– ఎస్.ఎస్.వి. రమణరావు
రండి రండి రండి రండి కదలి రండి రండి తరలి రండి
ఇది తెలుగు మహా’దండి’ భాషమీద
దాడి కన్నతల్లి మీద దాడి భాష మీద కుట్ర
మన ఆస్తి దోచే కుట్ర తెలుగు భాష అంత
చేదా? పుట్టిన మట్టి అంత రోతా? // రండి//
ఇది “హింసనచణ ధ్వంసరచన ధ్వంసనచణ
హింసరచన” అర్థం కాలేదా? చొక్కాల రంగులు వేరైనా
చెడ్డీల రంగులొకటే తెలుగుభాష పై
దాడిలో పార్టీలన్ని ఒకటే గోముఖ వ్యాఘ్రాలన్నీ
ముసుగులన్నీ తీసేశాయ్ కోరలన్నీ
బార సాచి వికటంగా నవ్వుతున్నాయి
ఫేను తిప్పే గాలిలో విషవాయువులే వీస్తున్నాయి
పంక్చరైన సైకిల్ టైరులోంచి అపాన వాయువులే వస్తున్నాయి // రండి//
భూదోపిడి సరిపోలే చెరువు కబ్జా సరిపోలే
కూలగొట్టింది సరిపోలే విడగొట్టింది సరిపోలే
పంచభూత దోపిడి పూర్తి సంస్కృతి దోపిడి షురూ // రండి//
(ఈ కవితగానం కింద ఆడియోలో వినండి)