మనబడి

మనబడి వార్తలు

ఉత్సాహభరితంగా మనబడి పిల్లల నాటకోత్సవం

సిలికానాంధ్ర మనబడి బాలల నాటకోత్సవం అనే మరో అద్భుతానికి తెరతీసింది. ప్రవాస బాలలకు తెలుగు నేర్పించడమే కాకుండా మన సంస్కృతిని అలవరిచే క్రమంలో మరో అద్భుత ఆవిష్కరణ ఇది. ఎంతో ప్రఖ్యాతమైన నాటిక అనే కళాప్రక్రియను బాలలకు పరిచయం చేయడం ద్వారా, ఆ ప్రక్రియ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందనే ఉద్దేశ్యంతో ఉన్న మనబడి విద్యార్ధులకు ఈ నాటిక పోటీలు నిర్వహించింది. ముందుగా ప్రాంతాల వారిగా ఆన్ లైన్(అంతర్జాలమాధ్యమం) ద్వారా వచ్చిన నాటికలను పరిశీలించి, జాతీయపోటీలకోసం క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పీటస్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్ధి బృందాలను ఆహ్వానినిచింది మనబడి.

మిల్పీటస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలోని వేదికపై వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మనబడి విద్యార్ధి బృందాలు చేసిన నాటక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముద్దు ముద్దుగా వారు పలుకుతున్న సంభాషణలు, రాగయుక్తంగా ఆలపించిన పద్యాలు, పాటలు, మన పౌరాణిక, చార్తిత్రక, పాత్రల వేషధారణలతో ఆ పిల్లల సందడి.. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను వెలుగు దివిటీ పట్టి ముందుకు నడిచే సారధులుగా వీరే అని చాటారు. సాయి కందుల ఆధ్వర్యంలో తెలుగుతనం ఉట్టిపడేలా, అత్యంత సుందరంగా అలంకరించిన ఆ ప్రాంగణం అందరినీ ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా, నాటిక పోటీల న్యాయనిర్ణేతగా విచ్చేసిన, ప్రఖ్యాత  నట శిక్షకులు దీక్షిత్ మాష్టారు, చిన్నారుల ప్రతిభ చూసి అచ్చెరువొందారు. మాతృదేశానికి ఇంత దూరంగా ఉన్నా, తెలుగు భాష పట్ల మన కళల పట్ల ఈ పిల్లలకున్న మక్కువ, వారి పట్టుదల, ప్రదర్శనలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, ఈ అద్భుతానికి కారణం సిలికానాంధ్ర మనబడి అని ఆయన అన్నారు. న్యూజెర్సీ, మసాచుసెట్స్,సదరన్ క్యాలిఫోర్నియా మరికొన్ని రాష్ట్రాలనుని బృందాలుగా వచ్చిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు,తల్లితండ్రులతో ఆదివారం నాడు దీక్షిత్ మాస్టారు తో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో, , తమ నటన మెరుగుపరుచుకోవడానికి ఈ చిన్నారులు తెలుసుకోవలసిన ఎన్నో విలువైన విషయాలను, అందుకు చేయవలసిన వివిధ అంశాలను ఎంతో చక్కగా వివరించారు. దీక్షిత్ గారి అనుభవాన్ని, నాటకరంగ పరిజ్ఞానాన్ని, యువతకు అందించడానికి సోమవారం నుండి శుక్రవారం వరకు  యువతీ యువకులకోసం మరో నటశిక్షణా శిబిరం నిర్వహించామని మనబడిఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు, బృందాలకు, నాటికలకు, దర్శకులకు దీక్షిత్ గారితో పాటు, మరో విశిష్ట అతిధిగా విచ్చేసిన శ్రీ జొన్నవిత్తుల గారు బహుమతులను అందజేసి, మనబడి చేపట్టే కార్యక్రమాలను, చిన్నారుల ప్రతిభాపాటవాలను, తనదైన చమత్కారం తో కూడిన కవితాత్మకంగా ప్రశంసిస్తూ, ఆశీర్వదించి,సభాసదులను ఉత్తేజపరిచారు.  మనబడి నాటకోత్సవం లో విద్యార్ధుల ప్రదర్శనలు చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నటులు శ్రీ రఘు మల్లాది ప్రతి సంవత్సరం, సీనియర్ మరియు జూనియర్ విభాగాలలో ఉత్తమ ప్రదర్శన బహుమతి విజేతలైన జట్లకు 1116 డాలర్ల నగదును ‘మల్లాది పురస్కారం’ పేరిట అందించనున్నట్టు ప్రకటించి, ఈ సంవత్సర పురస్కారాన్ని అక్కిడికక్కడే విజేతలకు అందించారు. తెలుగు భాషతో పాటు మన కళలు, సంస్కృతిని పిల్లలకు నేర్పే మనబడి కి అమెరికా వ్యాప్తంగా WASC గుర్తింపు లభించిందని, 2017-18 సంవత్సర ప్రవేశాలు(అడ్మిషన్లు) ప్రారంభమైనాయి, మరిన్ని వివరాలకు మరియు నమోదు చేసుకోడానికి manabadi.siliconandhra.org చూడవచ్చని మనబడి అద్యక్షులు రాజు చమర్తి తెలిపారు.  సెప్టెంబరులో మనబడి తరగతులు 250 కేంద్రాలలో ప్రారంభమౌతాయి.

అన్ని కేంద్రాలతో కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి గత 4 నెలలుగా ముందుండి నడిపించిన రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, తనకు సహకరించిన జయంతి కోట్ని, మాధవి కడియాల,రవీంద్ర కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, కిరణ్ పారుపూడి, వంశీ నాదెళ్ల , నాటకోత్సవ బృందం, ఎంతో కృషి చేసారని, అదేవిధంగా నాటకోత్సవంలో పాల్గొన్న మనబడి విద్యార్ధులు, వారి తల్లి తండ్రులకు,ఉపాధ్యాయులకు, కో-ఆర్డినేటర్లకు, దర్శకులు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన రవీంద్ర కూచిభొట్ల, మాధవ కిడాంబి, భారత దేశం నుంచి సహకరించిన వెంకట్ మాకిన లకు కార్యక్రమ నిర్వహణ బృంద నాయకురాలు స్నేహ వేదుల ధన్యవాదాలు తెలిపారు.

 గెలుపొందిన వారు:

 జూనియర్ లెవెల్

1 బెస్ట్ టీమ్ – “తెలుగు విలుగు” –   డైరెక్టర్ అనిల్ గన్టేటి, సరస్వతి తూటుపల్లి, Loiusville  KY

2 బెస్ట్ డైరెక్టర్ -“గురుదేవోభవ” –   దీప్తీ గోరా, Walpole MA


బెస్ట్ యాక్టర్స్

ఎ) జానపదకళలు –  బుడబుక్కలవాడు –   వినేష్ నాగవల్లి, Princeton NJ

బి) జానపదకళలు –  హరికతకురాలు –    వైష్ణవి కొరిటాల,  Princeton NJ

సి)జానపదకళలు –   బుర్రకతకురాలు  –   కీర్తి గుమ్మడి,  Princeton NJ

డి) గురుదేవోభవ   –   ద్రోణుడు  –   నిబోత్  జోగమ్, Walpole MA

ఇ) తెలుగు వెలుగు  –   నరుడు  – శ్రీయాన్ష్ బోయ , Loiusville KY  

సీనియర్ లెవెల్

1) బెస్ట్ టీమ్ –  శిశుపాల వేద , Princeton NJ    రత్న వేట, శ్రీనివాస్ కొరిటాల, రాజేశ్వరి రమానంద్, శ్రీవిద్య మానికొండ

2)బెస్ట్ డైరెక్టర్  –  శిశుపాల వేద, Princeton NJ  రత్న వేట, శ్రీనివాస్ కొరిటాల, రాజేశ్వరి రమానంద్, శ్రీవిద్య మానికొండ

బెస్ట్ యాక్టర్స్

ఎ)శిశుపాల వేద  – శిశుపాలుడు –  ప్రణవ్ శ్రీహరినారాయణ మానికొండ,Princeton NJ

బి)ప్రహ్లాద చరితం –  పెద్ద ప్రహ్లాదుడు  –  అమృత ముమ్మడి, San Antonio TX

సి)ప్రహ్లాద చరితం –  చిన్న ప్రహ్లాదుడు –  శ్రీతన్వి సాయికోట,San Antonio TX

డి)ఫ్రహ్లాద చరితం  – హిరణ్యకశిపుడు –  వెంకట శిశిర్ భరద్వాజ్ ఇనగండ్ల, San Antonio TX

ఇ)రామకృష్ణ విజయం  –  అల్లసాని పెద్దన –  ఆమని ఇంద్రగంటి, Hollywood CA​

ఘనంగా సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవ ప్రాంతీయ సదస్సు

మిచిగాన్, జులై 23: అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం, మనబడి మధ్య ప్రాంత భాషాసైనికుల “ప్రాంతీయ సదస్సు”లు ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు మిచిగాన్ మనబడి జట్టు నిర్వహించిన ఈ కార్యక్రమాలకు పళిగరం దుష్యంత నాయుడు నాయకత్వం వహించారు.

పది సంవత్సారాల క్రితం ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి గత మూడేళ్ళుగా శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారితో కలిసి అమెరికా, కెనడా, ఐరోపా
ప్రాంతాలలో జూనియర్, సీనియర్ స్థాయిల్లో తెలుగు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన పిల్లలకు పట్టాలు అందజేస్తోంది. మిచిగాన్ మనబడి కేంద్రాలలో “ప్రకాశం”, “ప్రభాసం” స్థాయిలు పూర్తిచేసి పట్టభద్రులైన విద్యార్థులకు ఇది మొదటి స్నాతకోత్సవం. డెట్రాయిట్‌కు దగ్గరగా ఉన్న వాల్లీడ్ లేక్ అనే నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిచిగాన్, కెనడా, టొరంటో, ప్రాంతాల నుంచి సుమారు 160మంది విద్యార్థులు పట్టాలు తీసుకోవడం విశేషం. ఈ వేడుకలకు ముక్కామల అప్పారావ్
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలకు పట్టా ప్రదానం చేసి “ఆచార్య దేవో భవ” అంటూ అశీర్వదించారు. మనబడి ఉపాధ్యాయులను వేదికపై పిలిపి భినందించారు.
విద్యార్థులకు తన సందేశాన్ని అందించారు.

