– పారనంది శాంతకుమారి
పుట్టకముందు దేవుడి దయ.
పుట్టిన తరువాత ఆయా దయ.
రెండు సంవత్సరాలోచ్చేసరికి
బేబీకేర్ సెంటర్ దయ.
చదువులకొచ్చేసరికి హాస్టల్ దయ.
ఉద్యోగమొచ్చేక విదేశాల దయ.
అలా పెరిగిన పిల్లలకు
తెలియని పదం దయ.
మరి వాళ్ళకెలా తెలుస్తుంది దయ?
ఇక వాళ్ళెలా చూపుతారు దయ?
ఐనా తాము పొందని దయను
వాళ్ళెలా చూపగలరు?
వాళ్ళ అమ్మానాన్నల ఆవేదనను
వాళ్ళెలా బాపగలరు?
అందుకే, అలాంటి పిల్లలు
తల్లితండ్రులకు దూరమౌతున్నారు,
వారికి అమ్మానాన్నలు భారమౌతున్నారు.
అందుకే వారిని వృద్ధాశ్రమాలలో చేరుస్తున్నారు.
***