సుజననీయం

అన్నమయ్య జయంతి

– తాటిపాముల మృత్యుంజయుడు

తెనాలి రామకృష్ణుడు తాళ్ళపాక కవులను ఒక పద్యములో ఇలా ప్రశస్తించెను –

చిన్నన్న ద్విపదకెఱగును
పన్నుగ బెదతిరుమలయ్య పదమున కెఱగన్
మిన్నంది మొరసె నరసిం
గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్!

అన్నమాచార్యుడు, అతని వంశీయులైన నరసన్న, పెదతిరుమలయ్య, చిన్నన్న అందరూ కవులే. అన్నమయ్య తెలుగు నుడికారమున దిట్ట. సంస్కృతమున కూడా మంచి సంకీర్తనలు రచించాడు కూడా. ద్రావిడ, కర్ణాటక, తెలుగు భాషల్లో మొదటగా సంకీర్తనలు రచించిన వాడు అన్నమాచార్యుడు. అందుకే ‘పదకవితాపితామహుడు ‘ బిరుదాంకితుడు.

ఎన్నో కవితారీతుల్లో మధురంగా రచించిన అన్నమయ్య జానపద రీతులు కొన్ని ఇవి – జాజఱలు, గొబ్బి, నలుగులు, గుజ్జెనగూళ్ళు, అల్లోనేరెళ్ళు, తందనాలు.

మే 25, 26, 27 తేదీల్లో జరిగే అన్నమయ్య జయంతి ఉత్సవానికి తప్పక విచ్చేయండి. ఆ సంకీర్తనాచార్యునికి గాన, నాట్య కళలతో అర్పించే నివాళిలో పాలుపంచుకోండి. వివరాలకు ‘ఈ మాసం సిలికానాంధ్ర ‘ చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked