పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
శివరాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్
గతమాసం ప్రశ్న:
వే-లం-టై-ను అనే నాలుగు అక్షరములు వరుసగా ఒకొక్క పాదారంభలో యుండునట్లు మీకు నచ్చిన ఛందస్సులో ప్రేమపై పద్యము వ్రాయాలి

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
నేదునూరి . రాజేశ్వరి, న్యూజెర్సీ
వేయి జన్మల కైనను వేచి వేచి
లంక బిందెలు దెఛ్చినే లక్ష ణముగ
టైము గమనించి నినుజేరి మోము గలిపి
నుంకు  జేసెద ననునమ్ము మంకు మాని
సూర్యకుమారి వారణాశి, నార్త్ కరోలినా
వేయి కనులు కాయ వేచి చూచుచు నుంటి
లంక నున్న సీత లాగ నేను
టైము దాటె వచ్చుట మరచిపోతివా
నువ్వు లేక నేను నుండ బోను
వెన్నెల సత్యం, షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
వేయి జన్మల కైనను వీడనట్టి
లంకె కుదిరాక నీకేల శంక; ముచ్చ
టైన జంటగా మనమొక్క టైన మేలు
నువ్వు సమ్మతించగ చిన్ని నవ్వు చాలు!!
గండికోట విశ్వనాధం, హైదరాబాదు
వేడుక చెలంగ వెన్నెల వేళ గుట్ట
లందు నీవెంట నుంటినో లలన! నేడు
టైము దాటక రమ్ము , దీటైన మాట
నుడివెదను కడు ప్రేమతో నున్నవాడ.
దువ్వూరి వి యన్ సుబ్బారావు, కొంతమూరు,  రాజమహేంద్రవరం.
కం.
వేంచేయుము నా స్వీట్ హార్ట్
లంచుని చేద్దాము హొటలు లాసన్స్ బేలో
టైం చాల దనకు డాళింగ్
నుంచొని ఉంటాను ప్రామిస్ నో చెప్పకుమా.                                   (1)
****
సీ.
వేవేల జన్మల విలువైన బంధము
…..ప్రేమకు చావన్న లేదు పడతి!
లంకలో సీతను లాలన చేసెను
…..రాముని ప్రేమయే రాణి! ఒక్క
టైనట్టి హృదయాల కరమరికలు లేవు
…..తనువులు మాత్రమే ద్వయము సుదతి!
నునులేత వలపులు మనసైన తలపులు
…..మధురాతి మధురమౌ సుధలు లలన!

తే.గీ.
వేగ మన ప్రేమ నిజ మగు, వేడ్క పెద్ద
లంద రాశీర్వ దింతురు హాయి గుప్పి
టై చెలీ! రమ్మిటు వలపు టందలమ్ము
ను నధిరోహింప నందుకొనుము కరమ్ము

కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్
పందని, కారణంబడుగ పంట దివాకరు నామధేయమే
సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా
పందిని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో శంకరి పిల్లలకై కొనె
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి యుబికెన్పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked