– తమిరిశ జానకి
విద్వన్మణి,ప్రముఖరచయిత్రి మంచిమనిషి డా.సి.ఆనందారామంగారు నిన్నరాత్రి (Febraury 11) మనందరినీ వదిలి వెళ్ళిపోయారన్న వార్త ఈ ఉదయం తెలియగానే మనసు స్తబ్ధుగా అయిపోయింది. ఈమధ్య కొన్నిరోజులుగా ఆవిడకి ఒంట్లో బాగులేదని తెలిసి రెండుసార్లు పలకరించాను. ఫోన్లో కూడా ఒక్క నిమిషం కంటే మాట్లాడలేకపోతున్నాను జానకీ అన్నారు.అందుకే తరచుగా ఫోన్ చెయ్యడం మానేశాను.ఆవిడ ఆరోగ్యం ముఖ్యం కదా. ఈ కరోనా గొడవ కాస్త తగ్గితే వెళ్ళి చూసిరావాలనుకున్నాను. ఎప్పుడు సభల్లో కలిసినా మాజానకి అంటూ నన్ను దగ్గిరకి తీసుకునేవారు. మా పుట్టిల్లు ,ఆవిడ అత్తవారిల్లు రెండూ నర్సాపురమే. పైగా ఆవిడ అత్తవారిల్లు మా నాన్నగారింటికి దగ్గిరే. నర్సాపురంలో మా తాతయ్య గారి కాలేజీ వై.ఎన్.కాలేజ్ లో ఆవిడ కొన్నాళ్ళు లెక్చరర్ గా చేశారు. అందరికీ ఆవిడంటే చాలా గౌరవం. నర్సాపురంలో అప్పట్లో ఆ కాలేజీలో చదివిన మా కజిన్స్ అందరికీ ఆవిడ తెలుసు.మా అందరికీ ఆవిడ మంచితనం తెలుసు.
ఆనందారామంగారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.