కవితా స్రవంతి

తెలుగు వెలుగుల స్వాగతం పాట

పల్లవి : ముద్దు ముద్దుల మూట నా తెలుగు మాట
మురిసిపోయే పూజ నా తెలుగు పాట
వేల యేండ్ల చరిత గలది తెలుగు భాష
ఎన్నో అణచివెతలను చవిచూసిన ఆశ
నా తెలుగు భాష
చరణం : నిజాము పాలనలో నలిగినట్టి భాష
అయినా తన అస్తిత్వం వదులుకోని ఆశ
పోన్నిగంటి తెలుగన అచ్చతెలుగు భాష
మల్కిభరాముడిన కుతుబ్ షాహి పోషించిన భాష
నా తెలుగు భాష ||ముద్దు||
చ|| సురవరం ప్రతాపరెడ్డి – గోల్కొండ కవుల సంచిక
నన్నయ, తిక్కన, ఎర్రన = రాసిన మహాభారతం
సినారె సిరా చుక్క నుండి జాలువారె భాష
శ్రీశ్రీ అందించిన జయభేరి రా నా భాష
రణభేరిరా నా తెలుగు ||ముద్దు||
చ|| కాళోజి నేర్పినట్టి పలుకుబడల భాషరా
సామల, (సదాశివం) యశోదరేద్ది తెలంగాణా యాసరా
కందుకూరి, గురజాడ, గిడుగు జనం మాటరా
పాల్కుర్కి వారి ద్విపద చందము నా భాషరా
సందమామనె తెలుగురా ||ముద్దు||
చ|| జానపదుల జనజాతర – తెలంగాణ నేలరా
కళామతల్లి కల్పవల్లి – తెలంగాణ గడ్డరా
ఆమరుల త్యాగాలకు – ఊపిరిచ్చిన తెలుగురా
జయశంకర్ జూపినట్టి – ఉద్యమాల బాటరా
నా తెలుగు భాషరా ||ముద్దు||
చ|| ఘనకీర్తి తెలుగు వెలుగు గొప్పదనం – చాటగా
కమ్మనైన అమ్మ భాష నలుదిక్కుల చాటేందుకు
హైద్రబాదు నగరమంతా తెలుగు వెలుగులు పూయించగా
ప్రపంచ తెలుగు మహాసభల సంబరమే చేద్దాము
స్వాగతమే చెబుదాం ||ముద్దు||

రచన : శ్యామల, జానపద కళాకారిణి
గుమ్మడి వెంకటేశ్వరరావు అవార్డు గ్రహీత,
వాసవి డిగ్రీ కాలేజ్, హ్యాపినేజ్ స్కూల్,
తెలుగు ఉపాధ్యాయురాలు, మహబూబ్ నగర్,
చరవాణి: 73860 49020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked