-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
అమ్మ పెదవిపై విరిసే నవ్వులో నాన్న,
అమ్మ జడలో మురిసే పువ్వులో నాన్న.
అమ్మ చీరకట్టులో బెట్టులా నాన్న,
అమ్మ నుదిటిపై బొట్టులా నాన్న.
అమ్మ కలలకు ఆకారం నాన్న,
అమ్మ కళలకు సాకారం నాన్న.
అమ్మ కనులలో కాంతి నాన్న,
అమ్మ మనసులో శాంతి నాన్న.
అమ్మ గుండె ధైర్యం నాన్న,
అమ్మ మాట శౌర్యం నాన్న.
అమ్మకొచ్చిన మంచిపేరులో నాన్న,
అమ్మ చూపే ప్రేమ తీరులో నాన్న.
నాన్న లేని అమ్మ అయిపోతుంది సున్నలా,
తనని తాను భావించుకుంటుంది మన్నులా.