సుజననీయం

పరోపకారార్థం

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

-తాటిపాముల మృత్యుంజయుడు

 

అవసానదశలోకి అడుగిడుతున్న ఒక ముదుసలి గుంతను తవ్వుతూ ఒక చిన్నమొక్కను నాటటానికి ఎంతో కష్టపడుతున్నాడు. దారిన పోయే దానయ్యలు ఆపసోపాలు పడుతున్న ఆ వృద్ధుణ్ణి చూసి నవ్వుకొంటున్నారు. ఈ వయసులో ఇలాంటి పని చెయ్యడం అవసరమా ప్రశ్నిచుకొంటున్నారు. చివరికి ఒక దానయ్య నిలబడి 'తాత, ఎనభై ఏండ్ల వయసులో ఏమి సాధిద్దామని ఈ పని చేస్తున్నావు? మొక్క ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు నీకు పండ్లు ఇవ్వాలి. అంతా నీ భ్రమగాని ' అని పరిహసించాడు. అప్పుడు తాత ముసిముసిగా నవ్వుతూ 'ఈ మొక్క చెట్టుగా ఎదిగి నాకు పడ్లను ఇవ్వాలనే దురాశతో ఈ పని చెయ్యటం లేదు. ఏదగబోయే చెట్టూ నా మనవడికో లేదా వాని కూతురు, కొడుకుకో నీడ ఇస్తుంది. వాళ్లు పళ్ళని తింటారు. పదిమందికి పంచుతారు ' పెద్ద జ్ఞానిలా మాట్లాడాడు.

పైన చెప్పుకున్న కథ నిన్న, మొన్న (శని, ఆదివారాల్లో) జరిగిన అన్నమయ్య జయత్యుత్సవం సందర్భంగా జరిగిన సంగీత, నాట్య పోటీల్లొ పాల్గొన్న పాలబుగ్గల పసికూనలను చూస్తే గుర్తుకు వచ్చింది. పోటీలను నిర్వహించటానికి సహకారం చేసిన పాఠశాల విద్యార్థులను చూసి ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. ఈనాడు సిలికానాంధ్ర, మనబడి  చేస్తున్న సేవలు ముందుతరాలు కోసమే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

మే 27, 28, 29 తేదీల్లో జరగబోయే 609 జయంత్యుత్సవాల్లో పాల్గొనండి. కర్ణాటక సంగీతం, కూచిపూడి భరతనాట్యంశాల్లోని కళాత్మక విలవల్ని అభినందించండి.

 

Facebook : facebook.com/ SiliconAndhraManaBadi
Youtube : youtube.com/ SiliconAndhraManaBadi
Twitter: @manabadi

ఈ సాంఘిక మాధ్యమాలలో మాతో చెయ్యికలపండి. అక్కడి సందేశాలని జగమంతా చేరేలా పంచుకొని, మీ స్పందన విరివిగా తెలిపి మీ సహకారాన్ని ఇవ్వమని ప్రార్థన.

దశాబ్ది ప్రయాణం - శతాబ్దాల ప్రభావం!

భాషాసేవయే భావితరాల సేవ!!

జయహో మనబడి!!

జయహో తెలుగు!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked