-పారనంది శాంత కుమారి.
పెద్దలను గౌరవిస్తున్న వాళ్ళను చూసి
అదేమంత గొప్ప పనికాదు అంటావు.
తల్లితండ్రులను ఆదరిస్తున్నవారిని చూసి
అదంతా ప్రకటన కోసం అంటావు.
కుటుంబంతో కలిసున్నవారిని చూసి
వేరేఉండే ధైర్యంలేకే అలా ఉన్నారంటావు.
తల్లితండ్రుల మాటను వింటున్నవారిని చూసి
బుద్ధిలేని దద్దమ్మలంటావు.
సాంప్రదాయాలను అనుసరిస్తున్నవారిని చూసి
ఛాందసులు అంటావు.
సమాజసేవ చేస్తున్నవారిని చూసి
జీవితాన్ని ఎంజాయ్ చేయటం తెలియదంటావు.
ఓర్చుకుంటున్న వారిని చూసి
చేతకాని,చేవలేని వారంటావు.
భక్తి చేస్తున్నవారిని చూసి
బడాయి చూపుతున్నారంటావు.
నీకు తెలిసినదే రైట్ అంటావు
అవతలివారిదే తప్పంటావు.
నోరు పెట్టుకొని సాధిస్తావు
అర్ధరహితంగా వాదిస్తావు.
నీ నీడను కూడా నమ్మనంటావు
ఇలా అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు.
ఇదేం పాడుబుద్ధి నీకు?