పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ: పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
రెండును రెండును గలుపగ రెండే యగురా!

గతమాసం ప్రశ్న:
నిషిద్ధాక్షరి: క, చ, ట, త, ప లు లేకుండా వేసవి సెలవలను వర్ణిస్తూ ఛందోబద్ధముగా పద్యము వ్రాయవలెను

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ

వేసవి సెలవల యందము
రాసులు పోసిన సొగసులు రంజిల్లు మదిన్
హాసము వెన్నెల వెలుగులు
మోసము లేదట  విందు మోహము లన్నన్

సూర్యకుమారి  వారణాసి, మచిలీపట్నం

సీ                అవిరామముగ నుండు   ఆలుమగలు బిడ్డ
లుమురియును  సెలవులూహ  మెరియ
ఉదయాద్రి  సూర్యుని   ఉదయమ్ము  మొదలుగ
మెండునిర్ణయములు  మెదలు  మదిని
ఎండవేడిమి లేని  ఏవూర నైనను
వారమున్నను మేలు వర మె  యగును
హిమమండలంబైన  యిహమును  మ రిపించు
మానసోల్లాస ధామం బె  యనగ

ఆ.
వేసవి  సెలవులను  వీర విహారముల్
ఊ హ గానె మిగుల నుష్ణ  మునను
సాహసముగ జనిన  సాధ్యమే  యనిమేము
బయలుదేరినాము   భాగ్య  వశము
అయినాపురపు శ్రీనివాసరావు, సెయింట్ లూయిస్, మిస్సోరి
ఎండలు మండెను దండిగ
బండలు మరిగెను సలసల బాబో యనగా
మెండుగ దాహంబాయెను
ఎండెను బావులు నదులును ఏదీ గమ్యం?

డా. రామినేని రంగారావు, పామూరు, ప్రకాశం జిల్లా

సమవయస్సున్న సఖులము సందడిగను
వేసవందున ఇష్టమౌ విడుదు లరసి
అడవి లోనున్న సెలయేళ్ళ యందు మునిగి
విరులు వెదజల్లు సుమరాగ విభవ మలర
మనసు ఉల్లాస మందగా మసలినాము

చావలి విజయ, సిడ్నీ

వేసవి సెలవులన్నను వేడి యుండు
బడులు లేని విద్యార్థులు బాగు సర్ది
మురిసి అమ్మమ్మగారిల్లు మూల సందు
గొందులందాడెదరు గోళి గోల గేము.

కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్
పందని, కారణంబడుగ పంట దివాకరు నామధేయమే
సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా
పందిని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో శంకరి పిల్లలకై కొనె
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి యుబికెన్పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked