సత్యవతి దినవహి
విచక్షణ కలిగిన విద్యావంతురాలై
ఎల్లచోటులా తన ఉనికిని చాటుతూ
అన్నిటా పురుషులతో సరితూగగలనని చూపుతూ
సమాజానికి తన అస్తిత్వాన్ని తెలియజేసిన అభ్యుదయ మహిళ
దక్షత కలిగిన కార్య నిర్వాహకురాలై
శక్తి యుక్తులతో పలురంగాల పురోగమిస్తూ
తానెవ్వరికంటే తక్కువ కాదని నిరూపిస్తూ
సంఘంలో తన స్థానాన్ని ఉన్నతంగా నిలుపుకున్న అభ్యుదయ మహిళ
క్షమత కలిగిన గృహ నిర్వాహకురాలిగా
సహజ సిద్ధమైన సౌమ్యత , సౌశీల్యతతో
ఇంటా బయటా కార్యసాధకురాలిగా రాణిస్తూ
సమస్త స్త్రీ జాతికే తలమానికమై నిలుస్తున్న అభ్యుదయ మహిళ
కుశాగ్ర బుద్ధి కలిగిన నారీ మణిగా
ఎల్లరి మన్ననను మెప్పును పొందుతూ
రాజనీతిలో చాణుక్యుడిని మించిన కౌశలం కనబరుస్తూ
ఉత్తమ ప్రజా నాయకురాలిగా ప్రశంశలు అందుకుంటున్న అభ్యుదయ మహిళ
అధ్భుత ప్రతిభా పాటవాలతో శాస్త్రవేత్తగా , వ్యోమగామిగా
రోదశీయానంలో సౌరమండలమున పాదము మోపి వచ్చి
అసాధ్యమైనది సాధించి ఉన్నతికి హద్దులే లేవని నిరూపిస్తూ
మున్ముందు తరాలకు కూడా మార్గదర్శిగా నిలుస్తున్న అభ్యుదయ మహిళ
*****శుభం*****