– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
నిజమైన ప్రేమెప్పుడూ నిదర్శనాన్నికోరదు,
పదిమందిలో ప్రదర్శనాన్ని కోరదు.
మెప్పును ఆశించదు, ముప్పు తలపెట్టదు.
విశ్వాసంతోనే విస్తరిస్తుంది,విశ్వాసంలోనే వికసిస్తుంది.
మల్లెపూలు,మంచిముత్యాలు ప్రేమకు
వీక్షణానికి,ఆక్షణానికి నేస్తాలు.
కానీ మంచిమనసు,మంచిమాటలు ప్రేమకు
శాశ్వతంగా ప్రశస్తాలు.
నిజమైన ప్రేమ పరితాపాన్నిఒర్చుకుంటుంది,
ప్రతికులాలనుండి పాఠాలను నేర్చుకుంటుంది.
ఒరిమినే తన కూరిమిగా,చెలిమినే తన బలిమిగా,
మౌనాన్నే మేలిమిగా భావిస్తుంది.
ఇచ్చినమాటనే బాటగా చేర్చుకుంటుంది.
తను కొలువున్న మనసునే
మధురమైన భావాల తోటగా మార్చుకుంటుంది.
****