స్నాతకోత్సవం తరువాత రెండు రోజుల పాటు ఫార్మిన్‌టన్ హిల్స్‌లో మనబడి ఉపాధ్యాయులు, కార్యకర్తలు, భాషాసైనికులు “మనబడి సదస్సు”లో సమావేశమయ్యారు. తెలుగును పిల్లలకు మరింత చేరువచేయడానికి వివిధ మనబడి కార్యక్రమాల గురించి మేధామథనాలు చేసి ప్రణాళికలు రూపొందించారు. ఈ సదస్సులో సుమారు 200 మంది భాషాసైనికులు మిచిగాన్, ఒహియో, ఇల్లినాయిస్, టెక్సాస్, ఇండియానా, మిన్నెసోట, కాన్సాస్, మిస్సోరి, విస్కాన్సిన్, టెన్నెసి, ఫ్లోరిడా, కాలిఫొర్నియా రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. అందులో సుమారు 120 ఉపాధ్యాయులకు తెలుగు బోధనాపద్దతులు మరింత మెరుగు పరచడానికి, మనబడి ప్రాఠ్యప్రణాళిక బృందం, కూచిభొట్ల శాంతి ఆధ్వర్యంలో “ప్రశిక్షణ” కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మనబడి కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ.. సిలికానాంధ్ర మనబడి ఉపాధ్యాయులకు ఇచ్చే ప్రశిక్షణ, పలు మనబడి కేంద్రాలలో పాఠ్యప్రణాళికను ఒకే పద్దతి ప్రకారం బోధించేందుకు దోహద పడుతుందని ఆయన అన్నారు. ఉన్నత స్థాయి ప్రమాణాలను అందుకోవడానికి ఇది అత్యంత కీలకమైన విధానమని అన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా గుర్తింపు తెచ్చే పరీక్షలు వంటివి నిర్వహించడం వల్ల ఇప్పుడు అమెరికాలో డబ్ల్యూఏఎస్‌సీ(వెస్టర్న
అసోషియేషన్ అఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్) ద్వారా గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. మిచిగాన్ రాష్ట్ర సమన్వయకర్త తోంటా శ్రీనివాస్ “ఈ గుర్తింపు ద్వారానే
మిచిగాన్‌లో పలు స్కూల్ డిస్ట్రిక్ట్స్‌లో తెలుగుకు ఫారెన్ లాంగ్వేజ్ క్రెడిట్ఆమోదం వచ్చిందన్నారు. దీనివల్ల ఇక్కడి ప్రవాస తెలుగు పిల్లలు ఇంకొక భాష నేర్చుకొని క్రిడిట్స్ కోసం శ్రమ పడే కంటే.. మన మాతృభాష నేర్చుకుని మన భాష, మన సంస్కృతిని ముందు తరాలకు తీసుకువెళ్ళగలరని అన్నారు.

ఈ సందర్భంగా దుష్యంత నాయుడు మాట్లాడుతూ “ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రేరణ మా పిల్లలే, వాళ్ళు నేర్చుకుంటున్న తెలుగే మాకు సంతృప్తి” అన్నారు.
పిల్లలకోసం ఎంతోమంది భాషాసైనికులు ఈ కార్యక్రమాలు అన్నింటినీ విజయవంతం చేయడానికి మూడు నెలలుగా అహర్నిశలు కష్టపడి పనిచేశారని, వారికి పేరు పేరునా ధన్యవాదాలని అన్నారు. ఈ వేడుకలకు మెట్రో టెన్నీస్ అకాడమీ వారు ఆర్థిక సహకారం ఇచ్చారు. టర్మిరికన్, నోవి, అరోమా రెస్టారెంట్, ఫార్మిన్‌టన్ హిల్స్ వారు విందును సమకూర్చారు. సిలికానాంధ్ర మనబడి తెలుగును తరగతులలోనే కాకుండా పిల్లలకు తెలుగు మరింత దగ్గరయ్యేందుకు, బాలానందం రేడియో, “తెలుగు మాట్లాట” ఆటల పోటీలు, పిల్లల పండుగ, నాటకోత్సవాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేబడుతోంది. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే విద్యాసంవత్సరంలో పిల్లలను manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చు. సిలికానాంధ్ర మనబడి ఒక దశాబ్ది ప్రయాణంలో తెలుగును ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాష చెయ్యడంలో తనవంతు కృషి చేస్తోంది. భాషాసేవయే భావితరాల సేవ అన్న నినాదంతో తెలుగు వారినందరినీ చెయ్యి కలపమని అహ్వానిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked