– అమరవాది రాజశేఖర శర్మ
కంటిరెప్పగా చేనుకు కంచె లాగ
ప్రేమతో నన్ను కాపాడి పెంచెనాన్న
కష్టములనెన్నొ పొందినా కలత పడక
కోరు కోర్కెల నన్నిటిన్ కూర్చె నాన్న
లోక రీతిని సంఘపు లోతు తెలిపి
మంచి వ్యవహర్తగా నన్ను మలచె నాన్న
వేలుపట్టుకు నడిపించి వెంట ద్రిప్పి
మంచి చెడుల వివేకము పంచె నాన్
పండుగలు సంబరాలలో మెండు ముదము
నాకు నందించి నావెంట నాడె నాన్న
అలుకబూనిన ననుగని పలుకరించి
కొత్త బొమ్మలు వరముగా కురిసె నాన్న
నేననారోగ్యమున్ గన తాను నిద్ర
భోజనము మాని దేవుళ్ళ పూజ సేయు
నేను రాయు పరీక్షన నేర్పు కోరి
సతతముపవాస దీక్షలన్ సలుపు నాన్న