సుజననీయం

ఈ నెల ప్రత్యేకతలు

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు - అమర్ నాథ్ జగర్లపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హైద్రాబాద్ వారి శీర్షిక గత నెలనుండి ప్రారంభమయ్యాయి. పిల్లలకు, పెద్దలకు వివిధ అంశాలపై వచ్చే రచనలు ప్రతినెల చదవండి. - 2002వ సంవత్సరంలో సిలికానాంధ్ర హస్యవల్లరి పేరిట సేకరించిన కొత్తపాత కార్టూనిష్టుల కార్టూన్లు ఈ నెలనుండి 'హాస్యరంజని ' లో చూడండి. - అమెరికాదేశ వ్యాప్తంగా జరిగిన మనబడి పరీక్షలు, స్నాతకోత్సవాల ఫోటోలు కొన్నింటిని 'మనబడి ' లో చూడండి. మరిన్ని శీర్షికలతో వచ్చే నెలలో కలుద్దాం.  

వెళ్ళిపోయిన సూర్యనారాయణుడు

సుజననీయం
-తాటిపాముల మృత్యుంజయుడు 'మాదీ స్వతంత్ర  దేశం, మాదీ స్వతంత్ర జాతి ', 'మేలుకో హరి సూర్యనారాయణా' పాటల పేర్లు చెప్పుకోగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బాలాంత్రపు రజనీకాంతరావు గారు. 1941 నుండి తన సంగీత, సాహిత్య, గాన మాధుర్యాలతో ఆకాశవాణిలో తెలుగుజాతిని ఓలలాడించిన ప్రముఖుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు 22 ఏప్రిల్ న మనలను వీడిపోయారు. సరిగ్గా తేదీ గుర్తులేదు కాని, నాకు ఆ సంఘటనలు మాత్రం బాగా గుర్తు. కొద్ది సంవత్సరాల క్రితం సిలికానాంధ్ర నిర్వహించిన ఉగాది ఉత్సవంలో రజనీ గారి పాటలు కొన్ని నేర్చుకొని కార్యక్రమం ఇవ్వదలిచాం. అప్పుడు నేను ఉత్సుకతతో వారి గురించి ఇంటర్నెట్లో వెదుకుతుంటే వారి గురించిన సమాచారం ఎంతగానో లభించింది. వారి చేసిన ఎనలేని సేవలను ఆ సమయంలో తెలుసుకొన్నాను. సిలికానాంధ్ర చైర్మన్, శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు రజనీకాంతరావు గారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అపూడు వారు మాతో పంచుకొన్న మాటలివి. "

అచ్చివస్తున్న 2018

సుజననీయం
2017 డిసెంబర్ నెల మధ్యనుండే 2018 సంవత్సరం సిలికానాంధ్రకు శుభసూచకంగా ఉంటుందన్న సంకేతాలు మెండుగా కనిపిచసాగాయి. డిసెంబర్ 15 నుండి 19 వరకు హైద్రాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ సాహిత్యవేదికలపైన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవిత మొదలుకొని పలు సాహితీ దిగ్గజాలు సిలికానాంధ్ర, మనబడి, సుజనరంజని సేవలను కొనియాడుతూ ఆ పేర్లను తమ ప్రసంగాలలో ఉటంకించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ముగింపు సమావేశాల్లో భారతదేశ ఉపరాష్ట్రపతి ప్రవాసభారతంలో మనబడి సేవలను గుర్తిస్తూ ఇప్పటి తరాలకు, భావితరాలకు మధ్య వారధిగా నిలుస్తున్నదని కొనియాడడం మరొక ఎత్తు. 2018 జనవరి మాసంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఒక సంవత్సరం పూర్తి చేసుకొన్నది. ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు ఐటీ మంత్రివర్యులు నారా లోకేశ్ ముఖ్య అతిధిగా విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వ్యాప్తికి సిలికానాంధ్ర చేస

కొన్ని విశేషాలు

సుజననీయం
-తాటిపాముల మృత్యుంజయుడు ఈ నెల సంచికలోని కొన్ని విశేషాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. - శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవం మార్చి 17న జరుగుతుంది. డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి 'అచ్చ తెలుగు అవధానం' ఈ ఉత్సవ ప్రత్యేకత. వివరాలు 'ఈ మాసం సిలికానాంధ్ర ' లో చూడండి. - సిలికానాంధ్ర తెలుగుభాషకు మనబడి ద్వారా చేస్తున్న సేవను గుర్తించి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 'స్ఫూర్తి ' అవార్డును అందజేసింది. వివరాలు 'ఈ మాసం సిలికానాంధ్ర ' లో చూడండి. - కొత్త శీర్షికలు 'మల్లె మాటలు ', 'మహాకవుల భావచిత్రాలు 'మొదలయ్యాయి. 'ధారావాహికలు ' శీర్షికలో చదవండి. - వంగూరి కథల పోటీ వివరాలకై 'జగమంత కుంటుంబం'లో చూడండి. - సుజనరంజనిలో దిగ్విజయంగా నడిచిన 'సత్యమేవ జయతే' పుస్తకరూపంలో వచ్చింది. వివరాలకు 'ధారవాహికలు ' లో 'పుస్తక సమీక్ష ' చూడండి. పాఠకులందరికి శ్రీ విళంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

తెలుగుకు జేజేలు!

