పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
నిషిద్ధాక్షరి: క, చ, ట, త, ప లు లేకుండా వేసవి సెలవలను వర్ణిస్తూ ఛందోబద్ధముగా పద్యము వ్రాయవలెను
గతమాసం ప్రశ్న:
పందినిఁ కౌగిలించుకొని పంకజలోచన సంతసించెరో

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ

నందిని పూజజేసి శివ నామము త్రాణగ భక్తిమీ రగన్
సందియ మేమిలేక మది చల్లని భావము పొంగు చుండగా
వందనమో యటంచు తలవంచి మహామహితాత్ముడే యనన్
పందిని కౌగలించు కొని పంకజ లోచన సంత సించెరో

సూర్యకుమారి  వారణాసి, మచిలీపట్నం

కుందుచు  నున్న కూతురును  కూరిమి తోడను బుజ్జగించి యో
పందిని చూపి హాస్యముగ పద్యము పాడి వరాహ చిత్రమున్
ముందుగ  బెట్టినంత నిక  ముచ్చట లాడుచు తండ్రితోడ నా
పందిని కౌగిలించుకుని  పంకజలోచన  సంతసించెరో

డా. రామినేని రంగారావు, పామూరు, ప్రకాశం జిల్లా

కంది హిరణ్యనేత్రుడల కాస్యపి చాపగఁ జుట్టి వేగమే
ఒందిక చంకలోనిడుచు నోర్పున సంద్రమునందు దాగ, గో
విందుడు క్రోడరూపుడయి వేగముగా వధియించి కావగా
పందిని కౌగిలించుకుని పంకజలోచన సంతసించెరో!

శివప్రసాద్  చావలి, సిడ్నీ

కొందము బొమ్మలన్ తనయకున్ మురిపమ్ముగనంచు యంగడిన్
విందుగ కళ్ళకున్ తనకు వీలుగ జూపగ తల్లిదండ్రులున్
ముందుగ మెచ్చి చందముగ మెత్తని సీమల దూదిబొమ్మయౌ
పందిని కౌగిలించుకుని పంకజ లోచన సంతసించెరో

అన్నాపంతుల జగన్నాధ రావు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్

ఇందిర వల్లభుండు హరి యిద్ధర గావ వరాహ మూర్తియై
సందిట పైడి నేత్రు గొని చంపగ జూచిన రత్నగర్భ తా
పొందిన నోము పంటయని పొంగుచు మేనిని పుల్క లెత్తగా
పందిని కౌగలించుకొని పంకజ లోచన సంతసించెరో

పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా

కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్
పందని, కారణంబడుగ ‘పంట దివాకరు’ నామధేయమే
సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా
‘పంది’ని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో!

కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్
పందని, కారణంబడుగ పంట దివాకరు నామధేయమే
సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా
పందిని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో శంకరి పిల్లలకై కొనె
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి యుబికెన్పుల్లెల

శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా

నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked