-అభిరామ్
పరాయి భాషలన్ని నేలపై తారలైతే
ఆ తారలకే వెన్నెలనిచ్చే నేల చంద్రుడే తెలుగు
పరాయి భాషలన్ని ప్రవాహించే నదులైతే
ఆ నదులన్నింటికి పవిత్రతనిచ్చే గంగతీర్థమే తెలుగు
పరాయి భాషలన్ని గొప్పగా కనిపించే చెట్లు అయితే
ఆ చెట్లన్నిటికి ప్రాణం పోస్తూ తన ఘనతను త్యాగం చేసే వేరు రూపమే తెలుగు
పరాయి భాషలన్ని మాటలైతే
ఆ మాటలకే మమకారం పంచే మాధూర్య స్వభావం తెలుగు
పరాయి భాషలన్ని పోటాపోటి తత్వాలైతే
ఆ పోటికే దీటుగా నిలిచిన ద్రవిడ భాష తెలుగు