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు హైద్రాబాదు మహానగరంలో తెలంగాణా ప్రభుత్వం 'ప్రపంచ తెలుగు మహాసభలు ' నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు మొదలెట్టింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనున్న ఉద్ధండుల్ని, అలాగే విదేశాల్లో నున్న తెలుగు సాహిత్య, భాషా సేవకుల్ని పేరుపేరునా పిలుస్తూ, బొట్టుపెట్టి ఆహ్వానించడం ఎంతగానో మెచ్చుకోదగ్గ విషయం. ప్రాంతీయ భేదాలు పొడసూపకుండా ఎక్కడ వున్నా అందరం తెలుగుసంతతి వారమే అన్న ధోరణి అవలంబించడంలో తెలంగాణా ప్రభుత్వాన్ని తప్పనిసరిగా హర్షించాలి. ఈ విధానం తెలుగుభాషా వికాసానికి, తెలుగు సాహిత్యం ఔన్నత్యానికి దోహదం చేస్తుంది. ఈ సంతోష సమయంలో, పండగ వాతావరణంలో మన తెలుగు పెద్దలు చెప్పిన తీయని పలుకులు పునశ్చరణ చేసుకొందాం. చైయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతొ ఘనకీర్తి కలవాడా (వేములపల్లి శ్రీకృష్ణ) తెలుగువాడు ఏడనున్న తెలుగువాడు తెలుగుభాషనే సొంపుగా పలుకుతాడు (కొసరాజు)

‘తాడు – పాము ‘ న్యాయం

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు ఈ న్యాయం ఉపనిషత్తులలో వివరించబడింది. అయితే, దేవుడు, మతాల జోలికి పోకుండా మనం నివసిస్తున్న జాగృదావస్థ ప్రపంచానికి ఈ న్యాయాన్నిఅనువదించుకుంటే కొన్ని విషయాలు విశదమవుతాయి. అజ్ఞానం (Ignorance) లోపానికి (Error) దారి తీస్తుంది. వాస్తవికతను (Reality) కప్పేసి ఒక భ్రమలోకి (Illusion) నెట్టేస్తుంది. అగ్రహణం (No Grasping) నుండి అన్యధా గ్రహణానికి (Wrong Grasping) కారణం అవుతుంది. అజ్ఞానం బీజం మొలకెత్తి సమస్యల వృక్షం అవుతుంది. ఈ తప్పంతా తనకు అంతా తెలుసనుకొని అజ్ఞానమనే చీకట్లో మనిషి ఉండటమే. వెలుతురు పడితేగాని పాము అనే భ్రమ తొలగిపోనట్టు జ్ఞానం సంపాదించనంత వరకు ఇలాంటి దుస్థితి కొనసాగుతుంది. 'నాకు తెలిసిందల్లా ఒక్కటే, నాకేమీ తెలియదు ' అని సోక్రటిస్ చెప్పిన ఆణిముత్యం లాంటి మాటను మనం మరచిపోకూడదు. మానసిక శాస్త్రం ప్రకారం ఒక మనిషి స్వయాన్ని (Self) నాలుగు భాగాలుగా విభజించవచ్చు. క్రింద ఇ

సుజననీయం

సుజననీయం
పదహారేళ్ళ పండగ అవును,సిలికానాంధ్ర సంస్థ స్థాపింపబడి పదహారేళ్ళు పూర్తయ్యాయి. ఒక సంవత్సర కాలం పూర్తయ్యిందంటే ఒక మైలు రాయిని చేరుకొన్నట్టు లెక్క. వార్షికోత్సవం అంటే గత సంవత్సరాల తీయటి జ్ఞాపకాల్ని నెమరేసుకొంటూ, ఈనాటి సంతోషాల్ని పంచుకొంటూ, రాబోయే కాలపు ఆశలకు, ఆశయాలకు ప్రణాళికలు వేస్తూ పండగ చేసుకోవడమే. అనాదిగా రత్నాలు, మణులకు మనిషి ఆకర్షితుడవుతున్నాడు. వాటిలో కానవచ్చే స్వచ్చత, బహు గట్టిదనం, మిలమిల మెరిసే ప్రకాశం వీటి ప్రత్యేక లక్షణాలు. పగడము, పచ్చ, నీలము, గోమేధికం, వజ్రము, వైడూర్యం మొదలగు నవరత్నాలు అలంకారభూషితాలుగా పేరొందాయి. మరి సిలికానాంధ్ర నవరత్నాలు ఏవంటే - ఉగాది ఉత్సవం, అన్నమయ్య జయంతి ఉత్సవం, కూచిపూడి నాట్యోత్సవం, తెలుగు సాంస్కృతికోత్సవం, సుజనరంజని మాసపత్రిక, మనబడి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, సంపద, జయహో కూచిపూడి కార్యక్రమాలను పేర్కొనవచ్చు. అలాగే, ఇంకా వెలికి తీస్తే ఎన్నో మణులు లభ్యమవుతాయి

