బాలాంత్రపు నివాళులు

వంశీకృష్ణ

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు

(ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!)

రజనీ గంధ

సంగీత సాహిత్య సమలంకృతే అనే పద బంధం చాలా కొద్దిమందికే నప్పుతుంది . సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే అని కాళిదాసు సరస్వతీ దేవిని ప్రార్ధించాడు . ఈ రెండు సమపాళ్లలో ఒకరిలోనే ఉండి ఆ ఒక్కరూ
నూరు శరత్తులు వీక్షించి తన చుట్టూ వున్నా ప్రపంచాన్ని రాగ భరితము ,పరిమళ భరితము చేస్తే ఆ పుంభావ సరస్వతిని మనం బాలాంత్రపు రజని అంటాము . ఆ రజని ఇక లేరు.
టి వి అనే మాధ్యమం సకల సంస్కృతులను మాయం చేయక ముందు తెలుగు వాడికి సాంస్కృతిక దారి దీపం ఆకాశవాణి . రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఆకాశవాణి అని నామకరణం చేస్తే దాన్ని ఇంటింటి పేరు గా
మలిచింది రజని . ప్రారంభ దశలో ఆకాశవాణికి జవం ,జీవం బాలాంత్రపు రజనీ కాంత రావు గారే.
పాప్ , రాక్ సంగీతాల్లాంటి సంగీతానికి భిన్నంగా హృదయాలను లలిత లలిత గా స్పృశించి , పరవశింపచేసే లలిత సంగీతానికి వైతాళికుడు రజనీ . నిజానికి లలిత సంగీతాన్ని లలిత సంగీతం అని కాక రజనీ సంగీతం అని పిలవాలి . బెంగాల్ లో రవీంద్ర సంగీతం లాగా . తెలుగువాడికి ఆ స్వర సంస్కారం లేక పోవడం వలన అది కేవలం లలిత సంగీతం గానే మిగిలి పోయింది .
కొండ నుండి కడలి దాకా అంటూ ఆయన రూపొందించిన కార్యాలక్రమానికి తొలిసారిగా ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి అంతర్జాతీయ బహుమతి వచ్చింది . నది కొండల్లో పుట్టి సముద్రం లో కలుస్తుంది . ఈ నడుమ ప్రయాణం ఎంతో వైవిధ్యభరితంగా కొనసాగుతుందో , అంత వైవిధ్యభరితంగానూ ఈ సంగీతం మనసును హరిస్తుంది . నది ప్రవహించినంత మేరా జన జీవనం లో ఎన్ని వస్తాయి ? అన్ని మార్పులనూ పిల్లలకు సైతం అర్ధం అయ్యేలా ఆయన సంగీత రూపకాన్ని తయారు చేశారు .
“ఉ ప్పొంగి పోయింది గోదావరి , తానూ తెప్పున్న ఎగసింది గోదావరి”అనే అడవి బాపిరాజు గీతాన్ని విశ్వనాధ”హా యని కిన్నెర యేడ్చెను . తన మనోహరుడు శీలా అయినాడని , తానేమో వాగు అయినానని”అనే రచన మరికొన్ని శ్రీనాధుడి సీస పద్యాలతో , కీర్తనలతో రజని చేసిన కార్యక్రమం అత్యంత శ్రవణ పేయంగా వుంది అంతర్జాతీయ పురస్కారాలు పొందింది .
భానుమతికి చిరకాల కీర్తి గడించి పెట్టిన పాత ” ఓహోహో పావురమా ” పాత వెనుక ఒక ఆసక్తికరమైన కదా వుంది . Blooda and Saand అనే సినిమా లో హీరోయిన్ స్పానిష్ బాణీలో పాడిన ఒక పాత బి యెన్ రెడ్డి గారికి ఎంతో నచ్చిందట . మర్నాడు చిత్తూరు నాగయ్య , రజినీకాంత రావు , అద్దేపల్లి రామారావు , ఓగిరాల రామచంద్ర రావు గార్లను వెంట పెట్టుకుని ఆ సినిమా మళ్ళీ చూశారట . ఆ స్పానిష్ ట్యూన్ గురించి మీ మీ అభిప్రాయాలు చెప్పండి అని అడిగారట. ఆ తరువాత బి యెన్ రెడ్డి గారికి ఈ నలుగురు ఇచ్చిన తెలుగు బాణీ ల లో రజినీకాంత రావు గారు ఇచ్చిన బాణీ నచ్చిందట . స్వర్గ సీమ కి నాగయ్య గారు సంగీత దర్శకుడు . అయినా ఈ పాటకి రజినీకాంత రావు గారి బాణీ నే ఖాయం చేశారట .
నిండా ముప్పై మాటలు లేని ఈ పాత రెండూ ఇంటూ ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉండటానికి ప్రధాన కారణం భానుమతి వాని రజనీ బాణీ అంటే సందేహం ఉండనవసరం లేదు. సినెమా పాట గనుక దానికి అంత ప్రాచుర్యం వచ్చింది అనుకోవడానికి వీలు లేదు . ఆయన పాటలన్నీ అంతే . ఒక్కసారి వంట చాలు అవి మనలని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి , రాత్రంతా ఆ రజనీ గంధ పరిమళిస్తూనే ఉంటుంది

పూల తీవె పూల పొదరిళ్ళ మాటుగా పొంచి
చూచు శిఖిపింఛ మ దే
అనే చరణాలను
” రాధామాధవ ప్రేమారామము
బృందావనము
రాసక్రీడా మనోజ్ఞాధామము
బృందావనము
లాంటి పాటలు ఎప్పటికీ నిత్యా నూతనాలై విన్న ప్రతిసారీ హృదయాన్ని సన్నగా కొస్తాయి. సముద్రం డాగారా వున్న ఆకర్షణ ఎదో రజనీ సంగీతం లో వుంది . సముద్రం కొంచెం కొంచెం మనలని లోలోపలికి లాగేసినట్టుగా రజనీ సంగీతమూ మనలని తన లోపలికి లాగేసుకుంటుంది , మన మనో మాలిన్యాలను అది శుభ్ర పరుస్తుంది. ఇది మానవ మాత్రుల సంగతి .

మరి ప్రాకృతిక సంగతో విజయవాడ లో ఒక రోజు రాత్రి తొమ్మిదిగంటల సమయం లో ఒక వాద్యగోష్ఠి కి రిహార్సల్ చేస్తూ వాల్మీకి కవితకు కారణమైన క్రౌంచ పక్షుల ప్రణయ కలాపాలు ధ్వనులను సంగీత పరికరం పైన ఆయన పలికించారట . ఆ సమయం లో పక్కనే ఉన్న మామిడి చెట్టు గుబురు లో విశ్రమిస్తున్న పక్షుల గుంపు చట్టాలున్నా లేచి కిలకిలా రావాలు చేశాయట. ఈ విషయాన్ని చెపుతూ రజినీకాంత రావు గారు ” గాయక విద్వాంసులు ఆనందం తో ఒడలు పులరించగా అభినందనలతో ముంచెత్తారు . నేను ఆ నాద బ్రహ్మ కి చేతులు జోడించి నమస్సుమాంజలి ఘటించాను ”
అన్నారు
రజనీ సంగీతం వినడం ఒక అనుభవం . ” తీయ తేనియ బరువు , మోయలేదీ బతుకు ” అని కృష్ణశాస్త్రి వేరొక చోట అన్నట్లుగా రజనీ స్వర మాధుర్యాన్ని మనం మామూలుగా మోయలేము . సంగీత మనోధర్మం ఎక్కడో ఒక చోట రవ్వంతయినా నిండి ఉండాలి. వేయి గండు తుమ్మెదల ఝుంకారం రజనీ స్వరాన్ని వెలిగిస్తుంది . నీలి నీలి సముద్రం మీద వెన్నెల లాగా ఫేనం పరచుకున్నాప్పుడు , పసిపిల్లలు సముద్ర తీరం లో ఇసుకగూళ్ళను కట్టుకుని పరవశించినట్టు రజనీ. సంగీతం మన మనసులోకి ఆనందానుభూతులకు తలుపు తెరుస్తుంది

” ఓ విహావారీ
నీహార హీర నీలాంబరి ధారిణీ
మనోహారిణీ
ఓ విభావరీ ”
అని రజనీ అంటూవుంటే ఒక అద్భుతమైన దృశ్యం మన మనోయవనిక పైన ప్రత్యక్షమవుతుంది

” ఆకాశమందున రాకాచంద్రుడు
నా కౌగిలి లో నీ సౌందర్యం కాంచలేక
సిగ్గుతో తలవంచగ
హాయిగా పాడుదమా ”
అంటే ఆ భావనకు , భావంలోని సౌకుమార్యానికి మనం మూర్చిల్లుతాము . ఆకాశం లోని చందమామ తన ప్రేయసి సౌందర్యం చూసి సిగ్గుతో తలవంచుకున్నదనే వూహ కి జోహార్లు చెప్పాలని అనిపిస్తుంది
హృదయం లో ఎంత వెన్నెల లేక పోతే ఇంత సున్నితమైన ఊహలు జనిస్తాయి ? హృదయం లో ఎంత ప్రేమ లేక పోతే ఇంత లేత లలిత మధుర పదబంధాలు సాహిత్యం లోకి అప్రయత్నంగా చొచ్చుకుని వస్తాయి ?
రజనీ లలితలలిత రాకేందుడు. దేవులపల్లి కృష్ణశాత్రి గారిదీ , రజనీ కాంత రావుగారిదీ మామా అల్లుళ్ళ అనుబంధం . రాజనీకాంత రావు గారు కృష్ణశాస్త్రి గారిని మామయ్యా అంటే ,కృష్ణ శాస్త్రి అల్లుడూ . మేనల్లుడూ అంటూ పిలిచేవారట . కృష్ణ రజని వాళ్ళిద్దారూ ఆకాశవాణి లో ఒక సంగీత సునామీని సృష్టించారు . రజనీ సంగీతం లో ప్రాసారమైన దేవులపల్లి తొలి సంగీత నాటకం శర్మిష్ట . క్షీరసాగర మధనం , విప్రనారాయణ , మాళవిక అనే యక్షగానాలు ఆరంభ ప్రదర్శనలో చరణం చిట్టచివర “శ్రీకృష్ణ దాన చకోర పూర్ణిమా ! రాజనీకాంతో దయా దయారాశి హెచ్చరిక ” అని జంట కవుల్లా వాళ్ళ పేర్లు వచ్చేలా రాసుకున్నారు.

పాడటానికి స్వరజ్ఞానమూ , రాగా జ్ఞానమూ ఉంటే చాలు . కానీ దాన్ని చిరంజీవి ని చేయాలంటే మాత్రం మనసులో లోలోపల ఒక అమృతాంశ ఉండాలి . స్వరం లో అభినయం ఉండాలి . శ్రోత కాళ్ళ ముందు దృశ్యాభిషేకం జరగాలి . కృష్ణమ్మ గలగలలు అని గాయకుడు పడితే శ్రోత కాళ్ళ ముందు కృష్ణమ్మా గలగలా ప్రవహిస్తున్న సుందర దృశ్యం ఆవిష్కృతం కావాలి . ఆ ప్రవాహ సౌందర్యం హృదయం లోపల సుడులు తిరుగుతూ నిలువెల్లా వేధించాలి ”

ఈ ;లక్షణమేదో రజనీ సంగీతం లో వుంది . అది చిరంజీవి
స రి గ మ ప ద ని స ల లో ఒక స్వరం నింగి కెగసింది

అశ్రు నయనాలతో!

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked