఎంతో ప్రఖ్యాతమైన నాటిక అనే కళాప్రక్రియను బాలలకు పరిచయం చేయడం ద్వారా, ఆ ప్రక్రియ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందనే ఉద్దేశ్యంతో ఉన్న మనబడి విద్యార్ధులకు ఈ నాటిక పోటీలు నిర్వహించింది. ముందుగా ప్రాంతాల వారిగా ఆన్ లైన్(అంతర్జాలమాధ్యమం) ద్వారా వచ్చిన నాటికలను పరిశీలించి, జాతీయపోటీలకోసం క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పీటస్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్ధి బృందాలను ఆహ్వానినిచింది మనబడి. మిల్పీటస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలోని వేదికపై వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మనబడి విద్యార్ధి బృందాలు చేసిన నాటక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముద్దు ముద్దుగా వారు పలుక