బాలానందం

మనబడి బాలానందం

విళంబి నామసంవత్సర ఉగాది సందర్భంగా, మీ అందరికీ శుభవార్త!

“మనబడి బాలానందం”, రేడియో కార్యక్రమాన్ని, ప్రతి శని-ఆదివారాలు తెలుగువన్ రేడియో (టొరీ) లో మనబడి విద్యార్ధులు అందిస్తున్న సంగతి మీకందరికీ తెలిసిందే.

ఈ ఉగాది నుంచి మనబడి బాలానందం, ఒక సరికొత్త ఇంటర్నెట్ రేడియో చానెల్ Telugu NRI Radio లో కూడా మొదలౌతోంది ! http://telugunriradio.com/ లేదా “Telugu NRI Radio APP” ద్వారా, ప్రతి శని-ఆదివారాల్లో, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు. (1 PM EST, Every Sat and Sunday).

మీరూ, మీ పిల్లలూ కలిసి తప్పక వినండి! ఈ విషయాన్ని మీరు తెలుగు వారందరితోనూ పంచుకోండి !! ఈ ఉగాది నుంచి నెలకు 16 కార్యక్రమాలు!! పదహారణాల తెలుగు కార్యక్రమం నెలకు 16 సార్లు!!
ఆనందం, బాలానందం కేరింతలు – ఇక నుంచి రెండింతలు!

మరి దానికి తగినట్టు, పిల్లలచే రేడియో కార్యక్రమం నిర్వహించే మావయ్యలు, అత్తయ్యలు కూడా మరి రెండింతలు కావాలి కదా!
మీకు బాలానందం జట్టులో పనిచెయ్యాలన్న ఆసక్తి ఉంటే balanandam@manabadi.siliconandhra.org కి ఈమైల్ పంపండి.
లేదా (469) 877-9235 ని సంప్రదించండి.

facebook.com/ManaBadiBalanandam

పేజిని లైక్ చేయండి, షేర్ చేసి అందరితో పంచుకోండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked