-పారనంది శాంతకుమారి
నీ ప్రవర్తనలకు నకళ్ళు నీ పిల్లలు
వారిలోని పరివర్తనకు నీ ప్రవర్తనలే ఎల్లలు
నీ బుద్ధులే నీ పిల్లలకు సుద్దులు
నీ ముద్దులే నీ పిల్లలకు అమృతపు ముద్దలు
నీ ఆలోచనలే నీ పిల్లల కాచరణీయాలు
నీఆశీస్సులే నీ పిల్లలకు ఉషస్సులు
నీ ప్రేమే నీ పిల్లలకు గరిమ(గొప్పతనము)
నీ సహనమే నీ పిల్లలకు సంపద
నీ ఆవేశమే నీ పిల్లలకు ఆపద
నీ ఒర్పే నీ పిల్లలకు తీర్పు
నీ నేర్పే నీ పిల్లలకు చేర్పు
నీ నీతే నీ పిల్లలకు రీతి
నీ నిజాయితీవే నీ పిల్లలకు రాయితీ
నీ నిబద్ధతే నీ పిల్లల ఉద్ధతి
నీ పెచ్చే(అధికము) నీ పిల్లలకు ఉచ్చు
నీ ధర్మమే నీపిల్లల సుఖాల మర్మం
నీ అంతరంగమే నీ పిల్లల జీవితరంగం