– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
అట్టుకు రెండవ వైపు ఉంటుందని తెలుసుకోలేని అజ్ఞానులం మనం.
మన ………మనదీపమై వెలుగుతోందని గర్విస్తామే తప్ప,
అదే దీపం మనం చేసుకున్న పాపమై,
భవిష్యత్తులో మననే కాలుస్తుందని తెలుసుకొనలేము.
కన్నూమిన్నూ కానని ఆవేశంలో,
మిడిసిపాటుతో కూడిన యవ్వనంలో,
మనం ఆడిందే ఆట, పాడిందే పాట అవుతూ ఉంటే,
అదే శాశ్వతం అనుకుంటూ గడుపుతాము
నేడు ఇటుకాలిన అట్టు రేపు అటుకూడా అలానే కాలుతుందని,
గుర్తించలేము,తెలుసుకోలేము
నేటి మన దుష్ప్రవర్తనలే రేపటి యమ పాశాలై
మనని దుఃఖానికి గురిచేస్తాయని ఊహించలేము
తీరా తెలిశాక చేయటానికి ఏమీ మిగిలి ఉండదు
అనుభవించటమే తప్ప ఆలోచనకు తావుండదు
ఆక్రోశించటమే తప్ప ఆచరణకు అవకాశం ఉండదు
***