కవితా స్రవంతి

శ్రీ

శ్రీ
– అరుంధతి

పండుగ శుభదినమూ నేడే
ఆమని ఆగనం నేడే ||పండుగ||
కమ్మని కోయిలా పాడవే తీయగా
వసంత హేలలకూ నీదే తొలిపిలుపుగా
నీరాగ మధురిమా ఏ దేవివరవమో
ఆ మావి చివురిదీ ఏ జన్మల తపమో ||ఆ మావి||
ఆహా నీ గానము నేర్పుమా
ఊహకు అందని నీ మాధుర్యం చూపుమా
నీవెరుగని రాగమా నువు పలుకని భావమా
స్వరమాధురి లాహిరిలో అలుపెరుగని యోగమా ||స్వర|| ||పండుగ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked