ప్రఖ్యాత చిత్రకారుడు, కీ.శే. చంద్ర గారికి సుజనరంజని నివాళి!
కొద్ది రోజుల కాలం చేసిన చిత్రకారుడు చంద్ర గారితో సిలికానాంధ్ర సంస్థకు, సుజనరంజని మాసపత్రికకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. వాటి అక్షర గుర్తింపు చిహ్నాలను (logos) తీర్చి దిద్దింది ఆ మహనీయుడే.
అలాగే, అన్నమయ్య అంటే ఇలాగుండాలి అని అన్నమయ్య ఉత్సవాల కోసం పదకవితామహుణ్ణి కో అందమైన రూపం కల్పించి ప్రపంచమంతా అందరూ ఉపయోగించుకునేలా చేసింది ఆ అపురూప శిల్పియే.
ప్రతి ఏడు వెలువడే ప్రత్యేకసంచికలలో కొన్నింటికి ముఖచిత్రం వేయటమే కాకుండా లోపలి కథలు, కవితలకి బొమ్మలు కూడా గీసారు. ఈ పనుల్లో వారితో ఫోనులో పలుసార్లు సంభాషించటం జరిగింది. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆ మాటలు నెమరువేసుకుంటాను.
తెలుగు ప్రజలకు తీర్చలేని లోటు అతని మరణం.
ఓం శాంతిః
– తాటిపాముల మృత్యుంజయుడు