– తాటిపాముల మృత్యుంజయుడు
ఈ న్యాయం ఉపనిషత్తులలో వివరించబడింది. అయితే, దేవుడు, మతాల జోలికి పోకుండా మనం నివసిస్తున్న జాగృదావస్థ ప్రపంచానికి ఈ న్యాయాన్నిఅనువదించుకుంటే కొన్ని విషయాలు విశదమవుతాయి.
అజ్ఞానం (Ignorance) లోపానికి (Error) దారి తీస్తుంది. వాస్తవికతను (Reality) కప్పేసి ఒక భ్రమలోకి (Illusion) నెట్టేస్తుంది. అగ్రహణం (No Grasping) నుండి అన్యధా గ్రహణానికి (Wrong Grasping) కారణం అవుతుంది. అజ్ఞానం బీజం మొలకెత్తి సమస్యల వృక్షం అవుతుంది.
ఈ తప్పంతా తనకు అంతా తెలుసనుకొని అజ్ఞానమనే చీకట్లో మనిషి ఉండటమే. వెలుతురు పడితేగాని పాము అనే భ్రమ తొలగిపోనట్టు జ్ఞానం సంపాదించనంత వరకు ఇలాంటి దుస్థితి కొనసాగుతుంది. ‘నాకు తెలిసిందల్లా ఒక్కటే, నాకేమీ తెలియదు ‘ అని సోక్రటిస్ చెప్పిన ఆణిముత్యం లాంటి మాటను మనం మరచిపోకూడదు.
మానసిక శాస్త్రం ప్రకారం ఒక మనిషి స్వయాన్ని (Self) నాలుగు భాగాలుగా విభజించవచ్చు. క్రింద ఇచ్చిన నాలుగు డబ్బాలు ఆ Self ను తెలుపుతాయి.
అంటే తనకు అంతా తెలుసు అన్న అపోహలో ఉన్న మనిషికి తన గురించి తనకే సగ భాగం తెలియదన్నమాట. ఇలాంటి విపత్కర పరిస్థితిలో వాద ప్రతివాదాలలో పాల్గొన్న మనిషి వితండ వాదాలు మొదలెట్టుతాడు. మాటల్లో అనేక దోషాలు దొర్లుతాయి. అసంబద్ధ, తిరస్కార, అవహేళన వాదాలు చోటు చేసుకొంటాయి.
ఇలాంటి సమయాల్లో మనం కోరుకొనేది ఒక్కటే. ‘అసతోమా సద్గామయా’, ‘తమసోమా జ్యోతిర్గమయా’ అన్న మాటలను మననం చేసుకోవటమే. ఎప్పుడో ఒకప్పుడు ‘చీకటెళ్ళి వెలుతురొచ్చింది ‘ అనే శుభ తరుణం ఆసన్నమవుతుంది.