Month: August 2018

విశ్వామిత్ర 2015 – నవల ( 24 వ భాగము )

ధారావాహికలు
రాజు డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు.పక్కనే శివకుమార్ కూర్చుని ఉన్నాడు.వెనకాల అభిషేక్,శివహైమ కూర్చుని ఉన్నారు.రాజు సడన్ గా అన్నాడు"విశ్వామిత్ర ఎందరికో సహాయం చేశాడు సార్.స్లమ్స్ వెకేట్ చేయించడం వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళకి చాలామందికి ఉపాధి కల్పించాడు.ఆర్థికంగా ఆదుకున్నాడు.డాక్టర్ల చేత వైద్యమూ,మందులూ కూడా ఇప్పించేవాడు.పోలీస్ స్టేషన్ వచ్చిన తగాదాలను జగదీష్ అతని అనుచరుల దగ్గరకు వెళ్ళకుండా తనే చాలా మటుకు పరిష్కరించేవాడు.రేప్ అండ్ మర్డర్ కేసులైతే తనే నిందితులని చంపేసేవాడు.రాగింగ్ కేసుల్ని,స్టేషన్ కొచ్చి మగపిల్లలు వేధిస్తున్నారని కంప్లయింట్ చేసినా ,పోలీసులు పట్టించుకోని ఎన్నో కేసులు తనే పరిష్కరించాడు.కాని తన పేరు బయటకి పొక్కకుండా జాగ్రత్త పడేవాడు.కొన్ని కేసుల్లో,సెటిల్మెంటుల్లో నేనుకూడా ఇన్వాల్వ్ అవడం వల్ల నాకు విశ్వామిత్రతో చనువు పెరిగింది.ఇంత వయసొచ్చినా రెండు లాంగ్వేజెస్ లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాన