– పారనంది శాంతకుమారి
వాదాన్ని వదిలేసి చూడు
వేదం నీ వెంటే ఉంటుంది.
కామాన్ని విడిచిపెట్టి చూడు
రామం నీ జంటే ఉంటుంది.
లోభాన్ని వదిలిపెట్టి చూడు
లాభం నీఇంటే ఉంటుంది.
క్రోధం వదిలిపెట్టి చూడు.
నాదం నీలోనే నెలకొంటుంది.
మదాన్ని విడిచిపెట్టి చూడు
మోదం నీ మదిలోనే కొలువుంటుంది
మాత్సర్యాని వదిలిపెట్టి చూడు
తాత్సారం చేయకుండా మమకారం నీదవుతుంది.
మోహాన్ని మొట్టు మొట్టి చూడు
మాయా దాహం నిన్నోదిలి పోతుంది.
రోషాన్ని వదిలి పెట్టి చూడు
రోగం నీ దరికి చేరకుంటుంది.
కక్షనొదిలిపెట్టి చూడు
రక్ష నీన్నొదిలి పోనంటుంది.
అబద్ధాల నోదిలిపెట్టి చూడు
విశుద్ధం నీ వెంటే ఉంటుంది.