– ఎస్.ఎస్.వి.రమణరావు
గతం నుంచి మంచే తీసుకుందాం
ధైర్యంకళ్ళతోటి భయం చూద్దాం
నిజం తెలిసి తెలివి కూర్చుకుందాం
‘నేడు’లోనే మనం జీవిద్దాం
‘నేడు’లోనే మనం జీవిద్దాం
నిన్న అంటే ఆలోచన
నేడు అంటే చే సే పని
రేపు అంటే తెలిసిందా
నేడులోనే ఉందీ అది
నేడులోనే ఉందీ అది // గతం//
అమెరికన్ని రష్యన్ని
ఇండియన్ని చైనీస్ ని
ఒకే షోలో నిలబెడదాం
ప్రశ్నలన్నీ అడిగేద్దాం
ప్రశ్నలన్నీ అడిగేద్దాం
క్రిస్టియన్నీ ముస్లిమ్ నీ
హిందువునీ బుద్ధిస్ట్ నీ
ఒకే షోలో నిలబెడదాం
ప్రశ్నలన్నీ అడిగేద్దాం
ప్రశ్నలన్నీ అడిగేద్దాం
ప్రశ్నలన్నీ అడిగేద్దాం
జవాబులన్నీ దులిపేద్దాం
మెదడులన్నీ సరిచేద్దాం
మనస్సులన్నీ మార్చేద్దాం
మనస్సులన్నీ మార్చేద్దాం //గతం//
ఉన్నదొకటే ఆలోచన
లేనిదొకటే వివేచన
ధైర్యమంటే కాదు యుద్ధం
స్నేహమంటే ఎందుకూ భయం?
స్నేహమంటే ఎందుకూ భయం? // ప్రశ్న//
భయాన్ని సృష్టించింది మనమే
ధైర్యాన్ని సృష్టించింది మనమే
నిన్నని సృష్టించింది మనమే
రేపుని సృష్టించేది మనమే
రేపుని సృష్టించేది మనమే
మతాన్ని సృష్టించింది మనమే
సైన్సుని సృష్టించింది మనమే
ప్రకృతిని సృష్టించింది మనమే
మనల్ని సృష్టించేది మనమే
మనల్ని సృష్టించేది మనమే //గతం//