– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
నింగిని కొలుస్తాడు
నేలని తొలుస్తాడు
మనసునిమలచలేడు.
గ్రహాన్ని చేరుతాడు
నక్షత్రాన్ని కోరుతాడు
అనుగ్రహాన్నిపొందలేడు.
తెలివితో బొంకుతాడు,
తేటగా ఉండలేడు.
ఆశకు లొంగుతాడు,
ఆశయానికి కట్టుబడలేడు.
మహిని జయిస్తాడు,
మనసును జయించలేడు.
గ్రహంలో ఏముందో తెలుసుకుంటాడు,
గృహంలో ఏముందో తెలియలేడు.
నక్షత్రాన్ని తెలియాలనుకుంటాడు,
స్వక్షేత్రాన్ని తెలుసుకోలేడు.
చందమామ అందాన్ని పొగుడుతాడు,
సొంత భామ అనుబంధాని పొందలేడు.
ప్రకృతి ని జయించాలని అనుకుంటాడు,
తన ప్రవృత్తిని జయించాలనుకోడు.
పై పైకి వెళ్ళాలనుకుంటాడు,
లోలోకి పోవాలనుకోడు.