Author: Sujanaranjani

ఓ కరోనా… !

కవితా స్రవంతి
కళ్ళకి కనబడని నువ్వు ప్రకృతి అంటే గౌరవం లేని వారి కళ్ళు తెరిపించావు! ఊరిని లాక్ డౌన్ పేరుతో నిర్మానుష్యంగా మార్చిన నువ్వు మనుషులలోని మానవత్వాన్ని వెలికి తీస్తున్నావు! పిల్లల పాఠశాలలను మూసిన నువ్వు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి సామాజిక బాధ్యతను, నమస్కారంలో ఉండే సంస్కారాన్నీ వారికి నేర్పుతున్నావు! విందూ-వినోదాలనూ, వేడుకలనూ దూరం చేసిన నువ్వు కానికాలంలో రైతన్న విలువను లోకానికి చాటి చెప్తున్నావు! శుభ్రత విషయంలో కఠిన నియమాలను ఏర్పాటు చేసిన నువ్వు పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని, ప్రాముఖ్యాన్ని తెలియబరుస్తున్నావు! రెక్కాడితేకానీడొక్కాడని వారికి గడ్డుకాలం తెచ్చిన నువ్వు ఉన్నవారు దానం చెయ్యడంలో ఉన్న ఆనందాన్ని పొందగలిగేలా చేస్తున్నావు! బడుగు జీవుల బతుకులు కష్టాలపాలు చేసిన నువ్వు - దయలేని బతుకు బతుకే కాదని తెలుసుకునేలా చేస్తున్నావు!

రాక్షస సంహారం!

కవితా స్రవంతి
- శ్రీ శేష కళ్యాణి గుండమరాజు ఓ కరోనా... ! కళ్ళకి కనబడని నువ్వు ప్రకృతి అంటే గౌరవం లేని వారి కళ్ళు తెరిపించావు! ఊరిని లాక్ డౌన్ పేరుతో నిర్మానుష్యంగా మార్చిన నువ్వు మనుషులలోని మానవత్వాన్ని వెలికి తీస్తున్నావు! పిల్లల పాఠశాలలను మూసిన నువ్వు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి సామాజిక బాధ్యతను, నమస్కారంలో ఉండే సంస్కారాన్నీ వారికి నేర్పుతున్నావు! విందూ-వినోదాలనూ, వేడుకలనూ దూరం చేసిన నువ్వు కానికాలంలో రైతన్న విలువను లోకానికి చాటి చెప్తున్నావు! శుభ్రత విషయంలో కఠిన నియమాలను ఏర్పాటు చేసిన నువ్వు పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని, ప్రాముఖ్యాన్ని తెలియబరుస్తున్నావు! రెక్కాడితేకానీడొక్కాడని వారికి గడ్డుకాలం తెచ్చిన నువ్వు ఉన్నవారు దానం చెయ్యడంలో ఉన్న ఆనందాన్ని పొందగలిగేలా చేస్తున్నావు! బడుగు జీవుల బతుకులు కష్టాలపాలు చేసిన నువ్వు - దయలేని బతుకు బతుకే కాద

అర్చన ఫైన్ఆర్ట్స్ అకాడమీ

జగమంత కుటుంబం
కధల పోటీ విజేతలు 1. మొదటి బహుమతి ‘దీర్ఘ సుమంగళీ’ – ఎస్. జి. జిజ్ఞాస 2. రెండవ బహుమతి ‘వాళ్ళూ మనుషులే’ – గరిమెళ్ళ సుబ్బలక్ష్మి 3. మూడవ బహుమతి పొందిన 5 కధలు 'సెలబ్రిటీ'- పోలాప్రగడ జనార్ధన రావు ‘నేనూను’ – అప్పరాజు నాగజ్యోతి ‘పథకం’- మన్యం రమేష్ కుమార్ , 'రక్షణ కవచం' - శ్రీ శేషకల్యాణి గుండమరాజు - USA 'మార్పు' – సత్య గౌతమి - USA కవితల పోటీ విజేతలు ప్రకటించిన విధంగా 8 బహుమానాలు అందుకున్న కవితలు – కవుల పేర్లు. *మొదటి బహుమతులు 2 ..‘మౌనం వీడుదాం’ - బి ఎస్ నారాయణ దుర్గా భట్ ..‘నేనేం తప్పు చేసాను?’ – టేకుమళ్ళ వెంకటప్పయ్య *రెండవ బహుమతులు ..‘అనివార్యం’ – చొక్కాపు లక్ష్ము నాయుడు ..‘దృష్టిలోపం నాదా! మీదా!’ - డా. మార్క శంకర్ నారాయణ ..‘ప్రకృతి ఆక్రందన’ – పి. సాంబశివ రావు ..‘ఇప్పుడు కావాల్సిన రంగు ఒక్కటే!’ – తన్నీరు శశికళ ..‘జాడే లేదు’ – వెంకట సూర్యనారాయణ ..మహిళా రక్షతి రక్షితా!! - యం.ఎ

మనసులో ఏముందో?

కథా భారతి
ఆర్. శర్మ దంతుర్తి కాలేజీ నుంచి ఇంటికొచ్చిన అనామిక మొహం కడుక్కుని లాప్ టాప్ మీద ఏదో పని చేసుకుంటూంటే అమ్మ కాదంబరి పలకరించింది, “అన్నీ సరిగ్గా ఉన్నట్టేనా?” “ఆ ఏదోలే, ఇప్పుడు మాట్లాడకు. చాలా చిరాగ్గా ఉంది.” మరో గంట గడిచాక మొగుడు దేవానంద్ బాత్రూంలో దూరినప్పుడు అనామిక తీరిగ్గా ఉండడం చూసి అడిగింది కాదంబరి, “ఇప్పుడు చెప్పు ఏమిటి కధ?” అనామిక చిన్నగా ఏడవడం వినిపిస్తే కాదంబరి కంగారుగా అడిగింది, “ఏమైందే? నాతో చెప్పు.” వేరే గదిలోకి రమ్మని అమ్మకి చేత్తో సైగ చేసి అక్కడికెళ్ళాక బాగా ఏడవడం మొదలుపెట్టింది అనామిక. ఏడిచేవాళ్ళని కాసేపు ఆ బాధ అంతా దిగిపోయేదాకా ఏడవనివ్వడం మంచిది కనక కాదంబరి ఊరుకుంది. కాసేపటికి తేరుకున్న అనామిక చెప్పింది, “ఈ రోజు ఆఫీసులో ఆ ప్రోజక్ట్ మేనేజర్ దక్షిణాదివాడు వెంకట్ అనే ఆయన పిలిచాడు నన్ను తన రూములోకి. ఎందుకో అని వెళ్ళాను. ట్రైనింగ్ క్లాసులో కొన్ని మంచి ప్రశ్నలు ఇచ్చాను అందరికీ

కవితా, ఓ కవితా!

కవితా స్రవంతి
-శ్రీశ్రీ నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో, నిను నే నొక సుముహూర్తంలో, అతిసుందర సుస్యందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో, నీకై బ్రదుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందున నిషాలందున, ఎటు నే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో, నీ రూపం కనరానందున నా గుహలో, కుటిలో, చీకటిలో ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యంలో, చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో, నిశ్చల సమాధిలో, స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా మస్తిష్కంలో ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్ తోచాయో? నే నేయే చిత్రవిచిత్ర శ్యమంత రోచిర్నివహం చూశానో! నా గీతం ఏయే శక్తులలో ప్రాణస్పందన పొందిందో? నీకై నే నేరిన వేయే ధ్వనులో, ఏయే మూలల వెదకిన ప్రోవుల ప్రోవుల రణన్నినాదాలో! నడిరే యాకస మావర్తించిన, మేఘా లావర్షించిన, ప్రచండ ఝంఝా ప్రభంజనం గజగజ లాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం, ఢంకాధ్వానం! ఆ రాత

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
స్త్రీ గురించి రాసే మరో కవయిత్రి జయప్రభ. ' స్వేచ్చకోసం కవిత్వం వ్రాస్తున్నాను, స్వేచ్చకోసం కవిత్వం రాస్తాను' అని ఈవిడ ప్రకటించుకున్నారు. ఈవిడ తన కవిత్వం ఫెమినిస్టు ధోరణికి చెందినదని చెప్పుకుంటారు. సమాజంలో తనకు జరిగిన అన్యాయాల వల్ల ఒక స్త్రీ సానిగా మరవలసి వచ్చింది. అటువంటి స్త్రీని ' సానిపాప' అనే ఖండికలో సమాజంపై తిరగబడమని చెప్తున్న సందర్భంలో - "రగులుతున్న ఆవేశాన్ని ఆరానీకు, చైతన్య తూరుపులా ప్రజ్వరిల్లు ! అప్పుడు బిగిసిన నీ పిడికిలి మాటున సూర్యుడు కూడా ఉదయిస్తాడు "32 అంటూ స్త్రీ జాతికి సూర్యోదయం కావాలని ఈవిడ కోరుకుంటున్నారు. సమాజంలో జరిగే అనేక సంఘటనలు ఈవిడకు వస్తువులుగా మారాయి. స్త్రీలపై మగవాళ్ళు చూసే చూపులను వర్ణిస్తూ, వాటిని ఎదుర్కొంటే జయం స్త్రీలదే అని ఆవిడ తెలిపారు. అందుకని - " అప్పుడనుకుంటాను కళ్ళకే కాదు ఈ దేశంలోని ఆడదానికి వాళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని 33" ప్రతి

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
రావణాసుర సంహారం అప్పుడాయన తన తమ్ములతో ఈ ఉపద్రవం గూర్చి ప్రస్తావించి, 'లవణుణ్ణి వధించే బాధ్యత మీలో ఎవరు తీసుకుంటార'ని ప్రశ్నించగా లక్ష్మణుడు చిరకాలం అరణ్యవాసం చేసి సౌఖ్యధూరుడై ఉన్నాడని, భరతుడు పద్నాలుగేళ్ళు వ్రతోపవాస తపోదీక్షలో ఉన్నాడని అందువల్ల లవణుణ్ణి సంహరించే కర్తవ్యం తనదని శత్రుఘ్నుడు శ్రీరామచంద్రుడికి విన్నవించుకున్నాడు. దానికి శ్రీరాముడు ఆమోదించి శత్రుఘ్నుణ్ణి అభినందించాడు. 'అట్లా లవణుణ్ణి హతమారిస్తే, వాడి రాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను' అని వాత్సల్యం చూపాడు శత్రుఘ్నుడి మీద. అప్పుడే లాంఛనంగా తక్కిన తమ్ములను ఆనందిస్తూ ఉండగా శ్రీరాముడు మధురాజ్యానికి శతృఘ్నుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఈ సన్నివేశంలో లవణుడు పారాలోకగతుడైనట్లు అని అందరూ ఆనందించారు. అప్పుడు శ్రీ రాముడు తన తమ్ముడుకి ఒక దివ్యాస్త్రాన్ని బహుకరించాడు. అది శ్రీమన్నారాయణుడు సృష్త్యాదిని మధుకైటభులను సంహరించిన మహా