-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
ప్రేమించటమే తప్ప ద్వేషించటం తెలియని వానికి
ప్రారబ్ధమేది?
దీవించటమే తప్ప దూషించటం తెలియని వానికి
ధైన్యమేది?
ప్రార్ధించటమే తప్ప అర్ధించటం తెలియని వానికి
పరితాపమేది?
జీవించటమే తప్ప మరణించటం తెలియని వానికి
దేభ్యమేది?(దేభ్యం=పనికిమాలినది)
ధ్యానించటమే తప్ప దేవులాడటం తెలియని వానికి
దాసోహమేది?
మోక్షాన్నే తప్ప స్వర్గాన్ని కాంక్షించని వానికి
మోహమేది?
వైరాగ్యమే తప్ప వైముఖ్యం లేనివానికి(వైముఖ్యం=వ్యతిరేకత)
విహ్వలత ఏది?(విహ్వలత=బాధ వలన తపన)
కర్తవ్యమే తప్ప కఠినత్వం ఎరుగని వానికి
కర్మబంధనమేది?