చుక్కల్లో చంద్రుడు

సుజననీయం
మన భారతీయుడు, ఖగోళ సాస్త్రవేత్త, నోబెల్ బహుమాన గ్రహీత అయిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ చరిత్రను కాలిఫోర్నియా నివాసి, విశ్రాంత ఆచార్యుడు అయిన డా. వేమూరి వేంకటేశ్వరరావు రచించిన ధారవాహిక శీర్షిక ప్రారంభం అయినది. భౌతిక, గణిత, ఖగోళ, సాంకేతిక సమచారాల్ని జోడిస్తూ రాసిన ఈ రచనను తప్పక చదవండి. మీ అభిప్రాయాలు పంచుకోండీ. - తాటిపాముల మృత్యుంజయుడు

కవివరేణ్యుడు, సాహితీ దురంధరుడు – సినారే

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు కవిత్వమంటే కర్రుమొనలోంచి మట్టి పలికినట్టుండాలి చెమట ఆవిరిలోంచి మబ్బుపట్టినట్టే ఉండాలి కరీం నగర్ జిల్లా హనుమాజీపేట వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) తన కవిత్వంలో కూడ మట్టి వాసనను ఆఘ్రాణించాడు. పాఠశాల విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో జరిగిన సినారె కు చిన్నప్పుడు ఊళ్ళో జరిగే హరికథలు, ఒగ్గుకథలు విని, ప్రదర్శనలు చూసి తెలుగుభాష మధురిమలకు ఆకర్షితుడైనాడు. రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు పోతూపోతూ రాస్తాను వసుపు వాడే వరకు అంటూ కవిత్వమే తన ఊపిరిగా చేసుకొని చివరి క్షణం వరకు బతికాడు. గురువులు, ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని వంటి దిగ్గజాల మెప్పు పొంది, పాఠాలు, పరిశోధనలచే అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి, గేయాలు, గజళ్ళు, గ్రంథాలు రాసి పాఠకుల అభిమానాన్ని చూరగొని, పాటలతో ప్రేక్షకలోక అభిమానాన్ని సంపాదించి, రాష్ట్ర,
పరోపకారార్థం

పరోపకారార్థం

సుజననీయం
సంపాదకవర్గం: ప్రధాన సంపాదకులు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదక బృందం: తమిరిశ జానకి కస్తూరి ఫణిమాధవ్ -తాటిపాముల మృత్యుంజయుడు   అవసానదశలోకి అడుగిడుతున్న ఒక ముదుసలి గుంతను తవ్వుతూ ఒక చిన్నమొక్కను నాటటానికి ఎంతో కష్టపడుతున్నాడు. దారిన పోయే దానయ్యలు ఆపసోపాలు పడుతున్న ఆ వృద్ధుణ్ణి చూసి నవ్వుకొంటున్నారు. ఈ వయసులో ఇలాంటి పని చెయ్యడం అవసరమా ప్రశ్నిచుకొంటున్నారు. చివరికి ఒక దానయ్య నిలబడి 'తాత, ఎనభై ఏండ్ల వయసులో ఏమి సాధిద్దామని ఈ పని చేస్తున్నావు? మొక్క ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు నీకు పండ్లు ఇవ్వాలి. అంతా నీ భ్రమగాని ' అని పరిహసించాడు. అప్పుడు తాత ముసిముసిగా నవ్వుతూ 'ఈ మొక్క చెట్టుగా ఎదిగి నాకు పడ్లను ఇవ్వాలనే దురాశతో ఈ పని చెయ్యటం లేదు. ఏదగబోయే చెట్టూ నా మనవడికో లేదా వాని కూతురు, కొడుకుకో నీడ ఇస్తుంది. వాళ్లు పళ్ళని తింటారు. పదిమందికి పంచుతారు ' పెద్ద జ్ఞానిలా మాట్లాడాడు. పైన చెప్పుకున్న కథ