– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
కవిత్వమే ఎప్పుడూ రాయాలని ఉంటుంది
వాస్తవాన్ని కళ్లముందు పెట్టాలని ఉంటుంది
నీతిని,నిజాయితిని ఉరి వేసి చంపుతుంటే
నిప్పులా,అగ్గిరవ్వలా మండాలని ఉంటుంది
న్యాయానికి సంకెళ్లు వేసి తిప్పుతుంటే
ధర్మం వైపు ఎప్పుడూ నిలబడాలని ఉంటుంది
సంకుచితమే సమాజంలో ఏలుతూ ఉంటే
మానవతా జెండా ఎగరేయాలని ఉంటుంది
మనసుకు గాయాలు తగులుతూ ఉంటే
నిస్సహాయంగా ఉండిపోవాలని ఉంటుంది
తడిలేని పదాలను పలుకుతూ ఉంటే
మనిషిపై జాలి చూపాలని ఉంటుంది
కోరికలు ఎప్పుడూ జనిస్తూ ఉంటే భీంపల్లి
మనసును అదుపులో పెట్టాలని ఉంటుంది
****