వీక్షణం సాహితీ గవాక్షం-102 వ సమావేశం
-వరూధిని
వీక్షణం-102 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా ఫిబ్రవరి 14, 2021 న జరిగింది.
ఈ సమావేశంలో శ్రీ సుభాష్ పెద్దు (విద్యార్థి) గారి కథ "కోరికలు" కథా పఠనం జరిగింది.
విద్యార్థి గారు రాశి కంటే వాసి ముఖ్యమైనదనుకునే కథారచయిత. అతి తక్కువ కాలంలో చక్కని కథనాన్ని అలవరుచుకుని, విభిన్న వస్తువులతో ప్రయోగాత్మక రచనలు చేస్తున్నారు. స్త్రీ విజయం వీరి రచనల లక్ష్యం.
"కోరికలు" కథ కౌముది లో ప్రచురింపబడి అత్యంత ప్రజాదరణ పొందిన కథ.
అహోబిల క్షేత్ర దర్శనంలో రచయితకు ఎదురైన వ్యక్తులు, అనుభవాల ఆధారంగా రాసిన అద్భుతమైన కథ. ఈ కథా పఠనంలో స్త్రీ పాత్రల్ని డా. కె.గీత , పురుష పాత్రల్ని విద్యార్థి గారు కలిసికట్టుగా చదివి వినిపించడం విశేషం. కథని పాత్రలకనుగుణంగా యాసలో చదువుతున్నంతసేపూ సభాసదులు మంత్రముగ్ధులై విన్నారు.
కథలో ప్రధాన పాత్రధారిణి ముసలవ్వ. జైలు నించి విడుదలై తిన్నగా అహోబిల అహోబిల క్ష