నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ముందస్తుగా పద్యకవితాసక్తులందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాఠకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మాకు అందిన పద్యాలు:
భైరవభట్ల శివరామ్, కొక్కిరాపల్లి
ఆ: నూత్న వత్సరంబు నూలుకొనగరమ్ము
ఆశలన్నితీర్చ అవనిజనుల
యువతమేధనందు యోగ్యతలరుచుండ
భావిజీవితంబు బంగరవగ
ఆ: రైతుకూలిమనసు రమ్మమైవెలుగొంద
కొత్తపంటలన్ని కొలువుదీర
ప్రకృతిసహకరించి ఫలితమివ్వంగను
భావిజీవితంబు బంగరవగ
ఆ: మనుషులందుమార్పు మంచినికోరంగ
పక్కవారిహితము పసగుచుండ
సర్వజనులసుఖము సంపదైవరలంగ
భావిజీవితంబు బంగరవగ
ఆ: వత్సరంబుమమ్ము వర్దిల్ల జేయంగ
రమ్మురమ్మురమ్మురమ్యమవగ
అలరజేయిమ్ముఆప్తహృదయముతో
భావిజీవితంబుబంగరవగ
వారణాశి. సూర్యకుమారి, నార్త్ కరోలినా
తే .గీ
దైవ బలమున కార్య సాధనయు నొంది
శాంతి సౌఖ్యముల్ మిక్కిలి సంతసమును
ఆయురారోగ్య సంపద లలర మీకు
నవ్య వర్ష శుభా కాంక్ష లివియె గొనుమ
నేదునూరి . రాజేశ్వరి, న్యూజెర్సీ
చల్లని వెన్నెల విరియగ
మల్లెల సౌరులను పంచి మానస వీణై
యుల్లము జల్లని పించగ
కల్లలు లేనట్టి ప్రేమ కావగ రమ్మా
” [ నూతన వత్సరమా ” ]
పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫొర్నియా
కం.
వచ్చెనుగా పందొమ్మిది
తెచ్చునులే సుఖము శాంతి తీరుగ మీకున్
నచ్చిన వన్నియుఁ గూరును
లచ్చలుగా ధనము లొదవు రయముగ శ్యామా!
ఈ మాసం ప్రశ్న:
వే-లం-టై-ను అనే నాలుగు అక్షరములు వరుసగా ఒకొక్క పాదారంభలో యుండునట్లు మీకు నచ్చిన ఛందస్సులో ప్రేమపై పద్యము వ్రాయాలి
గతమాసం ప్రశ్న:
అంబా యని శునకమరిచె నందరు మెచ్చన్
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
నేదునూరి . రాజేశ్వరి, న్యూజెర్సీ
సంభవ మాయిది వేడుక
అంబా యని శునక మరిచె నందరు మెచ్చన్
శంభుని మెడలో వెలుచలు
శాంభవి పాదముల నంటి శరణని వేడెన్
సూర్యకుమారి వారణాశి, నార్త్ కరోలినా
అంబర మంటగ భక్తులు
సంబరముగ పరమశివుని శంభో యని యా
డంబరముగ బిల్వంగను
అంబా యని శునకమరచె నందరు మెచ్చన్
దువ్వూరి వి యన్ సుబ్బారావు, కొంతమూరు, రాజమహేంద్రవరం.
ముంబైలో లభియించెను
నంబూద్రికి పెంపు కుక్క ‘నన్నీ’, యేగన్
చెంబైకి పెళ్ళి కతడు త
నం బాయని శునక మరిచె నందరు మెచ్చన్.
పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫొర్నియా
బెంబేలెత్తిన ఆవనె
నంబా యని; శునక మరిచె నందరు మెచ్చన్
సంబరముగ భౌభౌ యని
అంబిక యను పాపచూచి హహయని నవ్వన్
కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్
పందని, కారణంబడుగ పంట దివాకరు నామధేయమే
సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా
పందిని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో శంకరి పిల్లలకై కొనె
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి
యుబికెన్పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్