కథా భారతి

తనకు మాలిన ధర్మము

బి వి లత

‘శశీ, ఎక్కడకు వెళుతున్నావు?’

‘ఇప్పుడే వస్తా’

‘నా మాట వినరా! బయట పరిస్ధితి బాగా లేదు, నువ్వు చెపితే వినవేం? ఊరంతా కరోనా అని భయపడుతోంది. జాగ్రత్తగా ఉండాలిరా’

‘అందుకే వెళుతున్నానమ్మా! ఎవరికో ఎమర్జన్సీట!’

‘కనీసం ఆ పి పి యీ కిట్టు ఏదో ఉంటుందిగా, అదేదో వేసుకోని, మాస్కన్నా సరిగ్గా పెట్టుకో’

‘నాకు తెలుసులేమ్మా, నస పెట్టకు’ అంటూ హడావుడిగా వెళ్ళే కొడుకు కేసి బెంగగా చూస్తూ,

‘చూడండి, వాడు నా మాట వినకుండా, ఎలా వెళుతున్నాడో?’ అంటూ భర్తకు ఫిర్యాదు చేసింది సుగుణ.

‘ఇది మీ ఇద్దరకీ మాముూలేగా? కాస్త కాఫీ ఇవ్వు’ అంటూ శరత్ గారు టివి న్యూస్ చూడటంలో మునిగి పోయారు.

***

‘శశి రాలేదా?’

‘లేదు, రాత్రి 10 అయ్యింది, రోడ్డుమీద పురుగు లేదు, వీడు ఎక్కడ ఉన్నాడో? ఫోన్ కూడా ఎత్తడు.

అదిగో, వచ్చినట్లున్నాడు, శశీ, నీళ్ళు బయట పెట్టా, అక్కడే బట్టలు వదిలి, రెండు చెంబులు పోసుకోని రా’

విసుక్కుంటూనే కాళ్ళు చేతులు కడిగాననిపించి తన గదులోకెళ్ళి పోయాడు శశి. భోజనం కలిపి తీసుకు వెళ్ళి, ‘ఇదితిని పడుకో’ అంది సుగుణ.

‘వద్దమ్మా, బయట తిని వచ్చాను’ అన్న కొడుకుని ఏమనలేక తలుపులేసుకుని పడుకోడానికి ఉపక్రమించింది, కానీ, ఎందుకో తెలియదు, కళ్ళవెంట నీరు ధారలు కడుతున్నాయి.

‘ఏమైంది, సుగుణా?’

‘బయట రోజులు బాగాలేవు, ఎటు చూసినా చావు కబుర్లు, వీడు చెబితే వినడు, వాడికేమైనా అయితే మనమేంకావాలి?’

‘రేపు నేను వాడికి అర్ధమయ్యేటట్లు చెబుతాలే, నువ్వు పడుకో.’

***

తెల్లవారింది

‘ఏడి, వాడు’

‘తెలియదు, నేను లేచే సరికే వెళ్ళిపోయడు’

ఆరోజు రాత్రికి శశి రాలేదనే ఆందోళనతోనే పడుకున్నారు. మర్నాడుదయమే

భర్తకు కాఫీ ఇచ్చి, ‘ నేనలా ఆ రమణ ఇంటిదకా వెళ్ళి అడిగి వస్తాను.’

‘ఫోన్ చెయ్యచ్చు కదా?’

‘అదుంటే రాత్రే చేసేదాన్నిగా? ఇప్పుడే వస్తాను’ అంటూ మాస్కు పెట్టుకోని వళ్ళంత చీర చుట్ట పెట్టుకొని బయలుదేరిందిసుగుణ.

ఎక్కడా మనుష్య సంచారం లేదు.

రెండు వీధుల అవతల ఉన్న ఇంటికి వెళ్ళి, ‘రమణా, రమణా’ అంటూ తలుపు తట్టింది.

తలుపు తెరచిన వ్యక్తితో ‘ నేను శశి వాళ్ళమ్మని బాబు, శశి ఇంటికి రాలేదు, నీకేమైనా తెలుసేమోనని’

‘లేదాంటీ, నేను బయటకు వెళ్ళట్లేదు. పక్క వీధీ సుబ్బా కేమైనా తెలుసేమో?’

‘నీ దగ్గర నెంబరేమైనా ఉందా? ‘

‘లేదాంటీ, నాకు శశి ద్వారానే పరిచయం, కుడివైపు నాలుగో ఇల్లు’

‘ధాంక్సు బాబు’ అంటూ బయలు దేరింది.

సుబ్బు కూడా ఇల్లు వదిలి కదలట్లేదన్నాడు. తెలిసిన ఇద్దరు ముగ్గురు స్నేహితులకి ఫోన్ చేసి అడిగాడు. కానీ ఎవరికీశశి గురించి తెలియదు।

చేసేది లేక ఇంటికి బయలుదేరింది.

ఇంటికి వస్తూనే ఏడుస్తూ కూర్చుంది. శరత్ గారు ఆమె పక్కనే కూర్చోని ఓదార్చ బోయారు, ఆమె ఒళ్ళు కాలిపోతోంది. సుగుణా, నీకు జ్వరంగా ఉంది, కాసేపు పడుకో, రా ‘ అంటూ ఆమెని మంచమీద పడుకోపెట్టి, క్రోసిన్ టాబ్లట్ ఒకటి వేసిపడుకో పెట్టారు.

పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కొడుకు వివరాలు చెప్పి, వాట్సప్ లో ఫొటో పంపారు.

తను వండిన అన్నం కాస్త పెరుగు కలిపి సుగుణకు రెండు ముద్దలు బలవంతాన పెట్టి, తను కొంచెం తినిపడుకున్నారు. మెలకువ వచ్చేటప్పటికి ఇల్లంతా చీకటిగా ఉంది, లేవటానికి చేతనవటం లేదు. బలవంతాన లేచిలైటువేసి, వళ్ళు తెలియకుండా పడున్న సుగుణను చూశాక ఆయనకు అర్ధం అయ్యింది, తమ ఇద్దరికీ కరోనా వచ్చిందని, ఫోను వెతికి ప్రక్కంటి వామనరావుకు సంగతి చెప్పి సాయం అడిగారు. తెరలు తెరలుగా దగ్గు మొదలయింది, నెమ్మదిగావెళ్ళి వీధి తలుపు తెరిచి కుర్చీలో కూలపడిపోయారు.

108 వాహనం వచ్చి వాళ్ళిద్దరిని తీసుకుపోయింది, పక్కింటి వామనరావు బయట్నించీ తాళం వేసుకుని వెళ్ళిపోయాడు.

***

నాలుగవ రోజు సుగుణకు మెలకువ వచ్చింది. తను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నానని తెలుస్తోంది.

ఒక నర్సును పిలచి, ‘మావాళ్ళకు చెప్పి, నాకు కొన్ని వస్తువులు తెప్పించగలరా?’

‘ఈ నాలుగు రోజులలో మీ వాళ్ళు ఎవరూ రాలేదు, మీ గురించి కనుక్కోవటానికి’

‘మా వారు, పేరు శరత్, మా అబ్బాయి, పేరు శశి, తప్పక వచ్చి ఉండాలి, కొంచం కనుక్కుంటారా?’

‘సరే, నేను రిసప్షన్ లో అనౌన్సు చేయమంటాను’.’

మర్నాటి దాకా ఆ నర్సు కనపడ లేదు. తను కూడా మగతగా ఉండి పోయింది.

మర్నాడు ఆ నర్సు వచ్చి’ నేను కనుక్కున్నానండీ, మీ కోసం ఎవరూ రాలేదు.’

‘నేను రెండు నంబర్లిస్తాను, కొంచెం కాల్ చేస్తారా?’

‘సరే, చెప్పండి’ అని తన సెల్ తో కాల్ చేసింది, ఒకటి తరువాత ఒకటి ట్రై చేసి చూసి, ‘లేదండి, ఎవరూ ఎత్తట్లేదు.’

సుగుణకు విచారం మొదలైంది.

***

మర్నాడు హాస్పిటల్ వాళ్ళు సుగుణకు చెప్పారు, ఆమెను ఇంటికి పంపటానకి, మూడు లక్షలు కట్టాలని. డాక్టర్లనుకలిసి తనని ఇంటికి తీసుకుని వెళితే, తను చెక్కు ఇవ్వగలుగుతానని చెప్పి ఒప్పించి, ఇంటికి చేరింది, వామనరావుతాళం తెచ్చి ఇచ్చాడు.

తాళంతీసుకొని లోనికి వెళ్ళి, చెక్కు రాసి వాళ్ళకు ఇచ్చి పంపింది. వామనరావుకు ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకుంది. తను వచ్చినట్లే భర్త కూడా ఏదో ఒక రోజు వస్తాడని సర్దుకుంది, కానీ, శశి మీదే బెంగగా ఉంది. రమణకి ఫోన్ చేసి శశిగురించి ఏమైనా తెలిసిందేమోనని అడిగింది.

***

రెండు రోజుల తరువాత కాలింగ్ బెల్ చప్పుడుకి తలుపు తెరిచింది సుగుణ

బయట ఒకతను ‘నమస్తే ఆంటీ, రమణ చెప్పాడు, మీకేదో ప్రాబ్లం అని, నా పేరు వాసు’.

‘లోపలికి రా బాబు’

‘వద్దాంటీ, మీకు క్వారంటైన్ పిరియడ్ కదా’

‘సుగుణ గడపలో కూర్చుని, జరిగినదంతా అతనికి చెప్పింది’

అంతా విని, ‘మీ వాళ్ళ ఫొటోలు నాకు వాట్సప్ చెయ్యండాంటీ, నేను కనుక్కుంటాను, మీరేం దిగులు పడకండి, మీకేమైనా వస్తువులు కావాల్సి వస్తే నన్నడగండి, తెచ్చిపెడతాను, నాకు పాస్ ఉంది’.

‘మీకు కావాల్సిన వస్తువుల లిస్టు నాకు పంపండి, నాకు మీరు గూగుల్ పే చేయవచ్చు, మనీ’

‘ధాంక్సు బాబు’

***

రెండు రోజల తరువాత వాసు వచ్చాడు.

‘ఎలా ఉన్నారంటీ? భోంచేసారా’

‘ఇప్పుడే అయింది, ఏమైనా తెలిసిందా?’ ఆశగా అడిగింది.

‘కూర్చోండాంటీ , ఆంటీ, అంకుల్ గురించి తెలిసింది, ఆసుపత్రిలో చేరిన మూడవ రోజు లంగ్సు పని చేయక హార్ట్ యటాక్తో అంకుల్ పోయారుట, ఎవరూ రాకపోయే సరికి వాళ్ళే ఖననం చేశారుట, ఇదిగోండి ఫొటో, వాళ్ళ రికార్డులనుంచిఇచ్చారు.’

వాట్సప్ లో వచ్చిన ఫొటో చూడగానే, దుఃఖం కట్టలు తెంచుకుంది. ధారగా కన్నీళ్ళు కార సాగాయి.

వాసు కూడా మౌనంగా కూర్చొని ఆమెని ఏడవనిచ్చాడు.

కాసేపటికి సర్దుకున్న సుగుణ శశి గురించి అడిగింది.

అంకుల్ పోలీస్ కంప్లయిట్ ఇచ్చారుట ఆంటీ, వాళ్ళూ వెతుకుతున్నారు. నేను శశి ఫొటో టివీలో పని చేసే నాఫ్రండుకిచ్చాను, ఒక రెండు రోజులలో తెలిసి పోతుంది. మీరు ధైర్యంగా ఉండండాంటీ, శశికి మీ అవసరం ఎంతైనాఉంటుంది. ఎవరైనా ఉన్నారా? ఆంటీ, మీకు తోడుగా ఉండటానికి.’

‘అందరూ వేరే ఊళ్ళలో ఉంటారు వాసూ! ఇప్పుడు ఎవరూ రాలేరు. నా పరిస్ధితి అయోమయంగా ఉంది,

ఇంకా నాలుగు రోజుల క్వారంటైన్ కూడా ఉంది కదా?’

‘అవునాంటీ, జాగ్రత్తగా ఉండండి, నేను

వెళ్ళొస్తాను’

రాత్రికి వాళ్ళ అమ్మ చేత ఫోన్ చేయించాడు, వాసు, తనకు ధైర్యం చెప్పటానికి. ఆమె శశి తప్పక వస్తాడని, అతనికోసమైనా తను ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పింది.

శశి కూడా వాసులాగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ కరోనా రాక్షసి తన భర్తనిలా తీసుకుని పోయేది కాదు కదాఅని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది.

***

రెండు రోజుల తరువాత వాసు ఫోన్ చేశాడు.

‘గుడ్ న్యూస్ ఆంటీ, మీ శశి కనిపించాడాంటీ, ఊరికి దూరంగా ఉన్న ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నేను షిఫ్టు చేశాను వేరే మంచి హాస్పిటల్కి. కరోనా నెగటివ్ వచ్చింది కానీ లంగ్సు ఇంకా కోలుకోవాలన్నారు. నాలుగైదురోజులలో ఇంటికి వచ్చేస్తాడు, మీ ఐసలేషన్ కూడా అయిపోతోందిగా, నాకుతెలిసిన ఒక క్లీనింగు వాళ్ళకు చెబుతాను, ఇల్లంతా శానిటైజ్ చేయించండి, హాస్పటల్లో కట్టడానికి డబ్బు కూడా అరేంజ్ చేసుకోవాలాంటీ’

‘అలాగే, నేను చెక్ ఇస్తాను, నువ్వు అది ఇచ్చేయి, క్లీనింగ్ వాళ్ళని రేపో, ఎల్లుండో రమ్మను, నేను ఈ లోగా అన్నీసర్దుకుంటాను. ‘

‘అలాగే ఆంటీ’

***

ఈ రోజు శశి ఇంటికి వస్తాడు, సుగుణ భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. శరత్ లేరన్న బాధ ఒక వైపు శశివస్తున్నాడన్న ఆనందం ఇంకొక వైపు, ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

టాక్సీ ఇంటి ముందాగింది. అందులోంచి వాసు దిగి, శశిని దించాడు, శశి బలహీనంగా ఉన్నాడు.

శశి తల్లిని చూస్తూనే ఆమెను కౌగలించుకొని ఏడవటం మొదలు పెట్టాడు.

‘నన్ను క్షమించమ్మా, తప్పంతా నాదే, నేనే నాన్నగారి చావుకు కారణం, నీ మాట విని ఉంటే ఇలా అయ్యేది కాదు, నీగురించి, నాన్న గురించి నేను శ్రద్ద తీసుకోలేదు, పొరపాటు చేశనమ్మా’ అంటూ చిన్న పిల్లవాడిలా భోరుమని ఏడ్చేశాడు.

‘ఊరకో, శశి, మనం విధిని తప్పించలేము, ఇది మన ఒక్కళ్ళకే వచ్చిన కష్టం కాదు, మనం గుండెని రాయి చేసుకునిముందుకు వెళ్ళాలి. ధైర్యం తెచ్చుకో’ అంటూ ఓదార్చి, ఇంట్లోకి తీసుకుని వెళ్లారు.

శశి మెడికల్ రిపోర్టులు, మందులూ సుగుణకు అప్పచెప్పి, ‘నేను వెళ్ళివస్తా, ఆంటీ’ అంటూ వాసు బయలు దేరాడు.

‘ వాసు, నీ వల్లేఇదంతా సాధ్యమైంది, లేకపోతే నేనేంచేయలో తెలియక చాలా బాధ పడేదానిని. నీ రుణం ఎలాతీర్చుకుటామో? బాబు’

‘పర్లేదాంటీ, ఇప్పుడన్నీ సర్దుకున్నాయిగా, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి’

‘అలాగే, తప్పకుండా, కానీ ఒక రోజు నువ్వు మీ అమ్మగారినీ వాళ్ళందరినీ తీసుకుని భోజనానికి రావాలి’

‘అవును బ్రదర్’ శశి వంత పాడాడు

‘అలాగే, ఉంటాను’ అంటూ వాసు వెళ్ళిపోయాడు

***

‘శశీ, ఎవరు కాల్ చేసింది’

‘ ఫ్రండమ్మా,’

‘ మరి ఎత్తలేదేం?’

‘ఏంలేదమ్మా, ఎవరికో ఫుడ్ సప్లై చేయాలట, కానీ ఇక నిన్ను కష్టపెట్టదల్చుకోలేదమ్మా’

‘శశీ, నన్ను అప్పుడూ, ఇప్పుడూ కూడా

తప్పుగానే అనుకుంటున్నావు, ఎవరు నిన్ను ఇతరులకి సాయం చేయవద్దన్నది? నీ గురించి, మా గురించీ ఆలోచించి, కావలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని నువ్వు సాయం చేస్తే నేనెందుకు నిన్ను ఆపుతాను? ఎవరయినా ముందు తమసంగతి

చూసుకుని, తరువాత పరులకు సాయం చేయాలి, ‘ తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం’ అంటారు కదా? నువ్వు చేసే పనులకి, మీ నాన్న ఎంత గర్వపడేవారో నీకేం తెలుసూ? వాడు చేసే మంచే వాడిని కాపాడుతుంది లేవే, అంటుండేవారు. నువ్వు తయరైరా, నేనే ఫుడ్ రడీ చేసి ఉంచుతాను.’

‘నిజంగా, నువ్వు చేస్తావా? ఉండు నేనిప్పుడే వస్తా’

క్యారియర్ సర్ది , యోధుడులా తయరైవచ్చిన శశిని చూసి నవ్వుతూ క్యారియర్ అందించింది.

‘వాళ్ళకు అవసరమైనన్ని రోజులూ మనం ఇస్తామని చెప్పి, మన నెంబర్లు ఇచ్చిరా, నాన్నా’

*** ***. ****

Sent from my iPhone

On 27-Jun-2021, at 11:30 AM, MJ Thatipamala <mjthatipamala@siliconandhra.org> wrote:

మీ కథ బాగుంది.
అక్కడక్కడా అచ్చుతప్పులున్నాయి. సరిచేసి పంపండి.
జూలై వీలుకాకపోతే ఆగస్ట్ లో ప్రచురిస్తాము.

Thanks!

On Thu, Jun 17, 2021 at 10:04 AM <vidyullata.b@gmail.com> wrote:
తనకు మాలిన ధర్మము

—-బి వి లత

‘శశీ, ఎక్కడకు వెళుతున్నావు?’

‘ఇప్పుడే వస్తా’

‘నా మాట వినరా! బయట పరిస్ధితి బాగా లేదు, నువ్వు చెపితే వినవేం? ఊరంతా కరోనా అని భయపడుతోంది. జాగ్రత్తగా ఉండాలిరా’

‘అందుకే వెళుతున్నానమ్మా! ఎవరికో ఎమర్జన్సీట!’

‘కనీసం ఆ పి పి యీ కిట్టు ఏదో ఉంటుందిగా, అందేదో వేసుకోని, మాస్కన్నా పెట్టుకో’

‘నాకు తెలుసులే, నస పెట్టకు’ అంటూ హడావుడిగా వెళ్ళే కొడుకు కేసి బెంగగా చూస్తూ

‘చూడండి, వాడు నా మాట వినకుండా, ఎలా వెళుతున్నాడో?’ అంటూ భర్తకు ఫిర్యాదు చేసింది సుగుణ.

‘ఇది మీ ఇద్దరకీ మాముూలేగా? కాస్త కాఫీ ఇవ్వు’ అంటూ శరత్ గారు టివి న్యూస్ చూడటంలో మునిగి పోయారు.

***

‘శశి రాలేదా?’

‘లేదు, రాత్రి 10 అయ్యింది, రోడ్డుమీద పురుగు లేదు, వీడు ఎక్కడ ఉన్నాడో? ఫోన్ కూడా ఎత్తడు.

అదిగో, వచ్చినట్లున్నాడు, శశీ, నీళ్ళు బయట పెట్టా, అక్కడే బట్టలు వదిలి, రెండు చెంబులు పోసుకోని రా’

విసుక్కుంటూనే కాళ్ళు చేతులు కడిగాననిపించి తన గదులోకెళ్ళి పోయాడు శశి. భోజనం కలిపి తీసుకు వెళ్ళి, ‘ఇదితిని పడుకో’ అంది సుగుణ.

‘వద్దమ్మా, బయట తిని వచ్చాను’ అన్న కొడుకుని ఏమనలేక తలుపులేసుకుని పడుకోడానికి ఉపక్రమించింది, కానీ, ఎందుకో తెలియదు, కళ్ళవెంట నీరు ధారలు కడుతున్నాయి.

‘ఏమైంది, సుగుణా?’

‘బయట రోజులు బాగాలేవు, ఎటు చూసినా చావు కబుర్లు, వీడు చెబితే వినడు, వాడికేమైనా అయితే మనమేంకావాలి?’

‘రేపు నేను వాడికి అర్ధమయ్యేటట్లు చెబుతాలే, నువ్వు పడుకో.’

***

తెల్లవారింది

‘ఏడి, వాడు’

‘తెలియదు, నేను లేచే సరికే వెళ్ళిపోయడు’

ఆరోజు రాత్రికి శశి రాలేదనే ఆందోళనతోనే పడుకున్నారు. మర్నాడుదయమే

భర్తకు కాఫీ ఇచ్చి, ‘ నేనలా ఆ రమణ ఇంటిదకా వెళ్ళి అడిగి వస్తాను.’

‘ఫోన్ చెయ్యచ్చు కదా?’

‘అదుంటే రాత్రే చేసేదాన్నిగా? ఇప్పుడే వస్తాను’ అంటూ మాస్కు పెట్టుకోని వళ్ళంత చీర చుట్ట పెట్టుకొనిబయలుదేరింది.

ఎక్కడా మనుష్య సంచారం లేదు.

రెండు వీధుల అవతల ఉన్న ఇంటికి వెళ్ళి, ‘రమణా, రమణా’ అంటూ తలుపు తట్టింది.

తలుపు తెరచిన వ్యక్తితో ‘ నేను శశి వాళ్ళమ్మని బాబు, శశి ఇంటికి రాలేదు, నీకేమైనా తెలుసేమోనని’

‘లేదంటీ, నేను బయటకు వెళ్ళట్లేదు. పక్క వీధీ సుబ్బా కేమైనా తెలుసేమో?’

‘నీ దగ్గర నెంబరేమైనా ఉందా? ‘

‘లేదాంటీ, నాకు శశి ద్వారానే పరిచయం, కుడివైపు నాలుగో ఇల్లు’

‘ధాంక్సు బాబు’ అంటూ బయలు దేరింది.

సుబ్బు కూడా ఇల్లు వదిలి కదలట్లేదన్నాడు. తెలిసిన ఇద్దరు ముగ్గురు స్నేహితులకి ఫోన్ చేసి అడిగాడు. కానీ ఎవరికీశశి గురించి తెలియదు।

చేసేది లేక ఇంటికి బయలుదేరింది.

ఇంటికి వస్తూనే ఏడుస్తూ కూర్చుంది. శరత్ గారు ఆమె పక్కనే కూర్చోని ఓదార్చ బోయారు, ఆమె ఒళ్ళు కాలిపోతోంది. సుగుణా, నీకు జ్వరంగా ఉంది, కాసేపు పడుకో, రా ‘ అంటూ ఆమెని మంచమీద పడుకోపెట్టి, క్రోసిన్ టాబ్లట్ ఒకటి వేసిపడుకో పెట్టారు.

పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కొడుకు వివరాలు చెప్పి, వాట్సప్ లో ఫొటో పంపారు.

తను వండిన అన్నం కాస్త పెరుగు కలిపి సుగుణకు రెండు ముద్దలు బలవంతాన పెట్టి, తను కొంచెం తినిపడుకున్నారు. మెలకువ వచ్చేటప్పటికి ఇల్లంతా చీకటిగా ఉంది, లేవటానికి చేతనవటం లేదు. బలవంతాన లేచిలైటువేసి, వళ్ళు తెలియకుండా పడున్న సుగుణను చూశాక ఆయనకు అర్ధం అయ్యింది, తమ ఇద్దరికీ కరోనా వచ్చిందని, ఫోను వెతికి ప్రక్కంటి వామనరావుకు సంగతి చెప్పి సాయం అడిగారు. తెరలు తెరలుగా దగ్గు మొదలయింది, నెమ్మదిగావెళ్ళి వీధి తలుపు తెరిచి కుర్చీలో కూలపడిపోయారు.

108 వాహనం వచ్చి వాళ్ళిద్దరిని తీసుకుపోయింది, వామనరావు బయట్నించీ తాళం వేసుకుని వెళ్ళిపోయాడు.

***

నాలుగవ రోజు సుగుణకు మెలకువ వచ్చంది. తను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నానని తెలుస్తోంది.

ఒక నర్సును పిలచి, ‘మావాళ్ళకు చెప్పి, నాకు కొన్ని వస్తువులు తెప్పించగలరా?’

‘ఈ నాలుగు రోజులలో మీ వాళ్ళు ఎవరూ రాలేదు, మీ గురించి కనుక్కోవటానికి’

‘మా వారు, పేరు శరత్, మా అబ్బాయి, పేరు శశి, తప్పక వచ్చి ఉండాలి, కొంచం కనుక్కుంటారా?’

‘సరే, నేను రిసప్షన్ లో అనౌన్సు చేయమంటాను’.’

మర్నాటి దాకా ఆ నర్సు కనపడ లేదు. తను కూడా మగతగా ఉండి పోయింది.

మర్నాడు ఆ నర్సు వచ్చి’ నేను కనుక్కున్నానండీ, మీ కోసం ఎవరూ రాలేదు.’

‘నేను రెండు నంబర్లిస్తాను, కొంచెం కాల్ చేస్తారా?’

‘సరే, చెప్పండి’ అని తన సెల్ తో కాల్ చేసింది, ఒకటి తరువాత ఒకటి ట్రై చేసి చూసి, ‘లేదండి, ఎవరూ ఎత్తట్లేదు.’

సుగుణకు విచారం మొదలైంది.

***

మర్నాడు హాస్పిటల్ వాళ్ళు సుగుణకు చెప్పారు, ఆమెను ఇంటికి పంపటానకి, మూడు లక్షలు కట్టాలని చెప్పారు. డాక్టర్లను కలిసి తనని ఇంటికి తీసుకుని వెళితే, తను చెక్కు ఇవ్వగలుగుతానని చెప్పి ఒప్పించి, ఇంటికి చేరింది, వామనరావు తాళం తెచ్చి ఇచ్చాడు.

తాళంతీసుకొని లోనికి వెళ్ళి, చెక్కు రాసి వాళ్ళకు ఇచ్చి పంపింది. వామనరావుకు ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకుంది. తను వచ్చినట్లే భర్త కూడా ఏదో ఒక రోజు వస్తాడని సర్దుకుంది, కానీ, శశి మీదే బెంగగా ఉంది. రమణకి ఫోన్ చేసి శశిగురించి ఏమైనా తెలిసిందేమోనని అడిగింది.

***

రెండు రోజుల తరువాత కాలింగ్ బెల్ చప్పుడుకి తలుపు తెరిచింది సుగుణ

బయట ఒకతను ‘నమస్తే, ఆంటీ రమణ చెప్పాడు, మీకేదో ప్రాబ్లం అని, నా పేరు వాసు’.

‘లోపలికి రా బాబు’

‘వద్దాంటీ, మీకు క్వారంటైన్ పిరియడ్ కదా’

‘సుగుణ గడపలో కూర్చుని, జరిగినదంతా అతనికి చెప్పింది’

అంతా విని, ‘మీ వాళ్ళ ఫొటోలు నాకు వాట్సప్ చెయ్యండాంటీ, నేను కనుక్కుంటాను, మీరేం దిగులు పడకండి, మీకేమైనా వస్తువులు కావాల్సి వస్తే నన్నడగండి, తెచ్చిపెడతాను, నాకు పాస్ ఉంది’.

‘మీకు కావాల్సిన లిస్టు నాకు పంపండి, నాకు మీరు గూగుల్ పే చేయవచ్చు, మనీ’

‘ధాంక్సు బాబు’

***

రెండు రోజల తరువాత వాసు వచ్చాడు.

‘ఎలా ఉన్నారంటీ? భోంచేసారా’

‘ఇప్పుడే అయింది, ఏమైనా తెలిసిందా?’ ఆశగా అడిగింది.

‘కూర్చోండాంటీ , ఆంటీ, అంకుల్ గురించి తెలిసింది, ఆసుపత్రిలో చేరిన మూడవ రోజు లంగ్సు పని చేయక హార్ట్ యటాక్తో అంకుల్ పోయారుట, ఎవరూ రాకపోయే సరుకు వాళ్ళే ఖననం చేశారుట, ఇదిగోండి ఫొటో, వాళ్ళ రికార్డులనుంచిఇచ్చారు.’

వాట్సప్ లో వచ్చిన ఫొటో చూడగానే, దుఃఖం కట్టలు తెంచుకుంది. ధారగా కన్నీళ్ళు కార సాగాయి.

వాసు కూడా మౌనంగా కూర్చొని ఆమెని ఏడవనిచ్చాడు.

కాసేపటికి సర్దుకున్న సుగుణ శశి గురించి అడిగింది.

అంకుల్ పోలీస్ కంప్లయిట్ ఇచ్చారుట ఆంటీ, వాళ్ళూ వెతుకుతున్నారు. నేను శశి ఫొటో టివీలో పని చేసే నాఫ్రండుకిచ్చాను, ఒక రెండు రోజులలో తెలిసి పోతుంది. మీరు ధైర్యంగా ఉండండాటీ, శశికి మీ అవసరం ఎంతైనాఉంటుంది. ఎవరైనా ఉన్నారా? ఆంటీ, మీకు తోడుగా ఉండటానికి.’

‘అందరూ వేరే ఊళ్ళలో ఉంటారు వాసూ! ఇప్పుడు ఎవరూ రాలేరు.

ఇంకా నాలుగు రోజుల క్వరంటైన్ ఉంది కదా?’

‘అవునాంటీ, జాగ్రత్తగా ఉండండి, నేను

వెళ్ళొస్తాను’

రాత్రికి వాళ్ళ అమ్మ చేత ఫోన్ చేయించాడు, వాసు, తనకు ధైర్యం చెప్పటానికి.

.

***

రెండు రోజుల తరువాత వాసు ఫోన్ చేశాడు.

‘గుడ్ న్యూస్ ఆంటీ, మీ శశి కనిపించాడాంటీ, ఊరికి దూరంగా ఉన్న ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నేను షిఫ్టు చేశాను వేరే మంచి హాస్పిటల్కి. కరోనా నెగటివ్ వచ్చింది కానీ లంగ్సు ఇంకా కోలుకోవాలన్నారు. నాలుగైదురోజులలో ఇంటికి వచ్చేస్తాడు, మీ ఐసలేషన్ కూడా అయిపోతోందిగా, నాకుతెలిసిన ఒక క్లీనింగు వాళ్ళకు చెబుతాను, ఇల్లంతా శానిటైజ్ చేయించండి’

‘అలాగే, రేపో, ఎల్లుండో రమ్మను, నేను అన్నీ సర్దుకుంటాను. ‘

‘అలాగే ఆంటీ’

***

ఈ రోజు శశి ఇంటికి వస్తాడు, సుగుణ భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. శరత్ లేరన్న బాధ ఒక వైపు శశివస్తున్నాడన్న ఆనందం ఇంకొక వైపు, ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

టాక్సీ ఇంటి ముందాగింది. అందులోంచి వాసు దిగి, శశిని దించాడు, శశి బలహీనంగా ఉన్నాడు.

శశి తల్లిని చూస్తూనే ఆమెను కౌగలించుకొని ఏడవటం మొదలు పెట్టాడు.

‘నన్ను క్షమించమ్మా, తప్పంతా నాదే, నేనే నాన్నగారి చావుకు కారణం, నీ మాట విని ఉంటే ఇలా అయ్యేది కాదు’

‘ఊరకో, శశి, మనం విధిని తప్పించలేము, ఇది మన ఒక్కళ్ళకే వచ్చిన కష్టం కాదు, మనం గుండెని రాయి చేసుకునిముందుకు వెళ్ళాలి. ధైర్యం తెచ్చుకో’ అంటూ ఓదార్చి, ఇంట్లోకి తీసుకుని వెళ్లారు.

శశి మెడికల్ రిపోర్టులు, మందులూ సుగుణకు అప్పచెప్పి, ‘నేను వెళ్ళివస్తా, ఆంటీ’ అంటూ వాసు బయలు దేరాడు.

‘ వాసు, నీ వల్లేఇదంతా సాధ్యమైంది, లేకపోతే నేనేంచేయలో తెలియక చాలా బాధ పడేదానిని.’

‘పర్లేదాంటీ, ఇప్పుడన్నీ సర్దుతున్నాయిగా, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి’

‘అలాగే, కానీ ఒక రోజు నువ్వు మీ వాళ్ళందరినీ తీసుకుని భోజనానికి రావాలి’

‘అవును బ్రదర్’ శశి వంత పాడాడు

‘అలాగే, ఉంటాను’ అంటూ వాసు వెళ్ళిపోయాడు

***

‘శశీ, ఎవరు కాల్ చేసింది’

‘ ఫ్రండమ్మా,’

‘ మరి ఎత్తలేదేం?’

‘ఏంలేదమ్మా, ఎవరికో ఫుడ్ సప్లై చేయాలట, కానీ ఇక నిన్ను కష్టపెట్టదల్చుకోలేదమ్మా’

‘శశీ, నన్ను అప్పుడూ, ఇప్పుడూ కూడా

తప్పుగానే అనుకుంటున్నావు, ఎవరు నిన్ను ఇతరులకి సాయం చేయద్దన్నది? నీ గురించి, మా గురించీ ఆలోచించి, కావలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని నువ్వు సాయం చేస్తే నేనెందుకు నిన్ను ఆపుతాను. ఎవరయినా ముందు తమ సంగతి

చూసుకుని, తరువాత పరులకు సాయం చేయాలి, ‘ తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం’ అంటారు కదా? నువ్వు చేసే పనులకి, మీ నాన్న ఎంత గర్వపడేవారో నీకేం తెలుసూ? వాడు చేసే మంచే వాడిని కాపాడుతుంది లేవే, అంటుండేవారు’

‘నువ్వు తయరైరా, నేనే ఫుడ్ రడీ చేసి ఉంచుతాను.’

‘నిజంగా, నువ్వు చేస్తావా? ఉండు నేనిప్పుడే వస్తా’

క్యారియర్ సర్ది , యోధుడులా తయరైవచ్చిన శశిని చూసి నవ్వుతూ క్యారియర్ అందించింది.

వాళ్ళకు అవసరమైనన్ని రోజులూ మనం ఇస్తామని చెప్పి, మన నెంబర్లు ఇచ్చిరా, నాన్నా

*** ***. ****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked