మనబడి

మనబడి బాలానందం

మీరందరూ అభిమానించే ‘మనబడి బాలానందం ‘ రేడియో కార్యక్రమం ఇప్పుడు వారానికి 2 రోజులు! ప్రతి శనివారం మరియు ఆదివారం టోరీ రేడియోలో!!
మనబడి – బాలానందం

మనబడి పిల్లలకు తరగతులలో తెలుగు నేర్చుకోవడంతో పాటూ వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉన్నదన్న విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమాలలో “మనబడి బాలానందం”, రేడియో ఒకటి.

గత 7 ఏళ్ళుగా మనబడి పిల్లలు “బాలానందం” కార్యక్రమాన్ని, ఒక చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదంగా అందిస్తున్నారు. పలువురు పెద్దలు బాలానందం అత్తయ్యలు, మామయ్యలుగా, మనబడి పట్టభద్రులు బాలానందం అన్నయ్యలు , అక్కయ్యలుగా మనబడి విద్యార్థులచే ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. వందలాది మంది పిల్లలు బాలానందంలో పాల్గొని, తెలుగు మాట్లాడటంపై, విని అర్థం చేసుకోవడంపై తమ పట్టుని మరింత పెంచుకొన్నారు. పెంచుకొంటున్నారు.

మనబడి బాలానందం రేడియో మీ కోసం ప్రతి శనివారం 11 AM (CST) , ఆదివారం 1 PM (CST) కు online at TeluguOneRadio.com or ToRi App (iPhone/Android/Windows) ద్వారా ప్రసారమవుతుంది.

మీరూ, మీ పిల్లలూ కలిసి తప్పక వినండి! మీకు తెలిసిన తెలుగు వారందరితోనూ పంచుకోండి.

మీ పిల్లలకు బాలానందంలో పాల్గొనాలని ఆసక్తి ఉంటే baalaanamdam@manabadi.sil iconandhra.org కి ఈమైల్ పంపండి.
అలాగే మీకు బాలానందం జట్టులో పనిచెయ్యాలన్న ఆసక్తి ఉన్నా తప్పక సంప్రదించండి.

Foe detaiils go to: manabadi.siliconandhra.org/baalaanandam ఇక్కడ గతంలో జరిగిన కార్యక్రమాలను కూడా వినవచ్చు
and follow us on Social Media at Facebook.com/ManaBadiBaalaanandam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked