నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసం ప్రశ్న:
నాస్తికులకు దైవమన్న నయమున్ భయమున్
(శ్రీ దువ్వూరి వి.ఎన్. సుబ్బారావు గారు పంపిన సమస్య)
గతమాసం ప్రశ్న:
శివరాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
నేదునూరి . రాజేశ్వరి, న్యూజెర్సీ
దేవికి ప్రియమట పూజలు
నవరాత్రులు విభవ మొంద నవదుర్గ లుగా
శివునికి నీటను ముంచిన
శివరాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్
సూర్యకుమారి వారణాశి, నార్త్ కరోలినా
భవ సాగర మీదంగను
శివనామ స్మరణ జేయు చింతన జేయన్
అవరోథ మగుతరి మనకు
శివరాత్రి ననిదుర ;పోవ చింతలు దీరు న్
దువ్వూరి వి యన్ సుబ్బారావు, కొంతమూరు, రాజమహేంద్రవరం.
పవ లెల్లను శ్రమ పడితివి
యెవరా చరవాణి మాట లీ నిశి వేళన్
చివరకు చెడు నారోగ్యము
శివ! రాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్.
కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్
పందని, కారణంబడుగ పంట దివాకరు నామధేయమే
సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా
పందిని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో శంకరి పిల్లలకై కొనె
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి యుబికెన్పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్