జగమంత కుటుంబం

చారిత్రక నవలా రచన పోటీ!

-డాలస్ వాసి, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో….
వారి తల్లిదండ్రులు – *జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక*

*సిరికోన ఉత్తమ చారిత్రక నవలా రచన పోటీ*

(రూ.25,000విలువ గలది)

నిబంధనలు- విధాన వివరాలు:
1. అనాది కాలం నుంచి, స్వాతంత్ర్యోద్యమ కాలం వరకు
ఏ నాటిదైనా, తెలుగువారికి సంబంధించిన
చారిత్రక ఇతివృత్తమై ఉండాలి!
2. ముద్రణలో రెండు వందల పుటలకు తగ్గరాదు.
3. పోటీ ఫలితాలు వెలువడిన వెంటనే రూ. 10,000/ విజేత
అకౌంటుకు పంపబడుతుంది. ముద్రిస్తున్నప్పుడు ఆ పై వ్యయం
గరిష్టంగా రూ.15,000/-కు మించకుండా అందజేయబడుతుంది.
4. లోన రెండో అట్ట మీద పురస్కారప్రదాత తల్లిదండ్రుల పేర్లు,ఫోటో,
వారి స్మారక పురస్కారవిజేత రచన అని ప్రచురించవలసి
ఉంటుంది. అంకితం మాత్రం తమ అభీష్టం ప్రకారం ఇచ్చుకోవచ్చు.
5. రచనపై హక్కులు రచయితకే ఉంటాయి. అయితే ఎపుడు
పునర్ముద్రించినా రెండో అట్టపై పై స్మారక పురస్కార వివరాలను
ఫోటో సహితంగా ముద్రించవలసి ఉంటుంది.
6. బహుమతి పొందిన నవలను సిరికోన భారతి మాసపత్రికలో సీరియల్ గా
ముద్రించటం జరుగుతుంది. 2021 చివరివరకు పుస్తకరూపంలో
తప్ప, మరెందులోనూ నవలను సీరియల్ గా ముద్రించకూడదు.
7. పురస్కార నిర్ణయంలో న్యాయనిర్ణేతలదే తుది తీర్పు!
*8. రచనలు పంపడానికి ఆఖరు తేదీ― 31 జులై 2021.*
రానున్న ఆగస్ట్15 కున్న ప్రత్యేకత రీత్యా ఆ తేదీన ఫలితాలు వెల్లడింపబడుతాయి.
*ఇది మన ప్రియ భారత స్వాతంత్ర్య ఉత్సవాల ప్రత్యేక కానుక*

9. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలెవరైనా ఈ పోటీలో పాల్గొని తమ రచనలు సమర్పించవచ్చు. (కనుక ఈ వార్తను ఎక్కువమందికి అందేలా చూడాలని విజ్ఞప్తి!)

ఇతర వివరాలకు సంప్రదించండి:
సుబ్బు జొన్నలగడ్డ:
+1 (214) 621-1790
గంగిశెట్టి లక్ష్మీనారాయణ:
+1 (341) 356- 1093

 

******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked