పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
అంబా యని శునకమరిచె నందరు మెచ్చన్

గతమాసం ప్రశ్న:
వరదలు మేలుమేలనుచు పాడుచునాడిరి కేరళీయులే!!

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

గండికోట విశ్వనాధం, హైదరాబాదు
కురిసెను వాన వెల్లువలు కుండలపోతగ రాష్ట్ర మంతటన్‌,
విరిగెను వృక్షరాజములు, వీధులునిండ్లు మునింగె నీట, వే
తెరగుల కష్ట నష్టములు తీరినవేళ స్వయంకృషోన్నతిన్‌
వరదలు మేలుమేలనుచు పాడుచునాడిరి కేరళీయులే.

నేదునూరి . రాజేశ్వరి, న్యూజెర్సీ

సరిగమ పాట పాడుచును సాగర తీరము నందు కేళిలో
మురియుచు మేఘమా లికలు మోదము నందున వెల్గు లీనగన్
సరసపు వీణ నాదమ నిసంతస మొందుచు మైక మందునన్
వరదలు మేలు మేలనుచు పాడుచు నాడిరి కేరళీయులే

మైలవరపు సాయికృష్ణ, సాక్రమెంటొ, కాలిఫోర్నియా

వరదుడనంత పద్ముడు కృపాలు డమోఘ సునీల సుందరాం
గు రిపువినాశకారుడు ప్రకోపనియంత విశేష శ్రీనిధీ
వరుడు కృపాసముద్రుని ప్రభావముచేత విహార భూతులౌ
వరదలు మేలుమేలనుచు పాడుచు నాడిరి కేరళీయులే

విహారభూతి = విహారయాత్రికుల (వరదలు)

సూర్యకుమారి  వారణాసి, మచిలీపట్నం

వరుసఁగ నొందె  కష్టములు వారతి ఘోర తుఫాను  బాధితుల్
బరువగుచుండ  జీవనము  భాగ్య వశమ్ము  పరోపకారులై
కరుణను సల్పినట్టి సహకారము నార్థి క రూపమైన యా
వరదలు మేలుమేలనుచు పాడుచు నాడిరి  కేరళీయులే

కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్
పందని, కారణంబడుగ పంట దివాకరు నామధేయమే
సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా
పందిని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో శంకరి పిల్లలకై కొనె
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి యుబికెన్పుల్లెల

శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా

నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked