జగమంత కుటుంబం

శ్రీ UAN మూర్తి స్మారక పోటీ

శ్రీ UAN మూర్తి స్మారక పోటీ విజేతల ప్రకటన

టాగ్స్ ఆధ్వర్యంలో జరిగిన “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” విజేతల ప్రకటన

2021 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారికి పరిమితమైన ఈ పోటీలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా, అబు దాబి, ఇంగ్లండ్, స్పెయిన్, కజక్ రిపబ్లిక్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ కూడా పాల్గొనడం హర్షణీయం, అపూర్వం. ప్రపంచమంతా కరోనా మహమ్మారి పై పోరాడుతున్న నేపథ్యంలో టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవ లో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన ప్రవాస రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net) , సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org ), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె” http://sirimalle.com , స్వర మీడియా https://magazine.swara.media/ మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. బహుమతి పొందిన రచనలు, మరియూ ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక http://sactelugu.org/tags:patrika/ లోనూ ప్రచురించబడతాయి.

“ఉత్తమ కథానిక విభాగం విజేతలు”

1.ప్రథమ బహుమతి : దేవుని న్యాయం : జానకి చమర్తి (మలేసియా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

2.ద్వితీయ బహుమతి : సంబరాల సంక్రాంతి : సత్య పారుపూడి (టెక్సస్, అమెరికా) ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

3.తృతీయ బహుమతి : ఉన్నదానికీ – అనుకున్నదానికీ : శారద మురళి (ఆస్ట్రేలియా) ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

న్యాయనిర్నేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కథానిక:
1.ఆశా నిశాంతంలో : సత్యం మందపాటి (టెక్సస్, అమెరికా) ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:

1.గోవింద గీత : వాత్సల్య గుడిమళ్ళ (సింగపూర్)

2.తేనెలొలుకు తెలుగు భాష : శ్రీశేష కల్యాణి గుండమరాజు (రాక్లిన్, కాలిఫోర్నియా, అమెరికా)

3.పత్రం పుష్పం : శ్రీధర రెడ్డి బిల్లా (క్యూపర్టినో, కాలిఫొర్నీయా, అమెరికా)

4.ఒక ఆత్మీయ స్పర్శ : మీరా సుబ్రమణ్యం తంగిరాల (శాన్ రెమోన్, కాలిఫొర్నీయా, అమెరికా)

5.కామెర్లు : ఆర్. శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా)

6.అనూహ్యం : రాధిక నోరి (ఫ్లోరిడా, అమెరికా)

ప్రశంసా పత్రం పొందినవారు:

1.విరబూసిన కమలం : చాందిని బిల్లా (ఆస్ట్రేలియా)

2.ఋణానుబంధం : మల్లిఖార్జున రావు కొమర్నేని (ఓక్లహోమా, అమెరికా)

3.ఆ మూడురోజులు : సింధూరి పోతుల (కజక్ రిపబ్లిక్)

5.గూడు : శేషు శర్మ (వాషింగ్టన్ డీసి, అమెరికా)

6.బిడ్డా.. నువ్వు గెలవాలి! : వేణు నక్షత్రం (వర్జీనియా, అమెరికా)

ఉత్తమ కవిత విభాగం విజేతలు:

1.ప్రథమ బహుమతి : ద్రౌపది(పద్య ఖండిక) : శఠగోపన్ శ్రీవాత్సవ శేషం (లాస్ ఏంజల్స్, కాలిఫొర్నీయా, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

2.ద్వితీయ బహుమతి : భాగ్యగరిమ : విశాలాక్షి దామరాజు (కెనడా) ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

3.తృతీయ బహుమతి : లోపలి మనిషి : రాపోలు సీతారామరాజు (దక్షిణాఫ్రికా) ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

న్యాయనిర్నేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కవిత:
1.శివోహం! శివోహం!! : సంధ్య ఎల్లాప్రగడ (జార్జియా, అమెరికా) ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు:

1.ఒంటరి బందీ : శ్రీధర రెడ్డి బిల్లా (క్యూపర్టినో, కాలిఫొర్నీయా, అమెరికా)

2.వలస కూలి : రాజేష్ తోలేటి (ఇంగ్లండ్)

3.మానిసి : గౌతమ్ లింగ (దక్షిణాఫ్రికా)

4.నేటి ప్రపంచం : లక్ష్మి హారిక కవలిపాటి (వర్జీనియా, అమెరికా)

5.జీవిత సూత్రాలు : రాధికా నోరి (ఫ్లోరిడా, అమెరికా)

6.చిల్లు గారె : మనోహర బోగ (న్యూ జెర్సీ, అమెరికా)

ప్రశంసా పత్రం పొందినవారు:

1.‘బాలు’ జ్యోతి : రవికాంత్ పొన్నాపల్లి (టెక్సాస్, అమెరికా)

2.బ్రతుకు పోరాటంలో : యామిని కొల్లూరు (గల్ఫ్ – అబు దాబి)

3.అందిన ద్రాక్ష : వెంకట వరలక్ష్మి కామేశ్వరి వెలగలేటి (టెక్సాస్, అమెరికా)

4.ఒక కవిత కోసం : సునీతాదేవి నన్నపురాజు (మిచిగన్, అమెరికా)

5.మేము స్వలింగ సంపర్కులం : చాందిని బిల్లా (ఆస్ట్రేలియా)

విజేతలందరికీ సాహిత్యాభినందనలు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర మరియూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు!!! “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” నిర్వహణకు సహాయ సహకారలు అందజేసిన శ్రీ రమేష్ వడలి గారికి టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుంది. భారత్ తో సహా విదేశాలలో నివసిస్థున్న రచయితలు ఎవరైనా వారి కథ, కథానిక, కవిత, వ్యాసాలు, మరియూ పుస్తక పరిచయం వంటి రచనలు మా ఈమెయిలు telugusac@yahoo.com కు పంపవచ్చును. శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక పూర్వ సంచికలకోసం ఈ లంకెను సందర్శించండి: http://sactelugu.org/tags:patrika/

విజేతలకు మనవి:
మీ స్పందన ను ఒక వీడియో సందేశం రూపంలో మాకు జనవరి 17 లోగా మాకు పంపవలెనని విజ్ఞప్తి. మీ వీడియో సందేశాన్ని (1ని మించకుండా) మా కార్యకర్త ఫోన్ 001-408-887-0284 (వెంకట్) కు వాట్స్ ఆప్ ద్వారా పంపండి. “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” విజయవంతం కావడం పై ఒక 30ని-40ని కార్యక్రమం ఆన్ లైను ద్వారా తలపెట్టాము. సదరు కార్యక్రమంలో మీ అనుమతితో మీ వీడియో సందేశం కూడా ప్రదర్శింపబడుతుంది. కార్యక్రమం తేదీ, సమయముతో కూడిన పూర్తి వివరాలు, ఆన్ లైను లింకు మీకు త్వరలో అందజేస్తాము.

ధన్యవాదాలు!

భవదీయులు,

శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం

ఈమెయిలు: telugusac@yahoo.com

Telugu Association Of Greater Sacramento (TAGS)

Post Box: 1666

Folsom, CA – 95763, USA

Website: http://sactelugu.org

Facebook: https://facebook.com/sacTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked