అసాధ్యుడు (పి వి మొగ్గలు)
– డా. భీంపల్లి శ్రీకాంత్
జూన్ 28వ తేది మాజీ ప్రధాని కీ.శే. పాములపర్తి వెంకట నరసిం హారావు శతజయంతి. కేంద్ర ప్రభుత్వం బిరుదు ఇవ్వక పోయినా పివి ని భారతజాతి రత్నంగా పరిగణించవచ్చు. దేశ ఆర్థిక సంస్కర్త, భారతదేశ నూతన శకానికి కర్త అయిన పి.వి. నరసిం హారావును మనదేశపు ఠీవీగా చెప్పుకోవచ్చు.
రాజకీయవేత్తగా, విద్యార్థి నాయకుడిగా, సాహితీమూర్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా, ఇంకా తనను వరించిన ఇతరపదవులకే వన్నె తెచ్చి, తను పనిచేసిన అన్న్ని రంగాల్లో ఆదర్శప్రాయుడుగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశీలిని 360 డిగ్రీలలో ప్రస్తుతించారు కవి శ్రీకాంత్ గారు. మూడు పాదాల కవితల్లో, సరళమైన భాషలో, చదవగానే సులభంగా అర్థమయ్యే పదానుక్రమణతో రచించారు కాబట్టి ‘పి వి మొగ్గలు ‘ అని కవితా సంపుటి పేరు పెట్టారనుకోవచ్చు.
పాలమూరు సాహితి, మహబూబ్ నగర్ ప్రచురించిన 40 పేజీల ఈ పుస్తకం కావాలనుకొన్నవారు రచయితకు ఈ-మెయిల్ పంపవచ్చు. srikanth.bheempally@gmail.com