పద్యం-హృద్యం

ఏప్రిల్ – 2018

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
వంకాయన చెఱుకు రసము వడివడిఁ యుబికెన్
గతమాసం ప్రశ్న:
చైనాలో తెలుగుఁ నేర్చి చక్కగ బ్రదికెన్

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ

ఐనా యెందుకు తొందర
వైనము తెలియని పలుకులు వ్యర్ధము గాదా
వీనుల విందగు భాషని
చైనాలో తెలుగుఁ నేర్చి చక్కగ బ్రదికెన్

అయినాపురపు శ్రీనివాసరావు,సెయింట్ లూయిస్, మిస్సోరి.

(కొన్ని సవరణలతో)
జానుగ తెలుగునుఁ జదివిన
కానగును వివేకమంచు ఘనులే దెలుపన్
చీనీ దేశపు లిన్ హాంగ్
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్

శివప్రసాద్  చావలి, సిడ్నీ

(1)
చైనీయ వెండి తెరపై
వైనంబుగ తెలుగు సినిమ వెలుగొందన్ వో
చైనీయ సమీక్షకుడును
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రతికెన్

(2)
చైనా కేగి వరించిన
ఈ నాటి తెలుంగు ఐ. టి. యింతియు కోరన్
నానా పాట్లన్  వరుడును
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రతికెన్

పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా

నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్

పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా

నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked